కాంగ్రెస్,టిడిపి డ్రామాలు: శోభానాగిరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » కాంగ్రెస్,టిడిపి డ్రామాలు: శోభానాగిరెడ్డి

కాంగ్రెస్,టిడిపి డ్రామాలు: శోభానాగిరెడ్డి

Written By news on Tuesday, June 18, 2013 | 6/18/2013

కాంగ్రెస్, టీడీపీలపై వైఎస్‌ఆర్ సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా టీడీపీ, కాంగ్రెస్‌లు రాజకీయ డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. టీడీపీ నేతల తీరు దొంగే దొంగన్నట్లుగా ఉందన్నారు. అవిశ్వాసం పెట్టకుండా చంద్రబాబు విదేశీపర్యటనకు ఎందుకు వెళ్లారు? అని ప్రశ్నించారు. ఒకవైపు కళంకిత మంత్రులంటూ, మరోవైపు టీడీపీ డ్రామాలాడుతోందని పేర్కొన్నారు. 

ఐఎంజీ స్కాంపై సీఎం కిరణ్ ఎందుకు నోరు మెదపడంలేదు? క్విడ్‌ప్రోకోనే జరగకపోతే వైఎస్ జగన్ మీద కేసు ఎందుకు? మంత్రులు తప్పు చేయకుంటే హైకోర్టులో ప్రభుత్వం ఎందుకు పిటిషన్ వేయలేదు? జగన్‌ను ఉచ్చులో ఉంచేందుకే ప్రభుత్వం మౌనం దాల్చిందా? నిర్ణయాలు తీసుకున్న మంత్రులు తప్పు చేయకుంటే జగన్ దోషి ఎలా అవుతారు? రాజీ నామాలు చేసినంత మాత్రాన మంత్రులు తప్పుచేసినట్లు కాదంటున్నారు. మరి అభియోగాలున్నంత మాత్రాన జగన్‌ను ఎలా తప్పు పడతారు? అని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. 
Share this article :

0 comments: