జగన్‌ను అభిమానిస్తున్నందుకు ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » జగన్‌ను అభిమానిస్తున్నందుకు ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారు

జగన్‌ను అభిమానిస్తున్నందుకు ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారు

Written By news on Saturday, June 1, 2013 | 6/01/2013

ప్రజానేత స్వర్గీయ వైఎస్సార్ తనయుడు, అత్యంత ప్రజాదరణ కలిగిన యువనేత వై.ఎస్.జగన్‌ని వివిధ ఆరోపణల కింద ఏడాదిగా నిర్బంధంలోనే ఉంచి ఆయనకు బెయిలు రాకుండా ఈ కాంగ్రెస్, సీబీఐ లు కలిసి చార్జిషీట్ల పేరుతో కాలయాపన చేస్తున్నాయని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అర్థమైపోయింది. దినపత్రికలు చదివే, టీవీలు చూసే ప్రతి వ్యక్తీ జగన్‌కి జరుగుతున్న అన్యాయం గురించే చర్చించుకుంటున్నారు. ఏ చట్టం అయినా శిక్షతో పాటు, శిక్ష నుంచి ఉపశమనం కూడా కలిగించే వెసులుబాట్లతో నిర్మితమై ఉంటుంది.

అయినప్పటికీ జగనన్నకు బెయిల్ రావడం లేదు. దీన్ని బట్టి జగన్ ఎంత శక్తిమంతమైన నాయకుడో, ఎంత ప్రజాదరణ కలిగిన వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయనాయకులందర్నీ ఒకే చట్టం పరిధిలో ఒకే శిక్ష అమలు జరిగేలా చూడాల్సిన ప్రభుత్వం జగన్ విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఆరోగ్యశ్రీ, 104, 108, వృద్ధాప్య పింఛను, తెల్లరేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలు ప్రజాదరణ పొందటం వల్ల, రెండోసారి కూడా ఏక వ్యక్తిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన వైఎస్సార్‌ని ప్రజలు అంత సులభంగా మరచిపోలేరు.

ఆ నమ్మకంతోనే వైఎస్సార్ తనయుడి పార్టీకి ప్రజాదరణ మెండుగా ఉంది. దీనికి తోడు ప్రభుత్వ అనుచిత ఆలోచనలతో విద్యుత్ చార్జీలు, పన్నులు పెంచి, రేషన్ కార్డులు కుదించి, విద్యుత్ కోతలు విధించి ప్రజల్ని అష్టకష్టాలు పెడుతోంది. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాము చేసిన తప్పును గ్రహించి కాంగ్రెస్‌లో అతిపెద్ద ప్రజాదరణ కలిగిన నాయకుడైన వై.ఎస్.జగన్‌ను తక్షణం విడుదల చెయ్యాలి. జగనన్న బయటికి వస్తేనే ప్రజాసంక్షేమం, ప్రజాభ్యున్నతి.

- వట్టికూటి నర్సుబాయి, బచ్చోడు, ఖమ్మం జిల్లా

నిర్బంధించినంత మాత్రాన ప్రజాదరణ తగ్గుతుందా?!

వై.ఎస్.జగన్‌ని అక్రమంగా జైల్లో బంధించి, కాంగ్రెస్ చాలా పెద్ద తప్పు చేసింది. ఫలితంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కనుమరుగవ్వక తప్పదు. జగన్‌కు బెయిల్ వస్తుందనుకున్న ప్రతిసారీ సీబీఐ కుట్రపూరిత ఛార్జిషీట్లతో ఏదో ఒక పీటముడి వేస్తోంది. జగన్‌గారు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులను తప్పుదోవ పట్టిస్తోంది. బయట ఉన్న మంత్రుల సంగతిని మాత్రం గాలికొదిలేస్తోంది. నిజానిజాలను రాష్ట్రప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలొస్తాయా, ఎప్పుడు వైఎస్సార్ రుణం తీర్చుకుందామా అని ఎదురుచూస్తున్నారు. జగన్‌ను అక్రమంగా బంధించారని, పదవుల్ని, ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కోసం కుటిల రాజకీయాలను ఉపయోగిస్తున్నారని ప్రజలకు అర్థమైపోయింది.

రాష్ట్రంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్. ఆయనను నిర్బంధించినంత మాత్రాన ప్రజాదరణ తగ్గుతుందనుకోవటం అవివేకమే అవుతుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం పేద హృదయాలను తాకింది. అందుకే ఆయన్ని ప్రజలు ఆపద్బాంధవునిగా భావించారు. ఆయన మరణం తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఎన్నివిధాలుగా ఇబ్బందికి గురిచేస్తోందో గమనిస్తుంటే, హృదయం కదిలిపోతోంది. వై.ఎస్. పథకాలు అమలు కావాలంటే, జగన్ సీఎం కావాలి. అదే ప్రజల కోరిక.

- బి.సత్యనారాయణ, అమలాపురం 

మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
- See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=63282&Categoryid=11&subcatid=24#sthash.2YH5d9Xf.dpuf
Share this article :

0 comments: