సీబీఐ న్యాయవాదా? కాంగ్రెస్, టీడీపీల ఏజెంటా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ న్యాయవాదా? కాంగ్రెస్, టీడీపీల ఏజెంటా?

సీబీఐ న్యాయవాదా? కాంగ్రెస్, టీడీపీల ఏజెంటా?

Written By news on Tuesday, June 11, 2013 | 6/11/2013

అశోక్ భాన్ సీబీఐ న్యాయవాదా? కాంగ్రెస్, టీడీపీల ఏజెంటా? 
సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ డిప్యుటేషన్ కొనసాగింపు అక్రమం
‘సాక్షి చైతన్యపథం’లో వక్తలు 

సాక్షి ప్రతినిధి, కదిరి: ‘నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎవరికైనా 90 రోజుల్లోగా బెయిల్ ఇవ్వాలన్న సహజ న్యాయసూత్రం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎందుకు వర్తించదు? దర్యాప్తును వేగంగా పూర్తిచేసి చార్జిషీట్ వేయాలన్న ధర్మాన్ని విస్మరించడం వెనుక ఆంతర్యమేమిటి?’ అంటూ పలువురు వక్తలు సూటిగా ప్రశ్నించారు. జగన్‌కు పెరుగుతోన్న జనాదరణను చూసి ఓర్వలేక, అక్కసుతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుట్ర పన్ని, కేసుల్లో ఇరికించారని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అనంతపురం జిల్లా కదిరిలో సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ‘చైతన్యపథం’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది నాగేంద్రరెడ్డి మాట్లాడుతూ జగన్ కేసులో నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి, తుది చార్జిషీటు వేయమని సుప్రీంకోర్టు చెప్పినా, మళ్లీ గడువును పెంచమని కోరతామంటూ న్యాయవాది అశోక్ భాన్ అనడాన్ని బట్టి చూస్తే ఆయన సీబీఐ తరఫున వాదిస్తున్నట్లు కన్పించడం లేదని, కాంగ్రెస్, టీడీపీల ఏజెంటుగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ముస్లిం మత పెద్ద మౌలానా ఇస్మాయిల్ మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి ముస్లింలకు న్యాయం చేశారన్నారు. 

కానీ, ఈ ప్రభుత్వం రిజర్వేషన్లను అపహాస్యం చేస్తోందన్నారు. విద్యావేత్త శివారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడి కుమారుడు లోకేశ్ అమెరికాలో చదివేందుకు అయ్యే ఖర్చును సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగరాజు భరించారని, అందుకే ఆయనకు బాబు అనేక ప్రయోజనాలు చేకూర్చారన్నారు. దాన్ని క్విడ్‌ప్రోకోగా సీబీఐ పరిగణించడం లేదని విమర్శించారు. సామాజిక కార్యకర్త కొమ్మిద్ది అప్పళ్ల మాట్లాడుతూ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ డిప్యుటేషన్‌ను అక్రమంగా కొనసాగించి జగన్‌పై కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేయిస్తోంద’ని విమర్శించారు. చేనేత సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇంద్రావతమ్మ మాట్లాడుతూ చేనేత కార్మికులకు రూ.312 కోట్ల రుణమాఫీ వర్తింపజేస్తూ నాడు మహానేత వైఎస్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఆయన హఠాన్మరణం తర్వాత రుణమాఫీని వర్తింపజేయకుండా కాంగ్రెస్ సర్కారు వేధిస్తోందని విమర్శించారు. ఎం.నాగరాజు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో బీటెక్ విద్యార్థిని కీర్తి మానస, మాలమహానాడు జిల్లా కార్యదర్శి రామచంద్ర, మేధావులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు మాట్లాడారు. 
Share this article :

0 comments: