వారంతా కళ్లకు గంతలు కట్టుకున్నారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వారంతా కళ్లకు గంతలు కట్టుకున్నారా?

వారంతా కళ్లకు గంతలు కట్టుకున్నారా?

Written By news on Saturday, June 29, 2013 | 6/29/2013

జగన్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ అంటోంది. ‘‘ప్రభావితం చేస్తారని ఎందుకనుకోవాలి?’’ అని సీబీఐ వారిని కోర్టు ఎందుకు ప్రశ్నించదన్నది నా ఆవేదన. ‘సీబీఐ అరెస్టు చేస్తుందేమో, ముందస్తు బెయిల్ ఇవ్వండి’ అని జగన్ తరఫు న్యాయవాది అడిగినప్పుడు - ‘‘అరెస్టు చేస్తారని ఎందుకనుకోవాలి’’ అని ఆనాడు కోర్టు వ్యాఖ్యానించలేదా? మరి అదే ‘లా’జిక్ ఇప్పుడు ఏమయింది? ఇలా ప్రశ్నించడం కూడా మన న్యాయవ్యవస్థను ధిక్కరించడమేమో నాకు తెలీదు. కానీ కళ్లెదుటి అన్యాయానికి నా మనసు కలతచెందుతోంది.


ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మనిషిని ఎంతో సునాయాసంగా నెలల తరబడి జైల్లో నిర్బంధించడం చూస్తుంటే ఈ పరిస్థితిని ఏ విధంగా వర్ణించాలో కూడా అర్థం కాని అయోమయం దాపురించింది. ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రే. ఓ విధంగా చూస్తే ఇది రాజకీయ హత్యాయత్నం కాదుకదా అనే అనుమానం రాక మానదు. ప్రత్యేకించి ఓ వ్యక్తిని టార్గెట్ చేసి నడిపించే రాజకీయాన్ని ఇంతకన్నా ఏమంటారు మరి! ఓవ్యక్తిని దోషిగా నిర్థారణ అయితే తదనుగుణంగా శిక్షించడంలో తప్పులేదు. చట్టం తన పని చేసుకుంటూ పోతే ఎవరూ ఆక్షేపించరు. కానీ నిందారోపణలు మాత్రమే ఎదుర్కొంటూ, ఆ ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలను చూపించే స్థితిలో లేనప్పుడు ఆ వ్యక్తిని ఒట్టి పుణ్యానికి నిర్బంధించడం ఎంతవరకు సబబో సుప్రీంకోర్టు పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జగన్ కేసులో నిజంగా న్యాయపరంగా నడుస్తున్నట్లు ఎవరి అంతరాత్మకైనా అనిపిస్తోందా అని నేను ప్రశ్నిస్తున్నాను. అరెస్టు తర్వాత ఛార్జ్‌షీట్ వేయడానికి ఎంతకాలం కావాలనే ప్రాథమిక సూత్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా జనాదరణ కలిగిన ఓ నేతని జైలు జీవితానికి పరిమితం చేయడం నిజంగా ప్రజాస్వామ్యం కిందకే వస్తుందా అనే సందేహం పామరులను సైతం అలోచింపజేస్తోంది. దేశంలో ఎన్నో కేసులను సీబీఐ పరిశోధించింది. కానీ ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చార్జిషీట్‌లు దాఖలు చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. ఆర్థిక నేరాల ఆరోపణలు దేశానికి కొత్తేమీ కాదు. ఈ విధమైన ఆరోపణల్ని ఇందిరాగాంధీ కుటుంబం కూడా ఎదుర్కొంది. ఇప్పుడు జగన్ కేసులో అనుసరించిన విధానాలనే సీబీఐ ఆనాడూ పాటించిందా అని ఓసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు తన ఉనికిని కాపాడుకునేందుకు సీబీఐని కాంగ్రెస్ ఓ అస్త్రంగా వాడుకుంటోంది.

ఎటువంటి పదవులు లేని వ్యక్తి తన వ్యాపారం తను చేసుకుంటూ అభివృద్ధి చెందితే అది ఏ విధంగా తప్పవుతుంది? మోసం జరిగిందని అంటున్నారు. మోసపోయిన వారు ముందుకు రావాలి కదా! ఇన్నేళ్లయినా, ఒక్కరు కూడా ముందుకు రాకపోయినా బలవంతంగా సీబీఐ వారు స్టేట్‌మెంట్‌లు రాయించుకోవడం చూస్తుంటే మనం ఏ యుగంలో ఉన్నామో అర్థమవుతోంది. రాజకీయంగా ఎవరైనా ప్రజాదరణ పొందితే జైలు జీవితం గడపాల్సిందేనన్న సంప్రదాయాన్ని సోనియా తీసుకొస్తున్నట్టు ఉన్నారు. అయినా జగన్ చేసిన తప్పేమిటి? కాంగ్రెస్ అధినేత్రి సోనియా మాట వినకపోవడమే కదా? అదే నేరమా? జగన్ ఒక్కరే నేరం చేస్తుంటే అందరూ కళ్లప్పగించి చూస్తుండిపోయారా!

రాత్రికి రాత్రే బలవంతగా అందర్నీ బెదిరించి ఆయన ఫైళ్లు లాక్కెళ్లిపోయారా? లేక వారంతా కళ్లకు గంతలు కట్టుకున్నారా? అలా చేస్తే ఇంత కాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? అప్పుడు ప్రశ్నించే ధైర్యం, శక్తి వారికి లేవా? ఈ రకంగా చేస్తూ ఎవర్ని ఎవరు మోసం చేస్తున్నారు.? ఎందుకు చేస్తున్నారు? ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కోర్టుల నుంచి ఎంతకూ రాని (తాము ఆశించిన) తీర్పును తామివ్వడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు.

- కొండా రాజేశ్వరరావు, విజయవాడ

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: