జనాదరణ చూసి ఓర్వలేకపోయారు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనాదరణ చూసి ఓర్వలేకపోయారు..

జనాదరణ చూసి ఓర్వలేకపోయారు..

Written By news on Wednesday, June 12, 2013 | 6/12/2013

‘‘రాష్ట్రంలో అధికార దాహం రాజ్యమేలుతోంది. ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ తప్పుల్ని ఎత్తిచూపి ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రతిపక్షం కుమ్మక్కు రాజకీయాలతో కాలం వెల్లదీస్తోంది. ఈ ప్రభుత్వంలో రైతులు, విద్యార్థులు, నిరుపేదలు.. ఇలా ప్రతి ఒక్కరూ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. మహానేత వైఎస్ మరణం తర్వాత రాష్ట్ర ప్రజల పరిస్థితి దుర్భరంగా మారిపోయింది. ప్రజలకు అండగా ఉన్న జగన్‌ను కాంగ్రెస్, టీడీపీ కలిసి కుట్ర పన్ని జైలుకు పంపాయి. 

అక్రమ కేసులు బనాయించాయి. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన సీబీఐ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు. దీని వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థపైనే ప్రజలకు నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఎవరెన్ని కుట్రలు పన్నినా జగన్ నిర్దోషిగా బయటకు వస్తారు. తండ్రి ఆశయ సాధన జగన్‌తోనే సాధ్యం’’ అంటూ మేధావులు, యువకులు, మహిళలు అభిప్రాయపడ్డారు. మంగళవారం అనంతపురంలో నిర్వహించిన ‘సాక్షి చైతన్య పథం’లో పాల్గొని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వైఎస్ జగన్‌పై జరుగుతున్న కుట్ర రాజకీయాలను కడిగిపారేశారు. జగన్‌కు వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక కుట్రపన్ని జైలుకు పంపారని దుయ్యబట్టారు.
- న్యూస్‌లైన్, అనంతపురం అర్బన్/టౌన్ 


యువగళం
ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి 
ప్రజా సమస్యలను పట్టించుకునే నాథుడే లేడు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించాల్సిన టీడీపీ నిద్రపోతోంది. రోజు రోజుకూ రాజకీయాలు నీచంగా మారుతున్నాయి. కుర్చీలను కాపాడుకోవడానికే సమయం వెచ్చిస్తున్నారు. ప్రజా శ్రేయస్సును కోరుకునే వారు కరువయ్యారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు. 

- రమేష్, అనంతపురం

ఎప్పుడూ ఢి ల్లీలోనే 
ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన సీఎం, మంత్రులు ఆ.. అంటే ‘మేడం’ కోసం ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. ప్రజలను పట్టించుకునే తీరికే వారికి లేకుండా పోయింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. నిస్వార్థంగా సేవ చేసే ఏకైక నాయకుడు వైఎస్ జగన్ సీఎం కావాలని ఎదురుచూస్తున్నారు. 
- అనిల్ కుమార్ రెడ్డి, విద్యార్థి

కార్యాలయాల చుట్టూ తిరగడానికే సరిపోతోంది 
నేను నిరుపేద విద్యార్థిని. అమ్మా నాన్న ఇద్దరూ లేరు. బంధువుల దగ్గర ఉంటూ చదువుకుంటున్నా. ప్రభుత్వం బస్‌పాస్ చార్జీలు పెంచడం దారుణం. తహశీల్దార్ కార్యాలయంలో ఆ సర్టిఫికెట్ తీసుకురా.. ఈ సర్టిఫికెట్ తీసుకురా అంటూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరగడానికే సమయం సరిపోతోంది. ఇలాగైతే మా లాంటి వారు ఎలా చదువుకోవాలి? విద్యార్థుల సమస్యలు పరిష్కరించే నాయకుడు సీఎం కావాలి. 
- గంగ, డిగ్రీ విద్యార్థి, ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల 

విద్యారంగం అస్తవ్యస్తం 
విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వ విద్య కరువవుతోంది. గతంలో ఎంతో మంది మహానుభావులు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుని అందరికీ ఆదర్శప్రాయులయ్యారు. భరతమాత ముద్దు బిడ్డలుగా మారారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు కన్పించడం లేదు. ప్రభుత్వం కార్పొరేట్ విద్యను ప్రోత్సహించడం దారుణం.
- అమరేష్, విద్యార్థి, ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల

విద్యా ప్రదాత వైఎస్ 
2004కు ముందు జిల్లాలో ఇంజనీరింగ్ చదవాలంటే జేఎన్‌టీయూ కళాశాలే దిక్కు. పేద విద్యార్థులు ఇంజనీరింగ్ చదవాలంటే తీవ్ర ఇబ్బందులు పడేవారు. వైఎస్ హయాంలో జిల్లాలో 18 ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించారు. ప్రస్తుత ప్రభుత్వం సకాలంలో రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావాలన్నా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా జగన్ సీఎం అయితేనే సాధ్యం. 
- నందకిరణ్, ఇంజనీరింగ్ విద్యార్థి

ప్రజలను గాలికొదిలేశారు 
వైఎస్ పథకాలు అద్భుతం. ఆయన మరణానంతరం అన్ని వర్గాల ప్రజలకూ తీరని అన్యాయం జరుగుతోంది. పాలకులు కుర్చీలు కాపాడుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. 8 కోట్ల మంది ప్రజల సమస్యలను గాలికొదిలేశారు. వైఎస్సార్ పథకాల అమలు ఒక్క జగన్‌తోనే సాధ్యం. 
- జనార్దన్‌రెడ్డి, విద్యార్థి 

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఓ కల్పవృక్షం 
మాలాంటి వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పవృక్షం వంటిది. ప్రస్తుతం దాన్ని పక్కన పెట్టేసే యోచనలో సర్కారు ఉంది. వైఎస్సార్ హయాంలో క్రమం తప్పకుండా రీయింబర్స్‌మెంట్ వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. 
- రాకేష్, ఇంజనీరింగ్ విద్యార్థి

వైఎస్ లాంటి నేత కావాలి 
కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకమైన సమయంలో తన పాదయాత్ర ద్వారా పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చింది వైఎస్సే. అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఉచిత విద్యుత్, పింఛన్లు, అందరికీ పక్కా గృహాలు... ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వైఎస్ మరణం తర్వాత పరిస్థితి మారిపోయింది. మళ్లీ అలాంటి నేతనే ప్రజలు కోరుకుంటున్నారు. 
- రాసిరెడ్డి, కాయగూరల వ్యాపారి

జగన్ సీఎం కావాలి 
కళాశాలకు రావాలంటే కిలో మీటర్లు ప్రయాణం చేయాలి. అందుకు బస్ పాస్ తప్పనిసరి. గతంలో సులభంగా అందేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఏదైనా దరఖాస్తు చేసుకోవాలంటే అన్ని సర్టిఫికెట్లు తీసుకురావాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఇలాగైతే ఎలా? కాలేజీకి వెళ్లాలా లేక కార్యాలయాల చుట్టూ తిరగాలా? జగన్ సీఎం అవ్వాలి. అప్పుడే అన్ని సమస్యలూ తీరతాయి.
- ప్రియాంక, విద్యార్థిని, ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల

అంతిమ విజయం జగన్‌దే 
ఆంధ్రా పాలిటిక్స్ లీగ్ (ఏపీఎల్)లో అంతిమ విజయం జగన్‌మోహన్‌రెడ్డిదే. ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్ జగన్‌ను ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికార పక్షంతో కుమ్మక్కై ఎన్ని కుట్రలు పన్నినా ప్రజాభిమానం ముందు అవి కొట్టుకుపోతాయి. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయడం ఖాయం. 
- జగన్‌మోహన్‌రెడ్డి, అనంత బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్

గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి 
సీఎం కిరణ్ సంక్షేమ పథకాల క్రెడిట్ తనకే చెందాలని ఆ బాట..ఈ బాట అంటూ ఏవేవో కొత్త పథకాలు పెడుతున్నారు. అలాగే వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జగన్‌ను జైల్లో పెట్టించారు. ైవె ఎస్ కుటుంబ సభ్యులను మనోవేదనకు గురిచేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో జగన్‌ను గెలిపించుకుంటాం. 
- ఈశ్వరమ్మ, అనంతపురం

మహిళలకు ప్రాధాన్యతేదీ? 
దేశంలో మహిళలకు తగిన గుర్తింపు లేదు. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట దాడులు జరుగుతున్నాయి. సోనియా గాంధీ కూడా ఓ మహిళే కదా? సాటి మహిళగా ఆమె మాకేం చేస్తోంది? ఆడపడుచులను ఆదరించింది వైఎస్సే. ఆయన ప్రతి మహిళా లక్షాధికారి కావాలని పరితపించారు. పావలావడ్డీ రుణాలు అందించారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. వైఎస్ జగన్ సీఎం అయితే తిరిగి మహానేత పథకాల అమలవుతాయి. 
- ఉష, స్వయం సహాయక సంఘం సభ్యురాలు

పారిశ్రామికంగా వెనుకబడ్డాం 
పారిశ్రామికంగా మనం ఎంతో వెనుకబడ్డాం. యువతకు జీవనోపాధి గగనమైంది. ఇలాంటి తరుణంలో చెడు మార్గాల వైపు వెళ్లే అవకాశం లేకపోలేదు. ఉద్యోగాలిస్తామని కిరణ్ చెబుతున్నారు. కానీ ఎక్కడ ఇచ్చారు? పరిశ్రమలు రావాలంటే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడాలి. అటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్ తోనే సాధ్యం. - ఎం.మనోహర్ రెడ్డి, వ్యాపారవేత్త

రాజకీయాలు అస్తవ్యస్తం 
ప్రస్తుతం రాజకీయాలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఏపీ ముఖచిత్రం పరిశీలిస్తే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు సరిగ్గా పని చేస్తున్నాయా అన్న సందేహం ప్రజల్లో కలుగుతోంది. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ఆయన మరణానంతరం మరుగునపడ్డాయి. 
- ఎం.నజీర్ అహ్మద్, రిటైర్డ్ ప్రొఫెసర్

సీబీఐ కీలుబొమ్మ 
కేంద్ర ప్రభుత్వం చేతిలో సీబీఐ కీలుబొమ్మ. దీనిపై రోజురోజుకూ ప్రభుత్వ జోక్యం పెరిగిపోతుండడంతో అక్రమ కేసులు బనాయిస్తోంది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి ఇది పూర్తిగా విరుద్ధం. మాట వింటే బెయిలు... లేదంటే జైలు అన్నట్లుంది. సీబీఐ, న్యాయవ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అలా జరగని పక్షంలో ప్రజల్లో వాటిపై నమ్మకం పోతుంది. 
- డాక్టర్ సి. రామాంజనేయులు, ప్రొఫెసర్

వైఎస్ మరణంతో పరిస్థితి తారుమారు 
మహానేత వైఎస్ హయాంలో సకాలంలో స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందేవి. ఇంజనీరింగ్ విద్య పొందాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. వైఎస్ ఉన్నప్పుడు విద్యార్థులకు ఎలాంటి ఢోకా ఉండేది కాదు. ఆయన మరణానంతరం పరిస్థితి తారుమారైంది. చాలా కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆగిపోయింది. విద్యారంగం కుదేలైంది. - కె.జగన్‌మోహన్‌రెడ్డి, విద్యావేత్త

గుండె తరుక్కుపోతోంది 
ఒకవైపు భర్త మరణం, మరోవైపు ఒక్కగానొక్క కొడుకును అంతా ఏకమై కుట్ర పన్ని జైల్లో పెట్టించడంతో వైఎస్ విజయమ్మ తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆమె పరిస్థితి చూస్తుంటే ప్రతి మహిళ గుండె తరుక్కుపోతోంది. అందుకే షర్మిల చేపడుతున్న పాదయాత్రలో మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తొందరగా ఎన్నికలు రావాలని, వైఎస్సార్‌సీపీని గెలిపించి కాంగ్రెస్, టీడీపీలకు దిమ్మతిరిగేలా బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. - సుజాత, విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు

ఇష్టానుసారంగా రాస్తున్నాయి 
మీడియా అంటే పారదర్శకత ఉండాలి. అలాంటిది కొన్ని పత్రికలు పని కట్టుకుని వైఎస్ కుటుంబంపై ఇష్టానుసారం రాస్తున్నాయి. చదవడానికి వీలు లేని కథనాలు ప్రచురిస్తున్నాయి. మీడియా స్వేచ్ఛ దుర్వినియోగం అవుతోంది. రాష్ట్రం పారిశ్రామిక, వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్లో వెనుకబడిపోయింది. కొత్త రాజకీయ శక్తి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. - రమణారెడ్డి, ప్రొఫెసర్

ప్రజలు నరకయాతన పడుతున్నారు
అన్ని రంగాల్లో కంటే వైద్యం ఎంతో కీలకం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యం అందడం లేదు. డాక్టర్లుండరు...వారుంటే మందులుండవు. జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలోనే పరిస్థితి దయనీయం. అసౌకర్యాల మధ్య ప్రతి రోజూ ప్రజలు నరకయాతన పడుతున్నారు. వైద్య రంగానికి పెద్ద పీట వేసిన మహోన్నతుడు వైఎస్. ఆరోగ్యశ్రీ, 108, 104, ఇలా అనేక పథకాలనందించారు. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. 
- ప్రతాప్ రెడ్డి, అనంతపురం
Share this article :

0 comments: