ప్రజాదరణ పొందడమే నేరమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాదరణ పొందడమే నేరమా?

ప్రజాదరణ పొందడమే నేరమా?

Written By news on Tuesday, June 4, 2013 | 6/04/2013

జగనన్నని నేను చాలాసార్లు దగ్గర నుండి చూశాను. నా ఎంబిఏ అయిన తర్వాత ఒకసారి ఆయనను పులివెందులలో కలిశాను. నాలా జగనన్న కోసం చాలామంది అభిమానులు, నాయకులు అక్కడికి వచ్చారు. అవి... జగనన్న కాంగ్రెస్‌లాంటి నీతిమాలిన, మానవత్వం లేని పార్టీ నుండి బయటకి వచ్చిన రోజులు. నేను చేతిలో సర్టిఫికెట్స్ పట్టుకొని జనం మధ్యలో ఒక మూలన కూర్చొని ఉన్నాను. లంచ్ టైమ్‌లో జగనన్న బయటకు వెళుతూ దూరంగా కూర్చొని ఉన్న నన్ను గమనించారు. నన్ను దగ్గరికి పిలిచి నా సమస్యను అడిగి నాకు ఉద్యోగ అవకాశం కల్పించాడు. నేను అన్నం తింటున్న ప్రతిసారి నాకు జగనన్నే గుర్తుకు వస్తాడు.

జగనన్న మీద మా అభిమానానికి చాలా కారణాలున్నాయి. ఆకాశంలాంటి తండ్రి చనిపోయిన అతి కొద్ది రోజులలోనే సాధారణ ప్రజలు సహితం కోలుకోలేని, జీర్ణించుకోలేని పరిస్థితుల్లో తనయుడిగా తన బాధనంతా గుండెల్లో దాచుకొని ‘నేనున్నాను’ అని ప్రజలకు భరోసా ఇచ్చాడు. చిన్నపిల్లలు, ఆడవాళ్లు, వృద్ధులు, జగనన్నను చూసి మురిసిపోయారు. అన్ని అన్ని బాధలున్నా చిరునవ్వును మాత్రం చెక్కుచెదరనివ్వని ఆ గుండె ధైర్యానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను, నాయకుడంటే ధైర్యంగా ఉండాలి. నైతికవిలువలు ఉండాలి. ప్రజలు నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. ఇవన్నీ జగనన్నలో ఉన్నాయి.

అతి చిన్న వయస్సులోనే జగనన్న ప్రజలలో విపరీతమైన ప్రజాదరణ పొందారు. అదే తప్పన్నట్లు కాంగ్రెస్‌పార్టీ ఆయనపై కసి తీర్చుకుంటోంది. చేయని నేరానికి ఏడాది కాలంగా జైల్లో నిర్బంధించి ప్రజలకు ఆయన్ని దూరం చేసింది. జగనన్నని జైలులో పెట్టారేమోకాని, ఆయన మీద ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఇసుమంత అయినా తగ్గించలేకపోయారు. జగనన్న ఓర్పును, ఓదార్పును చూసి కాంగ్రెస్, టీడీపీలకు చెమటలు పట్టాయి. ఏమిచేయాలో పాలుపోక సీబీఐని ఉసిగొల్పారు. జగనన్న కృష్ణాజిల్లాలో ఓదార్పుయాత్ర చేస్తున్నప్పుడు.

ఆయన ఇంటిమీద, సంస్థల మీద సీబీఐ ఏకకాలంలో 29 బృందాలతో సోదాలు నిర్వహించింది. కాని జగనన్న మాత్రం ఆ సమయంలో చిరునవ్వుతో, ప్రజలను పలకరిస్తూ ఉండటం చూసి అనుకున్నాను. ధైర్యవంతుడు, ఆత్మవిశ్వాసం ఉన్నవాడు ఒక్క జగనన్న మాత్రమే అని. నిద్రపోతున్న సమయంలో మెలకువ వచ్చినప్పుడు గుర్తొస్తుంది... జగనన్న జైలులో ఉన్నాడని, జగనన్న ఒంటరిగా జైల్లో నాలుగు గోడల మధ్య ఉన్నాడే అన్న బాధ నన్ను మానసికంగా కృంగదీస్తుంది. ప్రేయర్ చేసుకొని మళ్లీ పడుకుంటాను. ఇలాంటి సందర్భాలు ఈ సంవత్సరం కాలంలో నా జీవితంలో చాలా ఉన్నాయి.

వైయస్సార్ నుంచి జగనన్న... ప్రేమను, చిరునవ్వును, ఆత్మవిశ్వాసాన్ని, నైతికవిలువల్ని, మాట మీద నిలబడే తత్వాన్ని నేర్చుకున్నాడు. మరి చంద్రబాబునాయుడు తనలో ఏముందని తన కుమారుడికి నేర్పుతారు? వెన్నుపోటు తత్వం, కుటిల రాజకీయాలు, కుమ్మక్కు రాజకీయాలు, చీకట్లో చేతులు కలపడం, మానవత్వం లేని పనికిమాలిన రాజకీయాలు... ఇవే కదా ఆయనకు తెలిసినవి! సోనియాగాంధీగారు రాహుల్‌కి ఏం నేర్పగలరు? మాట విననివారిపై తప్పుడు కేసులు బనాయించడం, జైలులో పెట్టించడం, చెడును ప్రోత్సహించే రాజకీయాలను నేర్పించడం... ఇవేగా! దేవుడు కూడా క్షమించని తప్పులను ఈ ఇద్దరూ జగనన్న విషయంలో చేశారు. చేస్తున్నారు. సీబీఐ, కాంగ్రెస్, టీడీపీలు జగనన్నను జైలులో పెట్టామని సంబరపడుతున్నాయేమో కాని వాళ్లకు అర్థం కావలసింది ఏమిటంటే తాము పరోక్షంగా ప్రజలను వేధిస్తున్నామని, ప్రజలను మానసికంగా హింసిస్తున్నామనీ. వీళ్ల పాపం పండేరోజు దగ్గరలోనే ఉంది. అప్పుడు వీళ్లను దేవుడు క్షమించడు, ప్రజలూ క్షమించరు.

ఈ దానవ మానవ యుద్ధంలో ప్రస్తుతానికి చెడు గెలిచినా, చివరకు గెలిచేది మంచే. ప్రజల మనస్సులో స్థానం సంపాదించకుండా సోనియమ్మ మనస్సులో స్థానం సంపాదించి అందలం ఎక్కినవాళ్లు ఈ కాంగ్రెస్‌పార్టీలో చాలామందే ఉన్నారు. కాని అలాంటివారు ప్రజల మనసులో ఎప్పటికీ స్థానం సంపాదించలేరు. సహనంతో కూడిన సాహసంతో, ఆత్మవిశ్వాసంతో, ప్రజలపై ప్రేమతో ముందుకువెళ్లే నాయకుడిని ప్రజలు ఆదరిస్తారనేది సత్యం. అలా ప్రజల అభిమానాన్ని, ఆదరణను పొందిన లీడర్ ఒక్క జగనన్న మాత్రమే.

- విజయ్ భరత్‌కుమార్, దండు హరిజనవాడ, కడప జిల్లా
- See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=63446&Categoryid=11&subcatid=20#sthash.6z5x4IoK.dpuf
Share this article :

0 comments: