పల్లెలు చీకట్లో మగ్గిపోతున్నాయి: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పల్లెలు చీకట్లో మగ్గిపోతున్నాయి: విజయమ్మ

పల్లెలు చీకట్లో మగ్గిపోతున్నాయి: విజయమ్మ

Written By news on Friday, June 28, 2013 | 6/28/2013

ఘట్ కేసర్: ఐక్యమత్యంతో ప్రజల్లోకి వెళ్దాం, ప్రత్యర్థులకు సత్తా చూపాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికల వచ్చినా పార్టీ సిద్ధంగా ఉంది అని విజయమ్మ అన్నారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సర్కార్‌కు చిత్తశుద్ధి లేదు అని విజయమ్మ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంది ఆమె హెచ్చరించారు. రాబోయే ఏ ఎన్నికలనైనా ఆషామాషీగా తీసుకోవద్దు అని విజయమ్మ హెచ్చరించారు.

పల్లెలు చీకట్లో మగ్గిపోతున్నాయని, ప్రజాసమస్యలపై స్పందించాలని, అప్పుడే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందన్నారు. ప్రతి పంచాయతీపై పార్టీ జెండా ఎగురవేయాలని, ఈ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కరువయిందని, పరిశ్రమలు పవర్‌హాలీడే ప్రకటిస్తున్నాయని, వేలాది పరిశ్రమలు మూతపడ్డాయని, దాంతో లక్షలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారని విజయమ్మ తెలిపారు.

ఈ సర్కారుకి మద్యంపై తప్ప సాగు, తాగునీటిపై ధ్యాస లేదు అని, మహిళలపై అత్యాచారాల్లో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంది అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లు పూర్తయినా జగన్‌ కేసు ఎందుకు పూర్తి చేయడం లేదు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా అధికార, ప్రతిపక్షాలు కలిసి పనిచేస్తున్నాయని విజయమ్మ మండిపడ్డారు. వైఎస్ విజయమ్మ అధ్యక్షతన జరిగిన రంగారెడ్డి జిల్లా వైఎస్ఆర్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఉత్తరాఖండ్‌ మృతులకు పార్టీ నేతలు నివాళి అర్పించారు.

Share this article :

0 comments: