మూడో శక్తిగా ఎదుగుతాడనే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మూడో శక్తిగా ఎదుగుతాడనే..

మూడో శక్తిగా ఎదుగుతాడనే..

Written By news on Tuesday, June 18, 2013 | 6/18/2013

జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలను సృష్టించేందుకే బెయిల్ ఇవ్వడంలేదు
సాక్షి చైతన్యపథంలో వక్తలు 

ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: రాష్ర్టంలో మూడు దశాబ్దాలుగా రెండు పార్టీల వ్యవస్థ నడుస్తోంది.. ఇప్పుడు మూడో శక్తిగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీలు కుట్రపన్ని జగన్‌ను జైలుపాలు చేశాయి.. జగన్ బయటకు రావాలని అల్లాను ప్రార్థిస్తున్నాం.. ఎన్ని కుట్రలు పన్నినా జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.. జగన్‌కు పెరుగుతున్న ఆదరణే ఇందుకు నిదర్శనం అంటూ పలువురు వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సోమవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని పద్మశాలీయ కల్యాణ మండపంలో సాక్షి చైతన్య పథం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సుబ్బిరెడ్డి మాట్లాడుతూ జగన్‌ను ఏడాదిపాటు జైలులో ఉంచి సీబీఐ ఇప్పటివరకు ఏ ఆధారాలు సేకరించలేకపోయిందన్నారు. 

మరో నాలుగు నెలలు సమయం కావాలంటూ కోర్టును కోరిన సీబీఐ ఎలాంటి అవినీతికి పాల్పడని జగన్‌పై ఏం నిర్ధారణ చేస్తుందని ప్రశ్నించారు. ఆడిటర్ మధుసూదన్ మాట్లాడుతూ వైఎస్సార్ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలే నేడు అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కూరగాయల మార్కెట్ అసోసియేషన్ కార్యదర్శి దాదాపీర్ మాట్లాడుతూ ప్రజల కష్టాలు తీర్చేందుకు జగన్ ప్రజల మధ్యకు వస్తారన్నారు. ఇంటర్ విద్యార్థిని పద్మిని మాట్లాడుతూ విద్యార్థులంతా జగనన్న వెంటే ఉంటారన్నారు. అందరి బాగుకోరే జగన్‌ను కాంగ్రెసోళ్లు అన్యాయంగా జైలులో పెట్టారంటూ వృద్ధురాలు రసూల్‌బీ కన్నీటి పర్యంతమైంది. జగన్ బయటకు రావాలని అల్లాను ప్రార్థిస్తున్నామని, ఇటీవలే కమలాపురం సామిని అడుగగా జగన్ తొందరలో బయటికి వస్తాడని చెప్పినట్లు వృద్ధురాలు తెలిపింది. బీటెక్ విద్యార్థి భరత్‌తేజ మాట్లాడుతూ జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలను సృష్టించడానికే సీబీఐ అతడిని బెయిల్ రాకుండా చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. వ్యాఖ్యాతగా స్వప్న వ్యవహరించారు. 

జగన్ ప్రజల హృదయాల్లో ఉన్నారు..

వైఎస్ జగన్ జైల్లో ఉన్నారులే అని కాంగ్రెస్, టీడీపీ వాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ జగన్ ప్రజల్లో ఉన్నారన్న విషయం పాపం వారికి తెలియడం లేదు. జగన్ జనంలో నుంచి పుట్టిన నాయకుడు. జైల్లో ఉన్నప్పటికీ ఆయనను ముఖ్యమంత్రిని చేస్తామని విజయమ్మకు భరోసా ఇస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ మీకు అండగా ఉంటారు. ఒక అన్నగా, తమ్ముడిగా, కుమారుడిలా రాష్ట్ర ప్రజలు జగన్‌ను చూసుకుంటున్నారు. విజయమ్మ వెంటే మేమంతా ఉంటాం. ఓట్ల రూపంలో మా అభిమానం ఎలా ఉంటుందో చూపిస్తాం.
- గరిశపాటి లక్ష్మిదేవి, ప్రొద్దుటూరు
Share this article :

0 comments: