రాబోయే ఎన్నికల్లో... జగన్‌కే ప్రజల మద్దతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » రాబోయే ఎన్నికల్లో... జగన్‌కే ప్రజల మద్దతు

రాబోయే ఎన్నికల్లో... జగన్‌కే ప్రజల మద్దతు

Written By news on Tuesday, June 18, 2013 | 6/18/2013

మనదేశంలో, రాష్ట్రాలలో పాలకపక్షంలో ఉన్నవారు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడినప్పుడు ప్రజలు తమ ఓటుహక్కుతో వారిని మార్చివేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆనాడు ‘బస్సుయాత్ర’ చేసి ఎన్.టి.రామారావుగారు, ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేసి డాక్టర్ వైయస్. రాజశేఖర్‌రెడ్డిగారు ప్రజల్ని ప్రభావితం చేసి ప్రజాప్రభుత్వాలను నెలకొల్పారు. అలాగే జగన్‌గారు ‘ఓదార్పుయాత్ర’ చేసి ప్రజల మనసులను చూరగొన్నారు. ఇప్పుడు ‘మరో ప్రజాప్రస్థానం’గా పాదయాత్ర చేస్తూ షర్మిలగారు ప్రజాదరణ పొందుతున్నారు. రాబోయే ఎన్నికల్లో వీరు ప్రజల మద్దతు కూడగట్టుకుని కుటిల రాజకీయశక్తుల చేతిలో ఉన్న అధికారాన్ని జేజిక్కించుకుని ప్రజాప్రభుత్వాలను ఏర్పాటుచేసి తీరుతారు. 

ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబుగారు ‘వస్తున్నా మీకోసం’ అంటూ పాదయాత్ర చేస్తూ, అధికారపార్టీకి ఒక్కక్షణం కూడా పాలించే హక్కు లేదంటూ పాదయాత్ర జరిపారు. కానీ అసెంబ్లీ సమావేశాల్లో అన్ని ప్రతిపక్ష పార్టీలు అధికారపార్టీ మీద అవిశ్వాసం పెడితే చివరికి అధికారపార్టీని కాపాడారు! ఎవరైనా పార్టీలో అవిశ్వాసానికి మద్దతు పలికితే సస్పెండ్ చేస్తామని ‘విప్’ కూడా జారీచేశారు. మరి ఈయన ‘వస్తున్నా మీ కోసం’ అంటూ పాదయాత్రను ఎవరికోసం చేస్తున్నారనుకోవాలి? ప్రజలకు నిజానిజాలు తెలుసు. ఎవరు తమకు మేలు చేస్తారో కూడా తెలుసు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వారు పట్టం కట్టబోయేది వై.ఎస్.జగన్‌కేనన్నది స్పష్టంగా అర్థమౌతోంది.

- ఎన్. కృష్ణకుమార్, ముత్తూరుగేట్, నెల్లూరు

అణగదొక్కాలని చూస్తున్న పెద్దలారా...

కెరటంలా లేస్తాడు జగనన్న
ఎవరు ఆపగలరు ఉవ్వెత్తున ఎగిసిపడే ఆ అలని
ఉప్పెనలా తన్నుకొచ్చే ఆ పొంగుని
ప్రవాహమై పారుతుంది విజయపు దిశగా
ఘోషిస్తూ పరిగెడుతుంది ప్రజాసేవే లక్ష్యంగా

సంకెళ్లు వేసినా ఆపలేరు ఆ అలజడిని
చెరసాల బంధించినా నిలుపలేరు ఆ ఉరవడిని
చూస్తోంది జనజీవనం జైలుపాలు చేసిన వైనం
ఏకాకిని చేసి వేధిస్తున్న దృశ్యం

కదిలిపోతాయి కారాగార పునాదులు ఓట్ల మెజారిటీతో
బద్దలైపోతాయి సంకెళ్ల గొలుసులు గెలుపు ధ్వనులతో

రారాజులా వస్తాడు జగనన్న 
త్వరలో రాజ్యమేలుతాడు
సువర్ణపాలన తెస్తాడు!

- జె.రాజేశ్, తెనాలి
Share this article :

0 comments: