ఉత్తరాంధ్ర వెనకబాటుకు చంద్రబాబే కారణం: దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉత్తరాంధ్ర వెనకబాటుకు చంద్రబాబే కారణం: దాడి

ఉత్తరాంధ్ర వెనకబాటుకు చంద్రబాబే కారణం: దాడి

Written By news on Tuesday, June 25, 2013 | 6/25/2013

విశాఖపట్నం: చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఉత్తరాంధ్ర అభివృద్ధికి దూరమైంది అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దాడి వీరభద్రరావు ఆరోపించారు. విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి 190వ రోజు పాదయాత్రలో పాల్గొన్న దాడి వీరభద్రరావు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనకబాటుతనానికి చంద్రబాబు అనుసరించిన విధానాలే కారణం అని అన్నారు. అందుకే చంద్రబాబు విశ్వాసం కోల్పోయారన్నారు. షర్మిల పాదయాత్రలో ప్రజల జోష్ ను గమనిస్తున్నామని దాడి తెలిపారు. షర్మిల పాదయాత్ర ముందు ఏ పాదయాత్రైనా దిగదుడుపేనని దాడి వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ కుటుంబంతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే మరోప్రజాప్రస్థానానికి బ్రహ్మరథం పడుతున్నారు అని దాడి వీరభద్రరావు అన్నారు. 
Share this article :

0 comments: