షర్మిల వెంట వానలోనే నడిచిన జనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల వెంట వానలోనే నడిచిన జనం

షర్మిల వెంట వానలోనే నడిచిన జనం

Written By news on Saturday, June 8, 2013 | 6/08/2013

* జోరువానలోనే సాగిన మరో ప్రజాప్రస్థానం
* షర్మిల వెంట వానలోనే నడిచిన జనం
* అడుగడుగునా ఆదరణ.. హారతులు పట్టి ఆశీర్వాదాలు
* ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమంటూ షర్మిల ఉద్వేగం

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అమ్మా... నువ్వు నడుస్తూ ఆ చెయ్యి ఊపుతుంటే మీ నాన్నను చూసినట్టే ఉంది బిడ్డా.. మీ నాన్న ఉన్నన్ని రోజులు వర్షం పిలిస్తే పలికింది. ఆయనతోనే వెళ్లిపోయింది. నువ్వు పాదం పెట్టావు... మబ్బు కమ్ముకొస్తుంది... తొలకరి మొదలైనట్టే బిడ్డా..!’’ 
- వణుకుతున్న స్వరాన్ని సవరించుకుంటూ షర్మిలతో 75 ఏళ్ల వృద్ధురాలు వనజాక్షమ్మ అన్న మాటలివీ!

సాయంత్రం 6.22 అవుతోంది.. తోకాడ గ్రామంలో వర్షం కురుస్తోంది.. ఆ వానలో ఓ చంటిబిడ్డ తల్లి రోడ్డు పక్కన నిలబడి ఉంది. ఎడమ చంకలో బిడ్డ.. కుడిచేతిలో హారతి పల్లెం.. చినుకులకు ఎక్కడ ఆరిపోతుందోనన్న ఆరాటంతో సగం కొంగు హారతికి అడ్డంగా పెట్టింది.. మరో సగం చంటిబిడ్డపై కప్పింది.. షర్మిల వచ్చే వరకు హారతి ఆరనివ్వలేదు. షర్మిల రాగానే హారతి పట్టి, ఆనందంతో ఆశీర్వదించింది!!

ఇందులో మొదటి ఘటన వైఎస్సార్ కుటుంబంపై నమ్మకానికి అద్దం పడితే.. రెండోది ఆ కుటుంబంపై ప్రజలకు ఉన్న అభిమానానికి నిదర్శనంగా నిలిచింది. తూర్పుగోదావరి జిల్లాలో సాగిన మరో ప్రజాప్రస్థానంలో ఈ అపురూప దృశ్యాలు కనిపించాయి. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం రాజానగరం నియోజకవర్గంలో సాగింది. తోకాడ గ్రామంలో మహిళలంతా వర్షంలో తడుస్తూనే షర్మిల కోసం ఎదురు చూశారు. షర్మిల రచ్చబండపై అడుగు పెట్టగానే వాన జోరందుకుంది. కాసేపటికే భారీ వర్షంగా మారింది. అయినా మహిళలందరూ అలాగే కూర్చున్నారు. హోరున కురుస్తున్న వర్షంలో తడుస్తూనే షర్మిల ప్రసంగించారు. ప్రసంగం అనంతరం వర్షంలోనే మూడు కిలోమీటర్లు నడిచారు. గ్రామాల్లో మహిళలు, వృద్ధులు కూడా వానలోనే ఆమెతోపాటు నడిచారు. రచ్చబండలో షర్మిల ఏమన్నారో ఆమె మాటల్లోనే..

మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా..
‘‘అమ్మా... ఇంత భారీ వర్షంలో తడుస్తూ నా కోసం ఎదురు చూస్తున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను. నాన్న గారి మీద, జగనన్న మీద ఇంత అభిమానం, ఆప్యాయత, అనురాగం చూపిస్తున్న మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. అమ్మా..! ఇప్పుడున్న ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం. ఈ పాలకులు ప్రజల నుంచి వచ్చిన వాళ్లు కాదు. ఢిల్లీ నుంచి సీల్డు కవర్‌లో వచ్చిన వాళ్లు. వీళ్లకు ప్రజా సమస్యలు అంటే ఏమిటో అర్థం కావు. ఈరోజు రైతులకు మద్దతు ధర లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందటం లేదు, మహిళలకు వడ్డీ లేని రుణాలు లేవు, ఇవాళ ఏ పల్లెకు వెళ్లి ఏ మహిళను పలకరించినా ‘అమ్మా... పూట గడవని పరిస్థితుల్లో మా పిల్లలను బడికి మాన్పించి పనులకు పంపిస్తున్నామమ్మా..’ అని బాధపడుతూ చెప్తున్నారు. 

ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని దించేయడానికి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెడితే చంద్రబాబు నాయుడు అవిశ్వాసానికి మద్దతివ్వకుండా రెండు చేతులు అడ్డం పెట్టి ఈ ప్రభుత్వాన్ని కాపాడారు. ఈ పన్నుల భారంలో కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి ఎంత పాపం ఉందో చంద్రబాబు నాయుడు గారికి కూడా అంతే పాపం ఉంది. వీళ్లిద్దరూ కలిసి కుట్రలు చేసి, సీబీఐని కలుపుకొని జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టారు. ఏడాది కాలంగా జైల్లోనే ఉంచారు. అమ్మా..! జగనన్న ఏ తప్పూ చేయలేదు. జైల్లో జగనన్న ధైర్యంగా ఉన్నారు. త్వరలోనే బయటికి వస్తారు, రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయి వైఎస్సార్ సువర్ణయుగంలో అమలైన ప్రతి పథకానికి మళ్లీ జీవం పోస్తారు. అవకాశం వచ్చిన రోజున ఈ కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించాలని మా ప్రార్థన.’’
Share this article :

0 comments: