జగన్... జాతీయ నాయకుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్... జాతీయ నాయకుడు

జగన్... జాతీయ నాయకుడు

Written By news on Friday, June 21, 2013 | 6/21/2013

‘ఎంతకాలం బతికాం అన్నది కాదు, బతికినంతకాలం ఎలా బతికాం అన్నదే ముఖ్యం’ అని నమ్మి, ఆచరించిన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి జగన్. తన తండ్రి మరణవార్త విని వందల సంఖ్యలో అభిమానులు గుండె పగిలి చనిపోయారని తెలిసి, చలించిపోయిన మంచి మనిషి జగన్. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఇచ్చిన మాటకోసం ‘ఓదార్పు యాత్ర’ మొదలుపెట్టినప్పుడే, ఈ రాష్ట్రంలోని ప్రతి కుటుంబమూ ఇలాంటి బిడ్డ ఉండాలని మనసులో అనుకున్నారు.

ఓదార్పుయాత్రలో నిష్కపటమైన ప్రతి పేదవాడి హృదయాన్ని, బాధల్ని, తన తండ్రి మీద ఉన్న అభిమానాన్ని చూసి, జగన్ ఉద్వేగం చెందారు. మానవత్వం, దేవుడంటే నమ్మకం, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటం అనే ఈ మూడు సుగుణాల వల్లనే జగన్ ప్రజానాయకుడయ్యారు. తండ్రి చనిపోయాక గత మూడేళ్లుగా జగన్ ఎన్నో అనుభవాలను చవిచూడడంతో అతి పిన్న వయసులోనే ఈ కుమ్మక్కు, కుట్ర రాజకీయాల నుంచి ఎంతో నేర్చుకున్నారు. ఇప్పుడిక వై.ఎస్.జగన్ ముమ్మాటికీ జాతీయ నాయకుడు.

- కె.రజని, విజయవాడ
ప్రజలు జగన్‌కి అండగా ఉన్నారు
ప్రజానాయకుడైన జగన్‌గారిని నిర్బంధించి, వేధిస్తున్న సీబీఐ ఒక వాస్తవం విస్మరిస్తోంది. సీబీఐ అంటున్న ఈ అవినీతి, క్విడ్ ప్రోకోలు అసలు వర్తించేది చంద్రబాబుగారికే. కనుక మొదట ఆయన్నే జైల్లో పెట్టాలి. తను నీతిమంతుడిననీ, సత్యహరిశ్చంద్రుడినని నిరూపించుకోవడానికి బాబుగారు ఎన్నో తిప్పలు పడ్డారు. సీబీఐ అంటే భయపడి, కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. తనపై దర్యాప్తును ఆపించుకున్నారు. ఇలా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రాజకీయం చంద్రబాబుకి అలవాటే. ప్రతిపక్షనేత అయివుండీ కాంగ్రెస్‌తో చేతులు కలపడం ద్వారా ఎన్టీయార్ ఆత్మకు సైతం మనశ్శాంతి లేకుండా చేస్తున్నారాయన. 

ఆయన పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలు భస్మాసుర ‘హస్త’ రూపంలో తిరిగి ఆయన్నే అంతమొందిస్తాయి. ప్రజాదరణ ఎటూ లేదు కాబట్టి చివరికి ఆయన కాంగ్రెస్ గూటికి చేరినా ఆశ్చర్యంలేదు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్‌కు వ్యతిరేకంగా దుష్ర్పచారాలు చేస్తున్న చంద్రబాబు ఒక విషయం తెలుసుకోవాలి. ఆయనలా జగన్ పిరికివారు కారు. విచారణను తప్పించుకోడానికి ఎవరి పంచనా చేరలేదు. జగన్ ధీశాలి. ఇచ్చిన మాట కోసం కట్టుబడిన నాయకుడు. కాంగ్రెస్, సీబీఐ, టీడీపీ.. జగన్‌ను ఎంతోకాలం ఇబ్బందిపెట్టలేవు. ఆ దేవుడు, ప్రజలు జగన్‌కి అండగా ఉన్నారు. త్వరలోనే ఆయన విడుదలై వస్తారు. ఆయన్ని ఇన్నాళ్లూ వేధించినవారందరికీ ప్రజలు బుద్ధి చెబుతారు. ఇది సత్యం. 
- కృష్ణమోహన్, నాయుడుపేట, నెల్లూరు జిల్లా
Share this article :

0 comments: