జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే నిర్బంధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే నిర్బంధం

జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే నిర్బంధం

Written By news on Wednesday, June 5, 2013 | 6/05/2013

చైతన్యపథంలో గళం విప్పిన జనం

‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పై వచ్చిన ఆరోపణలు రుజువుకాలేదు. అయినప్పటికీ ఆయనను ఏడాదిగా జైల్లో నిర్బంధించారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ కక్షసాధింపు చర్యే’ అని పలువురు మేధావులు, సామాన్య ప్రజలు అభిప్రాయపడ్డారు. గూడూరులో మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో జరిగిన చైతన్యపథం చర్చా వేదిక లో వారు మాట్లాడుతూ.. ‘కరుడుకట్టిన తీవ్రవాదులకు కూడా కొద్ది నెలల్లోనే బెయిల్ మంజూరవుతుంది. అలాంటిది లక్షల మంది ఓటు వేసి పార్లమెంట్‌కు పంపిన జగన్‌మోహన్‌రెడ్డిని అకారణంగా ఏడాదిగా జైల్లో ఉంచడం ఏమిటి? ఆయనను రాష్ట్ర ప్రజలేగాక, దేశంలోని పలు రాష్ట్రాల్లో కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఉంచుకున్నారు. 

అలాంటి వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేకే కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. కాంగ్రెస్ పార్టీకి టీడీపీ కొమ్ముకాస్తోంది. ప్రజాగ్రహానికి త్వరలో ఆ రెండు పార్టీలు కొట్టుకుపోవడం తథ్యం’ అని అభిప్రాయపడ్డారు. వారి మాటల్లోనే.. 
- న్యూస్‌లైన్,గూడూరు

సీబీఐని పావుగా వాడుకుంటున్న కాంగ్రెస్ 
కేంద్ర, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అత్యున్నత వి చారణ సంస్థ అయిన సీబీఐని పావులా వాడుకుంటున్నాయి. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమం గా నిర్బంధించారు. బెయి ల్ మంజూ రులో నాన్పుడు ధోరణి వ్యవహరిస్తున్నా రు. ఇప్పటి వరకు ఎలాంటి నిరూపణలు చేయలేకపోయిన సీబీఐ మరో నాలుగు నెలల పాటు సమయం కావాలని అడగడం విడ్డూరంగా ఉంది. 
- డాక్టర్ ఉదయ్‌కుమార్, 
సూళ్లూరుపేట

నియంత పాలనకు నిదర్శనం 
వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఏడాది నుంచి అక్రమంగా నిర్బంధించి బెయిల్ మం జూరుకు అడ్డుపడుతున్న కేంద్రం, రాష్ట్రంలోని కాం గ్రెస్ ప్రభుత్వం నియంతగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐని చెప్పు చేతల్లో ఉంచుకుని వైఎస్సార్ కుటుంబంపై కక్షసాధింపు చర్యలు చేపట్టింది. ఎన్నో కేసులు సీబీఐ విచారణలో ఉన్నప్పటికీ ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి కేసునే ప్రత్యేకంగా చూస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది. 
- జానకిరామిరెడ్డి, సామాజిక కార్యకర్త, గూడూరు


హక్కులు ఉల్లంఘనే
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసులో సీబీఐ చేపట్టిన ధోరణి చూస్తుంటే హక్కుల ఉల్లంఘన వం దకు వంద శాతం ఉందని స్పష్టమవుతోంది. ఎన్నో కేసులు దేశవ్యాప్తంగా సీబీఐ చేతిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ కనుసన్నల్లోనే జగన్‌మోహన్‌రెడ్డి కేసును దర్యాప్తు చేస్తూ పంజరంలో చిలకలా సీబీఐ వ్యవహరిస్తోంది. అత్యున్నత న్యాయస్థానాలు సీబీఐని తప్పుపటినా చీమకుట్టినట్లు కూడా లేదు.
- దేవారెడ్డి బాబురెడ్డి, న్యాయవాది, కోట

చార్జిషీటులతోనే కాలయాపన 
జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేసి ఏడాది పూర్తి అయినప్పటికీ సీబీఐ చార్జిషీట్లు వేయడంలోనే కాలయాపన చేస్తూ కాంగ్రెస్ బ్యూ రో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారింది. అరెస్టయిన వా రికి 90 రోజుల్లోనే బెయిల్ మంజూరవుతుంది. అయితే కాంగ్రెస్ జేబు సంస్థగా ఉన్న సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగిస్తుస్తోంది. ఏడాదిగా జగన్‌కు బెయిల్ మంజూరు కాకుండా సీబీఐ అడ్డుపడుతోంది. 
- ఎస్‌ఎం.బాషా, 
రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు, చిల్లకూరు



ప్రజల గుండెల్లో కొలువైనందుకే 
వైఎస్సార్ కుటుంబం ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నందునే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూని జగన్‌మోహన్‌రెడ్డిని జైలు పాలు చేసింది. జనాదరణ పొందుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని చూసి ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇన్ని రోజులు జగన్‌ను జైల్లో ఉంచడం విచారకరం.
- వి.లలితమ్మ, 
పొదుపు సంఘం అధ్యక్షురాలు, చిట్టమూరు


ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు 
కాంగ్రెస్ పార్టీని వీడి కొత్త గా పా ర్టీని స్థాపించిన జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బందులపాలు చేయాలన్న సంకల్పంతో కాంగ్రెస్, టీ డీపీ కుట్రపూనాయి. ఆయనను జైలుపాలు చేశాయి. ఇప్ప టి వరకు పార్టీ వీడిన వారిని ఇంత ఇబ్బందులపాలు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఒక్క జగన్‌మోహన్‌రెడ్డిపైనే కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ బెయిల్ మంజూరుకు అడ్డుపడుతోంది.
- చంద్రమోహన్‌రెడ్డి, రైతు, కోట
మాటకు కట్టుబడినందుకు కేసులా? 
నల్లమల అడవుల్లో మహానేత వైఎస్సార్ మరణించిన సమయంలో రాష్ట్రంలో మృతిచెందిన అభిమానుల కుటుంబాలను జగన్‌మోహన్‌రెడ్డి ఓదారుస్తానని చెప్పారు. ఆ మాటకు కట్టుబడి జగన్ ప్రజల్లోకి వచ్చారు. జనాదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపన్ని కేసుల్లో ఇరికించింది. మంత్రి వర్గంలో ఉన్న వారిని విడిచి ఒక్క జగన్‌పైనే కేసులు పెట్టడం దారుణం.
- పెంచలయ్య, చేయూత సేవాసంస్థ అధ్యక్షుడు, గూడూరు

బెయిల్‌కు ఏడాదా? 
ఎంత పెద్ద నేరాలు చేసిన వారికైనా న్యాయ వ్యవస్థలో 90 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వ డం పరిపాటి. కానీ జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో మాత్రం ఇది జరగడం లేదు. జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి నేరం చేయకపోయినప్పటికీ కేవలం సోనియాగాంధీ మెప్పు కోస మే సీబీఐ ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. 
ఖాదర్‌బాషా, చిల్లకూరు 


కీలుబొమ్మలా వ్యవహరిస్తున్న సీబీఐ 
కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో సీబీఐ కీలు బొమ్మలా వ్యవహరిస్తోంది. దేశంలో ఎన్నో కేసులు ఉన్నప్పటికీ జగన్‌మోహన్‌రెడ్డి కేసును సీబీఐ ప్రత్యేకంగా చూస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా కాంగ్రెస్, టీడీపీ కుట్రపన్నుతున్నాయి.
- కేఆర్ దాసరి, 
గనుల పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్, గూడూరు

జీఓలపై సీబీఐకి ప్రశ్నించే హక్కు ఉందా
ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు తీసుకున్న నిర్ణయాలు జీఓల రూపంలో వస్తే వాటిని ప్రశ్నించే హక్కు ఏ మాత్రం సీబీఐకి లేదు. జగన్‌పై జరిగే కుట్రలో భాగంగానే దర్యాప్తును సీబీఐ నానుస్తూ పోతుంది. రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్సి బాధ్యత కోర్టులకు ఉంది. సీబీఐ అడిగిన కాలపరిమితి తర్వాత బెయిల్ మంజూరులో చొరవ చూపాలి.
- బి.దశరథరామిరెడ్డి, 
ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు, గూడూరు

కుట్రలో భాగమే అరెస్ట్ 
వైఎస్సార్ కుటుంబంపై కాంగ్రెస్, టీడీపీ పన్నిన కు ట్రలో భాగమే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. ఏడాది నుంచి జైల్లో ఉంచి బెయిల్ ఇవ్వకుండా కుటుంబ సభ్యులకు ఆయనను దూరం చేయడం దారు ణం. జగన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సభ్యులు ఉన్నారనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తించాలి.
- ఎస్‌కే ఆయేషా, 

పొదుపు సంఘం అధ్యక్షురాలు, చిల్లకూరు
ఉద్దేశపూర్వకంగానే
జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్ర భుత్వం అరెస్టు చేయిం చింది. రాజశేఖరరెడ్డి ము ఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ప్రజాప్రతినిధిగా లేకపోయినా అన్యాయంగా ఆయనపై అపవాదులు మోపడం సరికాదు. సీబీఐ దర్యాప్తును నత్తనడకన చేస్తుండడంతోనే బెయిల్ మంజూరులో కాలయాపన జరుగుతోంది. 
- భవానీ, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షురాలు, గూడూరు

వ్యవస్థపై నమ్మకం పోతోంది 
జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నా ప్రభుత్వాలను చూస్తుంటే సామాన్యులకు కూడా వ్యవస్థపై నమ్మకం పోతోంది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వారిని ఇబ్బందులపాలు చేయడం కాంగ్రెస్‌కు కొత్తకాదు. గతంలో కూడా ఇలాగే వ్యవహరించింది. అయితే ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు కాకుండా కుట్రపన్ని సీబీఐ, కోర్టులను లోబరుచుకున్న ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుంది. 
- బి.శివకుమార్‌రెడ్డి, గూడూరు


పెట్టుబడులను ముడుపులుగా... 
వ్యాపారవేత్తగా జగన్‌మోహన్‌రెడ్డి పెట్టుబడులను ఆ హ్వానిస్తే వాటిని ముడుపులుగా స్వీకరించారంటూ అ పవాదును ఆపాదిస్తున్నా రు. పెట్టుబడులపై ఆదాయపుపన్ను శాఖ ప్రశ్నిం చాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోద్బలంతో సీబీఐ ప్రశ్నించడం సబబు కాదు. ఇలా పెట్టుబడి పెట్టేవారిని సీబీఐ ప్రశ్నిస్తూ పోతే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు ఎక్కడా జరగదు.
- సుందరరామిరెడ్డి, ట్రాన్స్‌కో విశ్రాంత ఎస్‌ఈ, గూడూరు

ముమ్మాటికీ కక్ష సాధింపే 
ప్రజల్లో జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ కుమ్మకై సీబీఐతో అక్రమంగా జగన్ ను జైల్లో పెట్టించారు. సో నియాగాంధీ అల్లుడు కూ డా భూముల కొనుగోలు కుంభకోణంలో ఉన్నప్పటికి సీబీఐ కనీ సం ప్రశ్నిం చడం కూడా చేయలేదు. ఇది కేవలం జగన్‌పై కక్ష సా దింపు చర్యే. 
- లీలాకృష్ణయాదవ్, బీసీ విద్యార్ది సంఘం నాయకులు, గూడూరు 

వైఎస్ కుటుంబానికి 
కాంగ్రెస్ తీరని ద్రోహం చేస్తోంది 
ప్రజల అభ్యున్నతి కోసమే అహర్నిశలు కృషి చేసిన వై ఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ఎనలేని ద్రోహం చేస్తుంది. జగన్‌ను రాజకీయంగా ఎ దుర్కోలేకే సీబీఐని పావుగా వాడుకుంటున్నాయి. కాం గ్రెస్, టీడీపీ జగన్‌కు బెయిల్ రాకుండా కుమ్మక్కు కుట్ర లు చేస్తున్నాయి. జగన్ బెయిల్ విషయంలో సీబీఐ తీరు గర్హనీయం. 
- శ్యామ్యుల్(గూడూరు)

sakshi
Share this article :

0 comments: