జైల్లో కాదు జనం గుండెల్లో.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జైల్లో కాదు జనం గుండెల్లో..

జైల్లో కాదు జనం గుండెల్లో..

Written By news on Saturday, June 8, 2013 | 6/08/2013


‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డిని జైల్లో పెట్టామని కాంగ్రెస్, టీడీపీ సంబరపడుతున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డిని కాదు జనాన్ని, జనం కలల్ని జైల్లో పెట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు నిశ్శబ్దంగా తమ ఓటు హక్కుతో ప్రజా వ్యతిరేక పాలకులకు బుద్ధి చెబుతారు. సీబీఐ పెట్టిన కేసులన్నీ రాజకీయ కక్ష సాధింపుతోనే అని ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ర్టంలో చిన్న పిల్లవాడిని అడిగినా జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో ఎవరు? ఎందుకు? పెట్టారో చెబుతారు. అరచెయ్యి అడ్డుపెట్టి సూర్యుడ్ని ఆపలేరు.’ ఇవీ శుక్రవారం మదనపల్లెలో నిర్వహించిన చైతన్యపథం సదస్సులో వక్తల అభిప్రాయాలు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే...

మంత్రులకో న్యాయం జగన్‌కో న్యాయమా?

వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో 2004లో క్యాబినెట్లో చర్చించి నిర్ణయాలు తీసుకున్న మంత్రులు సచ్చీలురా? ఆనాడు మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలకు జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధం ఏమిటి? మంత్రులకు సంబంధం లేకపోతే.. జగన్‌మోహన్‌రెడ్డికి ఏం సంబంధం? ఇదెక్కడి న్యాయం. చంద్రబాబు హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయి. ఆయనపై విచారణ కోరితే సిబ్బంది లేరని సీబీఐ తప్పుకుంటుంది. అదే జగన్ విషయంలో ఆగమేఘాలమీద విచారణ ప్రారంభించి, లేనిపోని అభియోగాలు మోపి అరెస్టు చేసింది. తండ్రి మాట విని ఆనాడు రాముడు అడవులకు వెళ్లాడు. ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చేందుకు ఓదార్పుయాత్ర చేసి జగన్ ఈనాడు జైలుకు వెళ్లాడు. ప్రజల గుండెల్లో జగన్‌కు రాముడికుండే స్థానం ఉంది. 
- బీఎస్‌ఆర్ ప్రసాద్, ఇంజినీరింగ్ కాలేజ్ లెక్చరర్, సీటీఎం 

పౌర స్వేచ్ఛను హరిస్తున్నారు 

ప్రజాస్వామ్యంలో పౌరుడికి ఉండే స్వేచ్ఛను హరిస్తున్నారు. నేడు యావత్ భారతదేశంలో ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా జైల్లో పెట్టడం గురించే చర్చిస్తోంది. సోనియా, కిరణ్, చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు ప్రజలు అర్థం చేసుకున్నారు. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను ఓదార్చుతున్న జగన్‌మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న అభిమానాన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేకపోయింది. సొంతంగా పార్టీ పెట్టుకున్నారనే అక్కసుతో కుట్రపన్ని సీబీఐ కేసుల్లో ఇరికించింది. పదికోట్ల ఆంధ్రుల శక్తి జగన్‌మోహన్ రెడ్డి. ఆయన త్వరలోనే బయటకు వచ్చి తనను నమ్ముకున్న వారిని కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు. సీబీఐ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారింది. ఇదెంతో కాలం కొనసాగదు. 
- జింకా వెంకటాచలపతి, ట్రేడ్ యూనియన్ నాయకుడు, మదనపల్లె 

బెయిల్ ఇవ్వకపోవడం కక్షసాధింపే

ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరైనా ఏదేని కేసులో అరెస్టయితే 90రోజుల తరువాత బెయిల్‌పై విడుదలయ్యే హక్కు ఉంది. ప్రజల తరుపున నిలబడిన జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రం బెయిలు ఇవ్వకుండా ఏడాదిగా జైల్లోనే ఉంచడం కక్షపూరిత చర్య. దీన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి. రాబోయే ఎన్నికల్లో ప్రజలు జగన్‌మోహన్‌రెడ్డి పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వానికి,ప్రతిపక్ష టీడీపీకి బుద్ధి చెబుతారు. 
- సునీత, గృహిణి, ఆరోగ్యవరం

జగన్ వ్యక్తి కాదు శక్తి 

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక వ్యక్తి కాదు శక్తి. జైలుగోడలు, నిర్భంధాలు జగన్‌ను ఏమీ చేయలేవు. ఆడపడుచుల అన్న జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే జనం మధ్యలోకి వస్తాడు. ఆడవాళ్ల కన్నీళ్లను తుడుస్తాడు. ఎవరెన్ని కేసులు పెట్టినా జగన్‌మోహన్‌రెడ్డిని ఎవరూ ఏమీ చేయలేరు. సత్యం, ధర్మం ఆయన పక్షాన ఉన్నాయి. చేయని తప్పులకు వేధింపులకు గురిచేసిన వారే ప్రజాగ్రహానికి కొట్టుకుపోతారు. 
- సత్య, గృహిణి, మదనపల్లె 

రైతు పక్షపాతి వైఎస్సార్

చిన్ననాటి నుంచే రైతులు పడ్డ కష్టాలను దివంగత వైఎస్‌ఆర్ ప్రత్యక్షంగా చూశారు. తాను వ్యవసాయం చేయడంతో వాటిలో కష్టనష్టాలు ఆయనకు తెలుసు. కాబట్టే రైతు సంక్షేమం కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉచిత విద్యుత్‌ను ప్రవేశపెట్టారు. రైతుల రుణాలను మాఫీ చేయడంతో ఎంతో మంది కన్నీళ్లను తుడిచారు. వైఎస్‌ఆర్ అకాల మరణంతో ఆయన తనయుడు రైతులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూడలేక కేంద్రంలోని పెద్దలు, రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ఏకమై ఆయనపై కేసులు బనాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెన్నుపోటుదారుడైన చంద్రబాబు ఏకమైనా ప్రజలు వారి కుయుక్తులను అడ్డుకుని వారి కుట్రలను అంతం చేస్తారు. 
- గౌరీ శంకర్‌రెడ్డి, రైతు, ములకలచెరువు 

వైఎస్సార్ లేని లోటు తెలుస్తోంది 

వైఎస్సార్ లేని లోటు క్షణక్షణం తెలుస్తోంది. ఆ లోటును తీర్చడానికి ప్రజల్లోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని కొన్ని రాజకీయ శక్తులు అడ్డుకున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డిని అడ్డుకునేందుకు జైలులో ఉంచినా ఇది తాత్కాలికమే కాని శాశ్వతం కాదు. కాంగ్రెస్, టీడీపీ పెద్దలు నేడు జగన్‌ను జైల్లో పెట్టామని సంబరపడిపోతున్నారు. వాస్తవానికి ఆంధ్ర రాష్ట్రంలోని 9 కోట్ల జనాన్ని జైల్లో పెట్టారన్న సంగతి వారికి తెలియడం లేదు. ఆ సంగతి త్వరలోనే తెలుస్తుంది. ప్రభుత్వమే సీబీఐని శాసిస్తోంది. సీబీఐ వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదు. సర్వోన్నతన్యాయస్థానం దేశ పౌరుడైన జగన్‌మోహన్ రెడ్డి హక్కులను కాపాడుతుందనే నమ్మకం ఉంది.
- విష్ణువ ర్థన్‌రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయుడు, మదనపల్లె 

సచ్చీలుడిగా బయటపడతాడు

జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన కేసులు న్యాయస్థానాల్లో నిలబ డవు. కేవలం కక్ష సాధింపుకోసం పెట్టిన కేసులుగా తెలిసిపోతోంది. ఎవరెన్ని కేసులు పెట్టినా జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మనిషి. దీన్ని జీర్ణించుకోలేక కుయుక్తులు పన్నారు. న్యా యాన్ని, ధర్మాన్ని ఎంతోకాలం అణచివేయలేరు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. 
- రాజన్న, ఎంపీటీసీ సభ్యుల మాజీ అధ్యక్షుడు, రామసముద్రం 

పేదలకు విద్యా భిక్ష పెట్టారు

ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదవాలని వైఎస్సార్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ను పెట్టారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని జలయజ్ఞాన్ని ప్రవేశపెట్టారు. పాలకులు కుర్చీలకోసం తన్నులాడుకుంటున్నారే కాని వీటిని మరిచిపోయారు. వీటిని అమలు చేయమని అడిగిన జగన్‌మోహన్ రెడ్డిని మాత్రం జైలుపాలు చేశారు. సీబీఐ, ప్రభుత్వం ఆడుతున్న రాజకీయ చదరంగంలో పావుగా మారింది. వారు చెప్పినట్టు నడుచుకుంటూ జగన్‌మోహన్‌రెడ్డిని వేధిస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో చట్టబద్ధంగా పెట్టుబడులు పెట్టినవారిని వేధిస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీలను ఆస్తులను జప్తు చేస్తూ వేధిస్తోంది.
- బిల్లూరి గోవింద్‌రెడ్డి, రిటైర్డ్ ఇంజినీర్, మదనపల్లె 

కాంగ్రెస్, టీడీపీ గల్లంతు ఖాయం

ఆడబిడ్డలను కన్నీళ్లు పెట్టిస్తున్న కాంగ్రెస్, టీడీపీలు వచ్చే ఎన్నికల్లో మట్టికొట్టుకుపోతాయి. సీబీఐది కక్ష సాధింపు చర్య. జగన్ మోహన్‌రెడ్డికి ఓటు వేసే అవకాశం ఎప్పుడొస్తాందా అని యావత్ రాష్ట్ర మహిళలు ఎదురుచూస్తున్నారు. జగన్ తల్లి, భార్య, చెల్లెలు పడుతున్న కష్టం ఊరికే పోదు. అలాగే వారి ఉసురు కాంగ్రెస్,టీడీపీ నాయకులకు తగులుతుంది. మహిళాలోకం ఆగ్రహానికి వీరు కొట్టుకు పోతారు. త్వరలోనే జగన్‌మోహన్‌రెడ్డిని మా ఓటుతో గెలిపించి వైఎస్‌ఆర్ రుణాన్ని తీర్చుకుంటాం. 
- సుగుణ, గృహిణి, బసినికొండకాలనీ, మదనపల్లె 

కార్మిక బాంధవుడు వైఎస్సార్

చేనేత కార్మికులను ఆదుకుంది ఒక్క వైఎస్‌ఆర్ మాత్రమే. అప్పుల ఊబిలో ఇరుక్కున్న నేతన్న ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాన్ని అదుకున్న మహా నుభావుడు రాజశేఖరరెడ్డి ఒక్కరే. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోకుండా ఎన్నో పథకాలు పెట్టారు. ఇప్పుడేమో నేతన్నలకు ఎలాంటి భరోసా లేదు. తిరిగి నేతన్నలు కోలుకోవాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిందే. జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడానికి నేతన్నలు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. 
- వెంకటశివారెడ్డి, నేతకార్మికుడు, నీరుగట్టువారిపల్లె

జగన్ శక్తిని ఆపలేరు

జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి విడుదలై ప్రజల్లోకి వస్తారు. సూర్యకాంతిని, జగన్ శక్తిని ఆపడం ఎవరి వల్లా కాదు. ఆరోజు దగ్గర్లోనే ఉంది. ప్రజ లకు అండగా నిల బడే నాయకుడిని విడిపించుకోవడం కోసం ఎదురుచూస్తున్నాం. జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి మాకు చేకూర్చిన లబ్ధి వల్లే సమాజంలో ఆర్థికంగా నిలబడ్డాం. ఆయన పథకాలు కొనసాగాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. వేరొకరి వల్ల రాష్ర్టంలో మహిళలకు భరోసా లేదు. మహిళల కన్నీళ్లు తుడిచిన జగన్‌మోహన్‌రెడ్డిని మహిళలే సీఎం చేస్తారు.
- ఉషారాణి, గృహిణి, దేవళంవీధి, మదనపల్లె

న్యాయం, ధర్మం అనేది లేదనిపిస్తోంది 

రాష్ట్రంలో చట్టం, న్యాయం, ధర్మం అనేది లేదనిపిస్తోంది. అవి కొంతమంది స్వార్థపరుల చుట్టాలుగానే మిగిలిపోయా యి. జనచైతన్య శక్తిని జైల్లో పెట్టామని కాం గ్రెస్, టీడీపీలకు తెలి సేరోజు దగ్గరలోనే ఉంది. ఓటు అనే ఆయుధంతో ఆ పార్టీల నియతృత్వ పోకడలను తెగనరికే రోజులు వస్తున్నాయి. వైఎస్సార్ తన పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డు ఉద్యోగులకు పలు ప్రయోజనాలు చేకూర్చారు. అందుకే ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి వెంట మేమంతా ఉంటాం.
- టీ రామచంద్రారెడ్డి, రిటైర్డ్ ఉద్యోగి, మదనపల్లె 

జగన్ కోసం ఎదురుచూస్తున్నాం

వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేసిన జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజాదరణ పెరగడంతో ఓర్వలేక అక్రమంగా జైలుపాలు చేశారు. ప్రజల్లో జగన్‌మోహన్‌రెడ్డికి మరింత ప్రజాదరణ పెరిగింది. ఎప్పుడెప్పుడు బయటకొస్తారా అని జనం ఎదురుచూస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే రాజన్న రాజ్యం సాధ్యమౌతుందని ప్రజలు ఆశిస్తూ ఎన్నికల కోసం వేచిచూస్తున్నారు. నిశ్శబ్ద విప్లవం ద్వారా జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలని జనం కలలు కంటున్నారు. జనం కలలు నెరవేరే రోజు దగ్గర్లోనే ఉంది. 
- చంద్రశేఖర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు, మదనపల్లె 

తల్లికి, భార్యకు, బిడ్డలకు దూరం చేశారు

జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మనిషి అయి నా సగటు మనిషే. అతనికి తల్లి, భార్య, పిల్లలు ఉన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరిస్తోంది. ఆయన్ను తల్లికి, భార్యకు, పిల్లలకు దూరం చేశారు. దీన్ని ఆ దేవుడు కూడా క్షమించడు. జగన్‌మోహన్‌రెడ్డిని నాలుగుగోడల మధ్య ఉంచినంతమాత్రాన జనం గుండెల్లోంచి, వారి ప్రేమానురాగాల నుంచి ఆయన్ను దూరం చేయలేరు. ఆడబిడ్డలు పడుతున్న బాధ మాకు తెలుసు. మా ఓటు బ్యాంకు ద్వారా ప్రజాస్వామ్యానికి వేసిన సంకెళ్లను తెంచేస్తాం. 
- శాంతమ్మ, రిటైర్డ్ స్టాఫ్‌నర్సు, మదనపల్లె 

జగన్ ఒక ప్రభంజనం

జగన్ జైల్లో కాదు ప్రజ ల గుండెల్లో ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా జైల్లో పెట్టినంత మాత్రాన ఆయన ప్రభంజనాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదు. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారనడం వాస్తవం కాదు. ఆయనపై సీబీఐ అభియోగాలు మోపాక ఏడాదిన్నర కాలం జనంలో ఉన్నారు. ఆ సమయంలో ఎవరిని ప్రభావితం చేశారో సీబీఐ చెప్పాలి. సీబీఐ స్వతంత్ర సంస్థ అయినా వెన్నెముక లేకుండా వానపాములా వ్యవహరిస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి కడిగిన ముత్యంలా ప్రజల ముందుకొస్తారు. 
- గుణతేజ, బీటెక్ విద్యార్థి, మదనపల్లె 

మహిళల అండ జగన్‌కే

రాష్ట్రంలోని మహిళా లోకం అంతా జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంది. ఆయన తండ్రి వైఎస్సార్ మహిళల ఆర్థిక స్వయం సంవృద్ధికి ప్రవేశపెట్టిన పథకాలు మాకు కొత్త జీవితాన్ని ఇచ్చాయి. ఆయన పథకాలన్నిం టినీ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగిస్తారనే నమ్మకం మాకు ఉంది. అందువల్లే మేము ఆయన్ను సొంత అన్నలా, తమ్ముడిలా, బిడ్డలా అభిమానిస్తున్నాము. వైఎస్‌ఆర్ మరణం తరువాత ఆయన తండ్రి లేని బిడ్డలను పలకరించేందుకు వచ్చాడు. కుటుంబ పెద్దలు మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలిచాడు. 
- శైలజ, గృహిణి, న్యూఈస్ట్‌పేట
Share this article :

0 comments: