చట్టం కొందరికే చుట్టమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చట్టం కొందరికే చుట్టమా?

చట్టం కొందరికే చుట్టమా?

Written By news on Friday, June 28, 2013 | 6/28/2013

- జగన్‌మోహన్‌రెడ్డిని జైలులో పెట్టడం అన్యాయం, అక్రమం
- సాక్షి చైతన్యపథంలో కర్నూలు మేధావుల ధ్వజం

కర్నూలు, న్యూస్‌లైన్: ‘బొగ్గుస్కాంలో ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఫైలు కదిలింది. అలాంటప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను ఎందుకు నిందితుడిగా చేర్చలేదు. ప్రజాప్రతినిధిగా లేని, సచివాలయానికి కూడా రాని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు బాధ్యుడిని చేస్తూ నిందితుడిగా ఎలా చేర్చారు. ప్రధానికో న్యాయం.. జగన్‌మోహన్‌రెడ్డికి ఒక న్యాయమా..’ అంటూ మేధావులు ప్రశ్నించారు. జిల్లా కేంద్రం కర్నూలు శివారులోని మెగాసిరి ఫంక్షన్ హాలులో స్వప్న వ్యాఖ్యాతగా సాక్షి చైతన్య పథం నిర్వహించారు. న్యాయవాది ఎస్.మనోహర్ మాట్లాడుతూ చట్టాలను రాజకీయాలు నడిపిస్తుండటం వల్లే జగన్‌మోహన్‌రెడ్డి ఏడాదిగా జైలులో ఉండాల్సి వచ్చిందన్నారు. 

చట్టం అందరికీ సమానంగా లేదని, ఒక్కొక్కరి పట్ల ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యాశాఖ రిటైర్డ్ జేడీ డాక్టర్ ఎన్.గంగయ్య మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి కేసు విషయంలో మీడియా తనకు బాగా సహకరించిందని లక్ష్మీనారాయణ చెప్పడాన్ని బట్టి జరిగిన కుతంత్రాలను అర్థం చేసుకోవచ్చన్నారు. మైనార్టీ సంక్షేమ సంఘం నేత రోషన్ అలీ మాట్లాడుతూ ప్రజలు, మేధావులు ఇకనైనా నిశ్చబ్దాన్ని ఛేదించుకుని బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సైకాలజిస్టు ధరణి అజేయచంద్ర మాట్లాడుతూ వ్యాపారాలను, పెట్టుబడులను ముడుపులుగా చిత్రీకరిస్తే ఎలాగన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు టి.శేషఫణి మాట్లాడుతూ చట్టం పాలకులకు చుట్టంగా మారడం వల్లే జగన్‌మోహన్‌రెడ్డి జైలులో ఉన్నారని పేర్కొన్నారు. 

వైఎస్ రాజశేఖరరెడ్డి తాత వల్లే మాటలొచ్చాయి
నా పేరు సాయికుమార్. మాది కర్నూలు. నేను పుట్టుకతోనే మూగచెవుడు. నాకు మాటలు తెప్పించాలని నాన్న స్వామిచంద్రుడు డాక్టర్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. అప్పట్లో నాకు ఆరేళ్లు దాటిపోయాయి. ఆరోగ్యశ్రీ పథకం కూడా వర్తించదని చెప్పారు. చివరకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వద్దకు నాన్న వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. నాలాంటి వాళ్ల ఆక్రందనలు విన్న వైఎస్ రాజశేఖరరెడ్డి తాతయ్య 2009 జనవరి 28వ తేదీన 12 ఏళ్ల వరకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చేయవచ్చంటూ జీవో జారీచేశారు.

దీంతో నేను అదే ఏడాది ఫిబ్రవరిలో ఆపరేషన్ చేయించుకున్నా. వైఎస్సార్ తాతయ్య దయవల్ల నేను ఇప్పుడు బాగా మాట్లాడుతున్నా, వింటున్నా. పదో తరగతి చదువుతున్నా. అయితే ఇప్పుడు రెండేళ్లలోపు వయస్సు వారికే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తారంట. నాలాగా ఇంకా ఎంతో మంది ఈ ఆపరేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. జగన్ అంకుల్ జైలు నుంచి బయటకు వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది. 
- సాయికుమార్, పదో తరగతి విద్యార్థి
Share this article :

0 comments: