కార్యకర్తలు నేతలుగా ఎదగడానికి స్థానిక సంస్థల ఎన్నికలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కార్యకర్తలు నేతలుగా ఎదగడానికి స్థానిక సంస్థల ఎన్నికలు

కార్యకర్తలు నేతలుగా ఎదగడానికి స్థానిక సంస్థల ఎన్నికలు

Written By news on Friday, June 28, 2013 | 6/28/2013

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలలో డబ్బు, మద్యం, పోలీసులతో ఇబ్బందిపెట్టే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లోని కేఎల్‌ఆర్ గార్డెన్‌లో జరుగుతున్న పార్టీ జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆమె ముఖ్య ఆతిథిగా ప్రసంగిస్తున్నారు. ముందుగా ఉత్తరాఖండ్‌ మృతులకు నివాళులర్పిచారు. జగన్‌పై కేసు రాజకీయ ప్రేరేపితమన్నారు. రెండేళ్లు పూర్తయినా జగన్‌ కేసు ఎందుకు పూర్తి చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. 

ఎప్పుడు ఏ ఎన్నికలకైనా పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఐక్యమత్యంతో ప్రజల్లోకి వెల్దామన్నారు. ప్రత్యర్థులకు సత్తా చూపాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణపై సర్కార్‌కు చిత్తశుద్ధి లేదని చెప్పారు. పల్లెలు చీకట్లో మగ్గిపోతున్నాయని, కరెంట్ బిల్లుల మోతతో పంచాయతీలు చతికిల పడ్డాయని తెలిపారు. పరిశ్రమలు పవర్‌హాలీడే ప్రకటిస్తున్నాయి, వేలాది ప్రరిశ్రమలు మూతపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై తప్ప మంచినీరు, సాగునీరుపై ధ్యాసలేదని విమర్శించారు. మహిళలపై అత్యాచారాల్లో రాష్ట్రం నెంబర్ 1 స్థానానికి ఎగబాకిందన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ ప్రభుత్వం పేర్లు మార్చి కొత్తపథకాలు పెడుతుందని చెప్పారు. చంద్రబాబు మద్దతుతోనే రాష్ట్ర కాంగ్రెస్ పాలన సాగిస్తోందన్నారు.ఆయన డైరెక్షన్‌ లోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. అధికార ప్రతిపక్షాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రాబోయే ఎన్నికలను చులకనగా తీసుకోవద్దన్నారు. ప్రతి పంచాయతీపై పార్టీ జెండా ఎగురవేయాలని చెప్పారు. అతివిశ్వాసం వద్దు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజాసమస్యలకు స్పందించాలని కూడా చెప్పారు. అప్పుడే ఎన్నికల్లో గెలుపు సాధ్యం అన్నారు. ఈ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కరువయిందని చెప్పారు. వైఎస్ఆర్ తెలంగాణ వాదాన్ని గౌరవించారని చెప్పారు. వైఎస్‌ఆర్ ఉంటే ప్రాణహిత చేవెళ్ల పూర్తయ్యేదన్నారు. 

కార్యకర్తలు నేతలుగా ఎదగడానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఉపయోగపడతాయని చెప్పారు. ప్రజలలో పార్టీకి మంచి బలం ఉందన్నారు. జగన్ బాబును చూసి ఓటు వేయమని ఓటర్లను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయం కోసం కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. కార్యకర్తలకు పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని తెలిపారు. సహాయసహకారాలు అందిస్తుందని చెప్పారు. దివంగత మహానేత వైఎస్ కార్యకర్తలను ఎలా చూసుకున్నరో మీ అందరికి తెలుసన్నారు. ఎన్నికలలో బిసిలకు న్యాయం చేయడానికి ఏ పార్టీ కూడా ముందుకురాలేదని చెప్పారు. సకాలంలో ఎన్నికలు జరగకపోవడం వల్ల గ్రామాలలో ఈరోజు అన్నీ సమస్యలే ఉన్నాయని తెలిపారు. ఆ నాడు వైఎస్ స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించారని చెప్పారు.

విజయమ్మ వస్తున్నారని తెలిసి అభిమానులు, కార్యకర్తలు ఘట్‌కేసర్‌ కు భారీ సంఖ్యలో తరలివచ్చారు. - See more at: http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=626961&Categoryid=14&subcatid=0#sthash.AhksHcRl.dpuf
Share this article :

0 comments: