కాంగ్రెస్ చానళ్ల పట్ల బాబుకు ప్రేమ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ చానళ్ల పట్ల బాబుకు ప్రేమ!

కాంగ్రెస్ చానళ్ల పట్ల బాబుకు ప్రేమ!

Written By news on Friday, June 14, 2013 | 6/14/2013

మీడియా స్వేచ్ఛపై బాబు విధానమిదేనా?
‘సాక్షి’ని బహిష్కరించడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనం

సాక్షి, హైదరాబాద్: భావప్రకటనా స్వేచ్ఛపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కనీస అవగాహన ఏమైనా ఉందా? అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు ప్రశ్నించారు. ‘సాక్షి’ మీడియాను వారి పార్టీ సమావేశాలకు బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడం ఆయన దివాలాకోరు తనానికి నిదర్శనమన్నారు. ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు పత్రికల పట్ల ప్రవర్తించే విధానం ఇదేనా? అని నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జూపూడి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కు అలవాటు పడిన చంద్రబాబు.. ప్రజాస్వామ్యమన్నా, ప్రజాస్వామ్య హక్కులన్నా సహించలేరని అన్నారు. సాక్షి లేనప్పుడు తనకు బాకా కొట్టే మీడియాను అడ్డుపెట్టుకొని చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాటలా వ్యవహరించారని ధ్వజమెత్తారు. సాక్షితో బాబు నిజస్వరూపం బయటపడే సరికి తట్టుకోలేకపోతున్నారన్నారు. ‘వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మీడియాను మేనేజ్ చేసుకొని తనకు అనుకూలంగా కథనాలు రాయించుకున్నారు. తన హయాంలో పల్లెలు సర్వనాశనమవుతున్న సమయంలో సబ్సిడీలు తప్పని రాయించుకున్నారు. వ్యవసాయం దండగన్నారు. ఉచిత విద్యుత్‌ను తప్పు పట్టారు. కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తోందంటూ ఎద్దేవా చేశారు.’ అని వివరించారు. సాక్షి వచ్చే సరికి వారి పప్పులు ఉడకటంలేదని బాబు గిలగిల్లాడుతున్నారన్నారు. 

అలాగని సాక్షి చంద్రబాబు యాత్రల్ని, టీడీపీ ప్రకటలను గానీ వారి పార్టీ కవరేజిని ఎక్కడా ఆపిందిలేదని గుర్తుచేశారు. అయితే పత్రిక స్వేచ్ఛను తట్టుకోలేని చంద్రబాబు, తనకు వ్యతిరేకంగా కథనాలు రావడానికి వీల్లేదని చెప్పడం దురదృష్టకరమన్నారు. ‘వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనేతగా మూడు దశాబ్దాల ప్రస్థానంలో ఎల్లో మీడియా వారు ఆయన్ని టార్గెట్ చేసి రాసేవారు. వైఎస్‌ను ఫ్యాక్షనిస్టుగా చిత్రీకరించేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా అధికారంలోకి వచ్చాక అడ్డదిడ్డంగా రాస్తున్నా ఆ రెండు పత్రికల రాతల గురించి అభ్యంతరం వ్యక్తం చేశారేకానీ ఎన్నడూ బహిష్కరించలేదు. వారికి ప్రకటనలు నిలిపివేయలేదు. కానీ చంద్రబాబు ఇందుకు పూర్తి విరుద్ధంగా ‘సాక్షి’ ఏర్పాటునే వ్యతిరేకించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై సాక్షికి ప్రకటనలు ఇవ్వకుండా జీవోలు తీసుకొచ్చారు’ అని జూపూడి దుయ్యబట్టారు. 

కాంగ్రెస్ చానళ్ల పట్ల బాబుకు ప్రేమ!

సీఎం కిరణ్ రెండు చానళ్లు (ఐ న్యూస్, ఏటీవీ), ఒక దిన పత్రిక (కృష్ణా పత్రిక) కొనుగోలు చేసినా, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఓ చానల్ (జీ 24గంటలు) కొనుగోలు చేసినా చంద్రబాబు పల్లెత్తుమాట అనడంలేదని జూపూడి అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడటమే తమ లక్ష్యమని చెప్పుకునే బాబు వారి చానళ్ల గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. 
Share this article :

0 comments: