మన జెండా రెపరెపలాడాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మన జెండా రెపరెపలాడాలి

మన జెండా రెపరెపలాడాలి

Written By news on Monday, June 24, 2013 | 6/24/2013

‘త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నిక ల్లో ప్రతి పంచాయతీ మీద వైఎస్సార్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి. ప్రత్యర్థులకు పార్టీ సత్తా చూపించాలి. మీరు ఇచ్చే తీర్పు ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించే విధంగా ఉండాలి..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 2,500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఆమె షర్మిలను అభినందించేందుకు తూర్పు గోదావరి జిల్లా కాకరాపల్లి వచ్చారు. వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆమె ప్రసంగించారు. ‘‘ఈరోజు రాష్ట్రంలో నడిచే రాజకీయాలను మీరంతా చూస్తున్నారు. వాస్తవానికి ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరగాలి. ఆ తర్వాత మండల పరిషత్ ఎన్నికలు జరగాలి. తర్వాత పంచాయతీ ఎన్నికలు జరగాలి. కానీ పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కాబట్టి పంచాయతీ ఎన్నికలను ముందుకు తెస్తున్నారు. సహకార సొసైటీ ఎన్నికల్లో అప్రజాస్వామిక పద్ధతుల్లో, మాయలు చేసి, మోసాలు చేసి మాదే పైచేయి అని చెప్పుకున్నారో ఈ ఎన్నికల్లో కూడా అలాంటి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది’’ అని విజయమ్మ అన్నారు. ‘‘పదేళ్ల కిందట వైఎస్సార్ గారు ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో మీ దగ్గరకు వచ్చారు. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత జగన్‌బాబు మిమ్మల్ని కలిసేందుకు, మీతో మాట్లాడేందుకు ‘ఓదార్పు యాత్ర’తో మీ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, కష్టాల్లో ఉన్నారని జగన్‌బాబు రాలేని పక్షంలో, మిమ్మల్నందరినీ కలవమని చెప్పి జగ న్‌బాబు పంపడంతో షర్మిలమ్మ ‘మరో ప్రజాప్రస్థానం’ పేరుతో మీ ముందుకు వచ్చారు. మీ అందరి ప్రేమతోనే షర్మిల 2,500 కిలో మీటర్లు నడిచారు’’ అని చెప్పారు.

ఆదివారం 14.1 కిలోమీటర్ల నడక..

ఆదివారం 188 వరోజు పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని కేఈ చిన్నయ్యపాలెం, తిమ్మరాజుపేట, కేఎస్ కొత్తూరు, పాతకొట్టాం, కొత్తకొట్టాం, లక్ష్మీదేవిపేట, కోటనందూరు మీదుగా కాకరాపల్లి చేరుకుంది. కాకరాపల్లి వద్ద 2,500 కిలోమీటర్ల మైలు రాయిని షర్మిల అధిగమించినట్లు పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం ప్రకటించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 24 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు. ఆదివారం మొత్తం 14.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,500.5 కి.మీ. యాత్ర పూర్తయ్యింది. పార్టీ ముఖ్య నాయకులు వైవీ సుబ్బారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కృష్ణదాసు, గురునాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ ఎంపీ వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, జ్యోతుల నెహ్రూ, జగ్గిరెడ్డి, ప్రసాదరాజు, దొరబాబు, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, నేతలు దాడి వీరభద్రరావు, జక్కంపూడి విజయలక్ష్మి, వెంకటరమణ, నియోజక వర్గాల కో ఆర్డినేటర్లు చెలమలశెట్టి సునీల్, బొడ్డు వెంకటరమణ చౌదరి, దాడిశెట్టి రాజా, ఆకుల వీర్రాజు, బొమ్మన రాజ్‌కుమార్, సత్తి సూర్యనారాయణరెడ్డి, విప్పర్తి వేణుగోపాల్, అనంతబాబు, చింత కృష్ణమూర్తి, బొంతు రాజేశ్వర్‌రావు, గుత్తుల సాయి, కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మోహన్, మందపాటి కిరణ్‌కుమార్, మట్టా శైలజా, చింతలపాటి వెంకటరామరాజు, మత్తి జయప్రకాష్, తోట సుబ్బారావు, చెల్లుబోయిన వేణు, స్థానిక నాయకుడు జ్యోతుల నవీన్ తదితరులు పాల్గొన్నారు. - See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=624552&Categoryid=1&subcatid=33#sthash.TtOLfVro.dpuf
Share this article :

0 comments: