పశ్చిమగోదావరిలో ముగిసిన షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పశ్చిమగోదావరిలో ముగిసిన షర్మిల పాదయాత్ర

పశ్చిమగోదావరిలో ముగిసిన షర్మిల పాదయాత్ర

Written By news on Tuesday, June 4, 2013 | 6/04/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో పూర్తి అయింది. మే12న ఈ జిల్లాలో అడుగు పెట్టిన షర్మిల 13 నియోజకవర్గాలలో 24 రోజులపాటు 278.4 కిలోమీటర్లు నడిచారు. చింతలపూడి, పోలవరం, గోపాలపురం, తాడేపల్లి గూడెం, ఉండి, భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. 10 పట్టణాలు, 105 గ్రామాలలో నడిచారు. 10 బహిరంగ సభలలో ప్రసంగించారు. 12 విగ్రహాలను విష్కరించారు. 5 రచ్చబండలు నిర్వహించారు. ఈ జిల్లాలోని రావికంపాడులో షర్మిల అడుగుపెట్టి 2 వేలు కి.మీ మైలురాయి దాటారు. 

తూర్పు గోదావరి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో ఆమె నడుస్తారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్‌, రాజానగరం, అనపర్తి, మండపేట, రామచంద్రాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ సిటీ, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, పత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారు. 

ప్రజాప్రస్థానంలో భాగంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2003లో మే17న రాజమండ్రి బ్రిడ్జిపై నడిచారు. 2011లో ఫిబ్రవరి 8న హరిత యాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రాజమండ్రి బ్రిడ్జిపైన నడిచారు. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా షర్మిల ఈరోజు రాజమండ్రి బ్రిడ్జిపై నడుస్తున్నారు. ఈ సందర్భంగా వర్షం ఆమెకు స్వాగతం పలికింది
Share this article :

0 comments: