జగన్ అరెస్టుపై జాతీయ స్థాయిలో చర్చ అవసరం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అరెస్టుపై జాతీయ స్థాయిలో చర్చ అవసరం

జగన్ అరెస్టుపై జాతీయ స్థాయిలో చర్చ అవసరం

Written By news on Saturday, June 8, 2013 | 6/08/2013

* రాష్ట్రంలో పౌర హక్కులకు భంగం వాటిల్లుతోంది 
* పోలీస్ ప్రాసిక్యూటర్‌గా మారిన అశోక్ భాన్ 
* సాక్షి చైతన్య పథంలో న్యాయనిపుణుల అభిప్రాయం 

మదనపల్లె, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు, సీబీఐ అనుసరిస్తున్న వైఖరి, కోర్టులో బెయిల్ ఇవ్వక పోవడం వంటి అంశాలపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని పలువురు మేధావులు, న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. జగన్ అరెస్టు విషయంలో మానవ హక్కుల సంఘం నేతలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ర్టంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం పరితపించిన మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం క న్నీళ్లు పెట్టిస్తోందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లెలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చైతన్యపథం చర్చావేదికలో న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మదనపల్లె బార్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి, న్యాయవాది యహసానుల్లా మాట్లాడుతూ 26 జీవోల జారీలో ప్రమేయం ఉన్న మంత్రులు సచ్ఛీలురయితే, అధికారమే లేని జగన్ అవినీతిపరుడెలా అవుతారని ప్రశ్నించారు. 

ఒక కేసులో ఒకసారి చార్టిషీటు దాఖలు చేస్తే అదే అంతిమ నేరారోపణ పత్రం అవుతుందని స్పష్టం చేశారు. జగన్ కేసు విషయంలో చార్టిషీట్లు వేసుకుంటూ పోతున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. జగన్‌ను ప్రజలకు దూరంగా ఉంచాలనే వ్యూహంలో భాగంగానే చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు యమలా సుదర్శనం మాట్లాడుతూ జగన్ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న అశోక్ భాన్ పోలీస్ ప్రాసిక్యూటర్‌గా మారిపోయారన్నారు. రామోజీరావు దళితుల భూములను ఆక్రమించి ఫిలిం సిటీ నిర్మిస్తే, ఆ అక్రమాలపై విచారణ ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. చంద్రబాబు భూ కుంభకోణాలపై ఎందుకు ప్రశ్నించరన్నారు. మదనపల్లె ముస్లిం మతపెద్ద అమీన్ పీర్ మాట్లాడుతూ రోజూ ఐదుసార్లు నమాజ్ చేసే సమయంలో జగన్ విడుదల కోసం అల్లాను ప్రార్థిస్తున్నానన్నారు. నరసింహారావు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ లెక్చరర్ జేడీ ప్రేమ, వ్యాపారి శివారెడ్డి, రైతు నాయకుడు వై.ఎర్రయ్య మాట్లాడారు.
Share this article :

0 comments: