బిసిల విషయంలో స్పందించని పార్టీలు: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బిసిల విషయంలో స్పందించని పార్టీలు: విజయమ్మ

బిసిల విషయంలో స్పందించని పార్టీలు: విజయమ్మ

Written By news on Sunday, June 30, 2013 | 6/30/2013

కరీంనగర్: ఎన్నికలలో పోటీ చేసేందుకు దామాషా ప్రకారం బిసిలకు టిక్కెట్లు కేటాయించే విషయంలో జగన్ బాబు ప్రతిపాదనకు ఏ రాజకీయ పార్టీ స్పందించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తెలిపారు. ఇక్కడ జరుగుతున్న పార్టీ కార్యకర్తల విస్త్రత స్థాయి సామావేశంలో ఆమె మాట్లాడారు. దామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు ఒక మాట అనుకొని బిసిలకు టిక్కెట్లు ఇవ్వాలని జగన్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 

ప్రజల సాధకబాదకాలు ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని చెప్పారు. రైతులను ఆదుకునే పరిస్థితిలేదన్నారు. అన్నిటి ధరలు పెరిగిపోయి ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ఛార్జీలతో ప్రజలపై భారం పెరిగిపోతోందని చెప్పారు. పన్నుల మీద పన్నులు పెంచేస్తూ ప్రజలను వేధిస్తున్నారన్నారు. మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వం దృష్టి అంతా ఉందన్నారు. విచ్చలవిడగా మద్యం సేవించినవారు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, దౌర్జన్యాలకు, హత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. తెనాలిలో మద్యం తాగిన యువకులు కొందరు తన బిడ్డని అల్లరిపెట్టడం చూసిన తల్లి అడ్డు వెళ్లగా ఆమెని వారు హత్య చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహారశైలిని దుయ్యబట్టారు. ఆయన కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఆయన వెన్నుపోటు రాజకీయాలను వివరించారు. కాంగ్రెస్ తో కలిసి ఆయన ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని నాటకాలు ఆడుతున్నారన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి పంచాయతీ గెలుచుకోవాలని కార్యకర్తలకు ఆమె పిలుపు ఇచ్చారు. ఎన్నికలలో అధికార పక్షం కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అధికార పక్షం అరాచకాలను అడ్డుకోవాలన్నారు. ఎన్నికలలో గెలుపుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని చెప్పారు. నామినేషన్లు వేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. 

అంతకు ముందు కరీంనగర్ చేరుకున్న విజయమ్మకు అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చి ఆహ్వానం పలికారు. మహిళలు బోనాలు , బతకమ్మలు , మంగళ హారతులతో స్వాగతం పలికారు. కోర్ట్ చౌరస్తాలో విజయమ్మ అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Share this article :

0 comments: