మాకున్న ఏకైక ఆశ... జగనన్న - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాకున్న ఏకైక ఆశ... జగనన్న

మాకున్న ఏకైక ఆశ... జగనన్న

Written By news on Saturday, June 15, 2013 | 6/15/2013

 రాజకీయ నాయకుడు ఇన్ని మంచి పనులు చేయొచ్చా అని తెలిసొచ్చింది. ఒక ఇంటిపెద్దగా, ఒక ‘మనసున్న మారాజు’లా ఆయన ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరిచారు. అంతా బాగుంది అని ఊపిరి పీల్చుకునేలోపు ఆంధ్రప్రదేశ్‌ని కంటతడి పెట్టించే దుర్వార్త. దేవుడు కనపడితే ఇప్పటికీ ఒకటే అడుగుతాను.

‘‘ఆకలేస్తే రాజన్న ఇంత అన్నం పెట్టాడు, అది తప్పా? మా గుండె జబ్బున పడితే ఉచితంగా ఆపరేషన్లు చేయించాడు, అది తప్పా? పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పించాడు, అది తప్పా? ఇంకా ఎన్నో పథకాలు పెట్టి పేదవారి కళ్లలో ఆనందం చూడాలనుకున్నారు. అదే ఆయన చేసిన తప్పా? మంచి మనుషులు కరువైన ఈ ప్రపంచంలో మాకు ఇన్ని మంచి పనులు చేసిన ‘మా దేవుణ్ని ఎందుకు తీసుకెళ్లావ్ దేవుడా?’’ అని అడుగుతాను. కుట్రలు, కుతంత్రాలతో నిండిపోయిన ప్రస్తుత రాజకీయాలలో సామాన్యుడిని పట్టించుకునేవారే లేరు. మాకున్న ఒకే ఒక్క ఆశ ‘జగనన్న’. కచ్చితంగా రాజన్న ఆత్మ జగనన్నలో ఉంది. 

అందుకే రాత్రి పగలు, ఎండ వాన, తుఫానులు తేడా లేకుండా ఓదార్పు యాత్రలు, దీక్షలు చేశాడు. అందుకే ‘అత్యంత శక్తిమంతమైన వ్యక్తులలో ఒకరు’గా చోటు సంపాదించాడు. అది జగన్‌కే సాధ్యమైంది. ఆయన చిరునవ్వే మాకు కొండంత బలం. ఇప్పుడు రాజన్నని అభిమానించే ప్రతి ఒక్కరూ చేయాల్సింది షర్మిలమ్మ అడుగులతో అడుగు కలిపి 2014లో జగనన్నని సీఎంని చేసి, మంచి మనుషుల్ని, మనసున్న మనుషుల్ని కాపాడుకోవడం.

- గోపు మల్లికార్జున్‌రెడ్డి, చిన్న ఓబినేనిపల్లి, ప్రకాశం జిల్లా

వజ్రాయుధం సిద్ధంగా ఉంది!

మన ప్రియతమ నేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అన్నా, ఆయన తనయుడు జగన్ అన్నా మాకెంతో అభిమానం. అందుకే మేము సీబీఐవాళ్లకి, టీడీపీ నాయకులకి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఏదో చేసేద్దాం అని వీరంతా మా జగన్‌బాబును నానా ఇబ్బందులు పెడుతూ నిర్బంధించారు. అయితే, వారికి తెలిసో తెలీకో ముడి వజ్రాన్ని సానబెట్టినట్లుగా మా జగన్‌ను మిరుమిట్లుగొలిపే వజ్రంలా... కాదు కాదు.. వజ్రాయుధంలా మార్చేశారు. ‘వజ్రాయుధం’ అతి త్వరలో బయటకు వచ్చి, వీరందర్నీ తుత్తునియల్ని చేసి, బంగాళాఖాతంలో కలిపేస్తుంది.

అప్పుడు మన రాష్ట్రానికి, దేశానికి పట్టిన చీడ వదులుతుంది. ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా మేమంతా ఎదురుచూస్తున్నాం. మొన్నటికి మొన్న చంద్రబాబు తిరుపతి వెళ్లి వెంకన్నబాబును ప్రార్థించాడట అవినీతిని అంతమొందించమని! ఆ ఏడుకొండలవాడు ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడో! ఎందుకంటే, అవినీతి, నమ్మకద్రోహం, మోసం, దుర్మార్గం వీటన్నింటి ప్రతిరూపం చంద్రబాబే. భస్మాసురుడు వరం కోరినప్పుడు ఆ పరమేశ్వరుడు కూడా ఇలాగే ఆశ్చర్యపోయి ఉంటాడు. ‘తన గొయ్యి తనే తవ్వుకుంటున్నాడని, తన అంతం తానే కోరుకుంటున్నాడని. ఏది ఏమైనా అతి త్వరలో జగన్ బయటకొచ్చి ఈ చెత్త బ్యాచ్‌కి మోక్షం ప్రసాదించి, మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంచి పాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 

- పెదపాటి సూర్యప్రకాశరావు, వరలక్ష్మి, అగనంపూడి, విశాఖ
Share this article :

0 comments: