రామోజీ ఫిల్మ్‌సిటీ సితారా హోటల్‌లో అక్రమ దందా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామోజీ ఫిల్మ్‌సిటీ సితారా హోటల్‌లో అక్రమ దందా!

రామోజీ ఫిల్మ్‌సిటీ సితారా హోటల్‌లో అక్రమ దందా!

Written By news on Tuesday, June 25, 2013 | 6/25/2013

రామోజీ ఫిల్మ్‌సిటీ సితారా హోటల్‌లో అక్రమ దందా!
‘కాగ్’ అధికారుల ఆడిట్ పరిశీలన సందర్భంగా గుర్తింపు
ఎక్సైజ్ అధికారులకు సమాచారంతో దాడి చేసిన వైనం
ఎక్సైజ్ రూల్ 13, మద్య విక్రయాల చట్టం 2005 కింద కేసు
రూ. లక్ష జరిమానా కట్టిన మద్య విమోచన ‘ఉద్యమకారుడు’!

సాక్షి, హైదరాబాద్: మద్య నిషేధం కోసం ఆనాడు మహిళలు చేపట్టిన ఉద్యమాన్ని హైజాక్ చేసి.. ‘ఈనాడు’ నడిపించిన ఉద్యమంగా క్రెడిట్ కొట్టేసిన రామోజీరావు తన సొంత హోటల్‌లో మద్యం అక్రమంగా అమ్ముతూ అడ్డంగా దొరికిపోయారు. అనుమతి లేని ప్రాంతంలో లిక్కర్ అమ్ముతూ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో రామోజీ ఖాతాలో మరో కేసు నమోదైంది. దీంతో ఆయన రూ.లక్ష జరిమానా కట్టాల్సి వచ్చినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.. రాజ ధాని శివార్లలోని రామోజీ ఫిల్మ్‌సిటీలో సితారా బార్ అండ్ రెస్టారెంట్ పేరిట 2006 నుంచి మద్యం అమ్ముతున్నారు. కేవలం గ్రౌండ్ ఫ్లోర్‌లో అమ్మేందుకు మాత్రమే అనుమతి పొందినా.. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు, చట్టవిరుద్ధంగా మొదటి అంతస్తులో కూడా మద్యం విక్రయిస్తున్నారు. ఈ తతంగం ఎప్పటినుంచో కొనసాగుతోంది. అయితే ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీలోని సితారా బార్‌ను సందర్శించారు. అనుమతి లేని ప్రాంతంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతుండడాన్ని గుర్తించారు. ఈ విషయం ఎక్సైజ్ శాఖకు పంపిన నోట్‌లో కూడా ప్రస్తావించారు. దీంతో అప్రమత్తమైన రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు ఈనెల ఐదో తేదీన సితారా బార్‌ను సందర్శించారు. 

ఆ సమయంలోనే రామోజీ కాసుల కక్కుర్తి బయటపడింది. అనుమతి లేని ప్రాంతంలో మద్యం అమ్ముతున్నది నిజమేనని అధికారులు నిర్ధారించారు. అదే రోజున ఎక్సైజ్ రూల్ 13, మద్య విక్రయాల చట్టం 2005 కింద కేసు నమోదు చేశారు. ఈ రూల్ కింద జరిమానా కట్టే వెసులుబాటు ఉండడంతో రామోజీ రూ.లక్ష జరిమానా కట్టినట్లు కూడా సమాచారం. జరిమానా కట్టి కేసు నుంచి ఉపశమనం పొందవచ్చు కానీ, నిత్యం నీతిపురాణాలు చెప్పే రామోజీ... డబ్బు కోసం అనుమతి లేని ప్రాంతంలో మద్యం అమ్ముతూ పట్టుబడటమే గమనార్హం. తన పలుకుబడితో ఎక్సైజ్ అధికారులను, పోలీసులను ఫిల్మ్‌సిటీ దరిదాపులకు అడుగుపెట్టనివ్వని రామోజీ.. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం కొనసాగుతున్న సమయంలో కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో అక్రమంగా మద్యం విక్రయించారనే ప్రచారం ఉంది. తాజాగా నమోదైన కేసు ఈ ప్రచారానికి బలాన్నిస్తోందని ఎక్సైజ్ అధికారులే 
Share this article :

0 comments: