షర్మిల పాదయాత్రతో బలపడిన వైయస్‌ఆర్‌సిపి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » షర్మిల పాదయాత్రతో బలపడిన వైయస్‌ఆర్‌సిపి

షర్మిల పాదయాత్రతో బలపడిన వైయస్‌ఆర్‌సిపి

Written By news on Thursday, June 27, 2013 | 6/27/2013

మరో ప్రజాప్రస్థానం 27-06-2013
మరో ప్రజాప్రస్థానం పేరిట శ్రీమతి షర్మిల చే‌స్తున్న పాదయాత్ర ప్రభావం ప్రజల్లో చాలా స్పష్టంగా, తీవ్రంగా ఉన్నదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ ‌పార్టీ ‌రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్‌ కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా చెట్టుపల్లిలో ఆయన గురువారంనాడు శ్రీమతి షర్మిల 192వ రోజు పాదయాత్ర ప్రారంభం సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శ్రీమతి షర్మిలతో పాటు ఆయన కొద్ది దూరం పాదయాత్రలో పాల్గొన్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర కారణంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతాలకు అతీతంగా అన్ని చోట్లా మరింతగా బలపడిందని ధీమాగా చెప్పారు. తెలంగాణలో కూడా తమ పార్టీ రోజురోజుకూ మరింతగా బలోపేతం అవుతున్నదని కొణతాల తెలిపారు. మహానేత వైయస్‌ఆర్‌ పట్ల తెలంగాణ ప్రజల్లో ఎనలేని అభిమానం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

రాష్ట్రంలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పష్టమైన, పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నదని కొణతాల చెప్పారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులలో ఉత్తేజపూరితమైన ప్రసంగాలు చేస్తూ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ, చక్కని దిశానిర్ధేశం చేస్తున్నారన్నారు. ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు సేవ చేయడం మరచి కాంగ్రెస్‌, టిడిపి ఎంపిలు ఘర్షణ పడటం సిగ్గుచేటు అని కొణతాల రామకృష్ణ విచారం వ్యక్తంచేశారు.

కాగా.. శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 192వ రోజు గురువారం ఉదయం విశాఖజిల్లా చెట్టుపల్లి నుంచి ప్రారంభించారు. ఈ రోజు పాదయాత్రలో వేలాది మంది వైయస్‌ అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులు ఆమెతో కలిసి ఉత్సాహంగా అడుగులు వేశారు. అక్కడి నుంచి శ్రీమతి షర్మిల వెలంకాయపాలెం, రోలుగుంట, భోగాపురం, కొత్తకొట, దొండపూడి గ్రామాల మీదుగా పాదయాత్ర చేస్తారు. శ్రీమతి షర్మిల 191వ రోజు బుధవారం పాదయాత్ర షెడ్యూలు ముగిసే సమయానికి రాష్ట్రంలో మొత్తం 2532.3 కిలోమీటర్లు నడిచారు.

http://www.ysrcongress.com/news/news_updates/ysrcp-strengthening-day-by-day-konatala-ramakrishna.html
Share this article :

0 comments: