శాసనసభలో వైఎస్ఆర్ సిపి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శాసనసభలో వైఎస్ఆర్ సిపి

శాసనసభలో వైఎస్ఆర్ సిపి

Written By news on Tuesday, June 18, 2013 | 6/18/2013

ఈ రోజు జరిగిన శాసనసభలో వైఎస్ఆర్ సిపి సభ్యులు పలు అంశాలను లేవనెత్తారు. విద్యుత్ ధరల భారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని ఆ ఆ పార్టీ సభ్యులు తెలిపారు. కరెంటు కోతలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఆ పార్టీ సభ్యులు స్పీకర్ కు పలు పిటిషన్లు ఇచ్చారు. 

కాపు రామచంద్రారెడ్డి: అనంతపురం జిల్లాలోని పలు గ్రామాల్లో ఆర్డిటి సంస్థ వేలాది ఇళ్లు కట్టించింది. ఆ ఇళ్లకు ప్రభుత్వం విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి. 

శోభానాగిరెడ్డి: రాష్ట్రం నుంచి గల్ష్ దేశాలకు వెళ్లినవారిలో పలువురు తీవ్ర ఇబ్బందుల్లో వున్నారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ప్రభుత్వం వెంటనే సాయం అందించాలి.

శ్రీకాంత్ రెడ్డి: వేలకోట్ల రూపాయలు ఖర్చుతో ప్రారంభమైన బ్రాహ్మణిస్టీల్స్ సంస్థను రాజకీయకక్షతో మూసేశారు. రాయలసీమలో లక్షలాది మందికి ఉపాధి అందించే బ్రాహ్మణిస్టీల్స్ సంస్థను తిరిగి ప్రారంభించాలి.

భూమన కరుణాకర్ రెడ్డి : తిరుపతి నియోజకవర్గంలోని ముత్యాలరెడ్డి పల్లి, రాజీవ్ నగర్, తిమ్మినాయుడు పంచాయితీలకు నీటి వసతి లేదు. ఆ పంచాయితీలకు నిధులు అంతంతమాత్రంగా అందుతున్నాయి. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ లో కలిపితే ఆ మూడు పంచాయితీలకు తగినన్ని నిధులు వస్తాయి.

విద్యుత్ ఛార్జీల పెంపు, విద్యుత్‌ కోతలపై వైఎస్ఆర్ సిపి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. 
Share this article :

0 comments: