జగన్ మా గుండెల్లో ఉన్నాడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ మా గుండెల్లో ఉన్నాడు

జగన్ మా గుండెల్లో ఉన్నాడు

Written By news on Wednesday, June 19, 2013 | 6/19/2013

‘అన్యాయంగా మహానేత కుటుంబాన్ని ఎందుకిలా వేధిస్తున్నారయ్యా.. కుటుంబానికి పెద్ద దిక్కుగా.. రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటున్న జగనన్నను అక్రమంగా జైల్లో పెట్టారుకదయ్యా..’ అంటూ పులివెందుల మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ పేదోళ్లమైన మేము పెద్ద చదువులు చదివేందుకు రాజన్న ఓ దారి చూపారు. జగనన్నకు మా అండ ఎప్పూడు ఉంటుంది’ అంటూ ఓ విద్యార్థి తన అభిమానాన్ని వ్యక్తం పరిచాడు. ‘ కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ ఎన్ని కుట్రలు పన్నినా మా బిడ్డను కాపాడుకుంటాం.. జగన్‌ను సీఎం చేస్తాం’ అంటూ పులివెందుల ప్రజలు వైఎస్ కుటుంబంపై తమకున్న ప్రేమను వ్యక్తపరిచారు. జగన్‌పై జరుగుతున్న కుట్రలను తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. సీబీఐ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్, టీడీపీల కుట్రలను కడిగిపారేశారు. పులివెందులలోని వీజే కల్యాణ మండపంలో మంగళవారం జరిగిన ‘సాక్షి చైతన్యపథం’ సదస్సులో పలువురు తమ అభిప్రాయాలు వెల్లడించారు. 
- న్యూస్‌లైన్, పులివెందుల

కాంగ్రెస్, టీడీపీల కుట్రలో భాగమే...
కాంగ్రెస్, టీడీపీల కుట్రలో భాగంగానే వైఎస్ జగన్‌ను అన్యాయంగా జైల్లో ఉంచారు. ఆయన తప్పకుం డా బయటకు వస్తారు. ఆయన రాక కోసం రాష్ట్రమంతా ఎదురుచూస్తోంది.
- స్వామినాథన్, స్థానికుడు, పులివెందుల 

సీబీఐ కాంగ్రెస్ కొమ్ము కాస్తోంది 
నిజాయితీగా పని చేయాల్సిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెష్టిగేషన్ కాంగ్రెస్‌కు తొత్తుగా మారింది. కాంగ్రెస్ ఆడించినట్లు సీబీఐ ఆడుతోంది. తమను ధిక్కరించిన వారిపై సీబీఐని ప్రయోగిస్తూ తమ దారిలో తెచ్చుకొనేందుకు కాంగ్రెస్ కుటిల ప్రయత్నాలు చేస్తోంది. తన దారికి రాని వైఎస్‌జగన్‌లాంటి వారిని అక్రమంగా జైలులో నిర్బంధిస్తోంది. జగన్ కోసం రాష్ట్ర ప్రజలు నిరాహార దీక్షలు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నారు.
- గోపాల్‌రెడ్డి, రిటైర్డు టీచర్, పులివెందుల 

సీబీఐ పంజరంలో చిలక 
దేశంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ చేతిలో కీలు బొమ్మలాగా తయారైందనిపిస్తోంది. సీబీఐ పంజరంలో ఉన్న చిలుకలాగా కాంగ్రెస్ పార్టీ గుప్పిట్లో ఉంది. కాంగ్రెస్‌ను ఎవరు ఎదిరిస్తారో.. అలాంటి వారిపై సీబీఐ అనే అస్త్రాన్ని ప్రయోగించి అక్రమంగా జైలులో నిర్బంధిస్తోంది. ఇప్పటికైనా సీబీఐ స్వతంత్రంగా వ్యవహరిస్తే అన్యాయంగా జైలులో ఉంచిన వైఎస్ జగన్‌లాంటి వారికి న్యాయం జరుగుతుంది. 
- భానుప్రకాష్, విద్యావేత్త, పులివెందుల 

ప్రజాస్వామ్య వాదులంతా వైఎస్ జగన్ వెంటే 
రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులంతా వైఎస్ జగన్ వెంటే ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం, సీబీఐ కుట్ర పన్ని వైఎస్ జగన్‌ను అన్యాయంగా జైలులో ఉంచారు. ఆయన ఏ తప్పు చేయకున్నా నిర్బంధించి వేధిస్తున్నారు. సీబీఐ తీరును ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు.
- రామచంద్రయ్య, ప్రజాస్వామ్యవాది, పులివెందుల 

హృదయ వేదన
‘సాక్షి చైతన్యపథం’ కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వీడియో క్లిప్పింగ్‌‌స చూపించినప్పుడు బాధాతప్త హృదయాలతో ఏడుస్తున్న మహిళలు

బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు... 
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. అన్యాయంగా జైలులో పెట్టి మనోవేదనకు గురి చేస్తున్నారు. సీబీఐ తీరును ప్రజలందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. జగన్ ఎలాగైనా బయటకు వచ్చి మా కష్టాలను తీరుస్తారు.
- వెంకటలక్షుమ్మ, స్థానికురాలు, పులివెందుల 

ఏ తప్పు చేయని జగన్‌ను జైలులో పెట్టారు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏ తప్పు చేయకపోయినప్పటికి జైలులో ఉంచారు. రాష్ట్ర ప్రజ లు సుభిక్షంగా ఉండాలనే లక్ష్యంతో వైఎస్ కుటుం బీకులు ఎన్నో మంచి పనులు చేశారు. మేలు చేయడం తప్ప కీడు చేయడం వాళ్ల వంశ చరిత్రలో లేదు.
- అనసూయ, పులివెందుల 

లొంగదీసుకొనేందుకే కుట్రలు 
వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ సీబీఐని పావుగా వాడుకొని లొంగదీసుకోవడానికి కుట్రలు పన్నింది. ఇందులో భాగంగా జగన్‌ను అక్రమంగా జైలులో నిర్బంధించారు. అయితే ప్రజలు జగన్ పక్షానే ఉన్నారు.
- కొండారెడ్డి,రిటైర్డు ఉపాధ్యాయుడు, పులివెందుల 

జగన్ జైలులో పెట్టడం బాధాకరం 
వైఎస్ జగన్‌ను అక్రమంగా జైలులో పెట్టడం బాధాకరం. ఆయన జైలులో ఉన్నారని తలచుకుంటేనే ఏడుపు వస్తోంది. ప్రజలకు దగ్గరవుతున్న నాయకుని అన్యాయం గా నిర్బంధించడం కుట్రలో భాగమే. ఎలాగైనా జగన్‌ను గెలిపించుకుంటాం. 
- లక్ష్మిదేవి, పులివెందుల 

ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే..
వైఎస్ జగన్ బయట ఉంటే ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందోననే భయంతోనే కాం గ్రెసోళ్లు జైలులో ఉంచారు. ప్రజల మధ్య ఉన్న మనిషిని జైల్లో పెట్టి ప్రభుత్వం పడిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎప్పటికైనా జగన్ నిర్దోషిగా బయటకు వస్తారు.
- వెంకటలక్షుమ్మ,స్థానికురాలు, పులివెందుల 

జగన్ చేసిన నేరం ఏమి? 
వైఎస్ జగన్ ఏం నేరం చేశారని అక్రమంగా జైలులో ఉం చారు. అన్యాయంగా జైలులో ఉంచి వైఎస్ కుటుంబ సభ్యులకు తీవ్ర మనో వేదనకు గురి చేస్తున్నారు. ఆధారాలు లేకపోయిన సీబీఐ దర్యాప్తు పేరు తో కేసును సాగదీస్తోంది. జగన్‌ను జైలులో ఉంచడమే పనిగా పెట్టుకుంది.
- మహమ్మద్‌ఆలీ,స్థానికుడు,పులివెందుల 

కాంగ్రెస్ చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ
దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా జనం మధ్య ఉన్న వైఎస్ జగన్‌ను సీబీఐ చేత అరెస్టు చేయించింది. ప్రజాస్వామ్య దేశంలో కుటీల రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్సుగా మారిపోయింది. 
- శ్రీనివాసులరెడ్డి, నల్లపురెడ్డిపల్లె 

సాక్షిని మూసివేసేందుకు కుట్ర 
రాష్ట్రంలో ఎంతో ప్రజాదరణ పొందిన సాక్షి దినపత్రిక, ఛానెల్‌ను మూసివేసేందుకు కుట్ర జరుగుతోంది. ఇందులో భాగంగానే సీబీఐ క్విడ్ ప్రోకో ద్వారా పెట్టుబడులు వచ్చాయని చార్జిషీట్లు వేస్తోంది. జగన్‌ను అన్యాయంగా జైలులో ఉంచి ప్రజలకు దూరం చేస్తున్నారు.
- మణికంఠ, విద్యార్థి, పులివెందుల 

ఇచ్చిన మాట కోసం నిలబడటం తప్పా.. 
దివంగత మహానేత వైఎస్ మరణానంతరం నల్ల కాలువలో వేలాది మంది ప్రజల మధ్య జగన్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట కోసం నిలబడటం తప్పా.. వైఎస్ జగన్ ఏ తప్పు చేయలేదు. సోనియా గాంధీ ఆదేశానుసారమే సీబీఐ జగన్‌ను జైలులో పెట్టించింది.
- శాంతికుమారి, మహిళ, పులివెందుల 

ప్రజాదరణ కలిగిన నాయకుడిని ఏ శక్తి ఆపలేదు 
రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్. ఆయనపై ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ఏమీకాదు. కేవలం కుట్రపూరితంగానే సీబీఐ జగన్‌ను అరెస్టు చేసింది. వైఎస్ జగన్‌కు ప్రజలు అండగా ఉన్నారు.
- సుహాసిని, పులివెందుల 

కన్నీటి పర్యంతం
మహానేత వైఎస్‌ఆర్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకొని కన్నీటి పర్యంతమైన మాబ్‌జాన్
Share this article :

0 comments: