జన హృదయ నేతను నిర్బంధాలు ఏమీ చెయ్యలేవు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జన హృదయ నేతను నిర్బంధాలు ఏమీ చెయ్యలేవు

జన హృదయ నేతను నిర్బంధాలు ఏమీ చెయ్యలేవు

Written By news on Thursday, June 20, 2013 | 6/20/2013


కాంగ్రెస్, టీడీపీలు ఈ రాష్ట్రంలో అనాగరికమైన, అతిహేయమైన అన్యాయాలకు అక్రమాలకు పాల్పడుతున్నారని, జగన్ కేసులో అనేక తప్పులు చేస్తూన్నారని ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మేము గట్టిగా నమ్ముతున్నాం. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని జగన్ దోచుకున్నాడని ఆరోపిస్తున్న కాంగ్రెస్... నిజానికి తనే అధికారాన్ని అడ్డుపెట్టుకొని అరాచకాలు సాగిస్తోంది. కాంగ్రెస్‌ను వేలెత్తి చూపించే ప్రశ్నలు మా దగ్గర కూడా ఉన్నాయి.

వాటన్నిటికీ ఆ పార్టీ దగ్గర సమాధానం ఉందా?
హైకోర్టుకు శంకర్రావు లేఖ రాసినప్పుడే ప్రభుత్వం ఎందుకు కౌంటర్ వేయలేదు? హైకోర్టు అడిగినా దురుద్దేశపూర్వకంగా బదులివ్వకపోవటం కాంగ్రెస్ చేసిన అపరాధం. ప్రజల సొమ్ము దుర్వినియోగం అయిందంటూ గగ్గోలు పెడ్తున్నవారంతా జగన్ వ్యతిరేకులే! అప్పుడు జగన్ ఒక్కరి బాగుకోసం ఇంతమంది మంత్రులు, అధికారులు తప్పు చేశారంటే జనం నమ్మాలా? నాడు వ్యతిరేకించకుండా ఏ ప్రలోభాలకు లొంగి సంతకాలు పెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజశేఖర్‌రెడ్డిగారు చెబితే ఒత్తిళ్లకు లొంగి, తప్పుచేసేవారు ప్రభుత్వ పాలనాధికారాల్లో ఇన్నాళ్లు ఉంటే, వారిని ఇంటికి సాగనంపకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు జాప్యం చేస్తోంది? ఇక జీవోల విషయానికి వస్తే అవి రాత్రికి రాత్రే ఒక వ్యక్తి వల్ల అమలయ్యే అవకాశమే ఉండదు.

జగన్‌పై లేఖ రాసిన వ్యక్తి సామాన్యుడేమీ కాదు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే. అటువంటి వ్యక్తి ఏ అధికారంలోనూ లేని జగన్‌పై తప్పుడు కేసు పెట్టటం... దానికి టి.డి.పి ఇంప్లీడ్ కావటం చూస్తుంటే... ఇటువంటి శాసనసభ్యులనా మేము ఎన్నుకున్నదని ఆవేదన కలుగుతోంది. భవిష్యత్తులో మళ్లీ వీరిని చట్టసభలకి పంపితే ఇంకా ఎన్ని ‘తప్పుడు’ వ్యవహారాలు చేస్తారో కదా? ‘జగన్ ఒక దొంగ... అవినీతిపరుడు’ అని చంద్రబాబు నిత్యం తన పాదయాత్రలో ఆడిపోసుకున్నారు.

ఇలాంటి తప్పుడు కేసుకు నీరాజనం పలుకుతున్న చంద్రబాబుగారే జనం దృష్టిలో ఒక మహాదొంగగా, వంకర మనిషిగా కన్పిస్తున్నారని జనం అనుకోవడం ఆయన తన పాదయాత్రలో గమనించినట్టు లేరు. జగన్ ఓదార్పుయాత్రకి మొదట అనుమతిచ్చిన హైకమాండ్ జగన్ వెంట వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేక తిరస్కరించింది. జగన్ వెంట కాంగ్రెస్ నాయకులు పాల్గొనకూడదని శాసించింది. అయినా జనప్రభంజనాన్ని ఆపగలిగిందా? ఎవరో స్వార్థంతో తప్పుడు ఆరోపణలు చేసినంత మాత్రాన నమ్మడానికి జనం అంత అమాయకులు కాదు. తాము అభిమానంతో గెలిపించుకున్న ప్రజానాయకుడిని దొంగ, అవినీతిపరుడని చిత్రీకరిస్తే ఎవరూ ఒప్పుకోరు.

జగన్ కేసులో సీబీఐ చార్జిషీట్ల పరంపర చూస్తుంటే అందంతా ఓ తప్పుడు విధానమని స్పష్టంగా తెలుస్తోంది. దేశంలో ఎంత పెద్ద కేసులోనూ లేని విధంగా ఇన్ని చార్జిషీట్లా? తమ అభిమాన నేతను ఎక్కువరోజులు జైలులో బంధిస్తే జనం ఊరుకుంటారా? ప్రజల సహనం నశిస్తే నియంతలే కుప్పకూలిన సంఘటనలున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు జగన్‌లాంటి ఒక ప్రైవేటువ్యక్తిని బాధ్యుడిని చేయటం ఎంతవరకు న్యాయం? ఈ అపరాధాలన్నిటికీ కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలు భారీ మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉంది.
- కె. పద్మావతి, జి. అభిరామ్, జి. అంజనిదేవి,
పి.రామ్‌చందర్రావు, హైదరాబాద్
Share this article :

1 comments:

Laxminarayana Paladi said...

మహానేత వయ్యస్సార్ అకాలమరణం తరువాత, భారత జాతీయ కాంగ్రెస్, పాలించడానికి, ఆశ్చర్యకరంగా, క్రూరత్వాన్ని, అన్యాయాన్ని యెంచుకున్నది. కళ్లు పూర్తిగా కప్పేసుకున్నది, అధికారాన్ననుభవించడానికి.