సింగరేణి కార్మికులకు వైఎస్‌ఆర్‌టీయూసీ అండ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సింగరేణి కార్మికులకు వైఎస్‌ఆర్‌టీయూసీ అండ

సింగరేణి కార్మికులకు వైఎస్‌ఆర్‌టీయూసీ అండ

Written By news on Sunday, June 30, 2013 | 6/30/2013

- యూనియన్ రాష్ట్ర కన్వీనర్ బి.జనక్‌ప్రసాద్ 

గోదావరిఖని, న్యూస్‌లైన్: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 64వేల మంది గని కార్మికులకు వైఎస్‌ఆర్‌టీయూసీ అనుబంధ సంఘమైన సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అండగా నిలుస్తోందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని యూనియన్ రాష్ట్ర కన్వీనర్ బి.జనక్‌ప్రసాద్ తెలిపారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఎంఎస్.రాజ్‌ఠాకూర్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమని, గని కార్మికులకు మనోధైర్యాన్ని కలిగించే నిర్ణయాలు తీసుకుంటారని ఆయన తెలిపారు. 

రిటైర్డు సింగరేణి కార్మికులకు చెల్లిస్తున్న 25 శాతం పెన్షన్‌ను 40 శాతంకు పెంపుదల చేయడం, గతంలో రిటైరై పెన్షన్ తీసుకుంటున్న వారికి నెలకు రూ.10 వేలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికులకు సాధారణంగా లాభాలలో 25 శాతం వాటా చెల్లించడంతో పాటు సింగరేణి నికర లాభాల నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న డివిడెండ్ నుంచి మరో 25 శాతం వాటా చెల్లిస్తామన్నారు. పని స్థలాల్లో కార్మికుడు ఎలా మరణించినా దానిని సహజమరణంగా కాకుండా గని ప్ర మాదంగా గుర్తిస్తామని, నష్టపరిహారాన్ని రూ. 20 లక్షలకు పెంపుదల చేయిస్తామ న్నారు. పదవీ విరమణ పొందే కార్మికులకు ఐదేళ్ల ముందే సొంత ఇంటినిసమకూర్చే బాధ్యతను తీసుకుంటామన్నారు. వైఎస్ జారీ చేసిన పట్టాల్లో ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం నుంచి రుణాలందిస్తామని, పదవీ విరమణ పొందిన కార్మికుడికి, అతనిభార్యకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యసౌకర్యం కల్పించనున్నామన్నారు.
Share this article :

0 comments: