అవమానించినట్లే..! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవమానించినట్లే..!

అవమానించినట్లే..!

Written By news on Saturday, June 15, 2013 | 6/15/2013

 నేరం రుజువు కాకుండానే ఇంతకాలం జైళ్లో ఎలా నిర్బంధిస్తారు..!
* బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే ఆలస్యంగా చార్జిషీట్లు
* న్యాయవ్యవస్థను సీబీఐ తప్పుదోవ పట్టిస్తోంది
* ఎన్నికుట్రలు పన్నినా జగన్ ఎదుగుదలను అడ్డుకోలేరు... ఆయన నుంచి మమ్మల్ని విడదీయలేరు 
* ‘సాక్షి చైతన్య పథం’లో జిల్లా వాసులు

ప్రజాస్వామ్యయుతంగా వైఎస్ జగన్‌ను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకున్నాం.. మాకు సేవ చేయాల్సిన జగన్‌ను జైళ్లో పెడతారా.. ఇది ముమ్మాటికీ అన్యాయం చేయడమే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.. జిల్లా ప్రజలను అవమానించడమే.. అంటూ కడపవాసులు భగ్గుమన్నారు. జగన్‌కు అండగా మేముంటామంటూ మహిళలు యువకులు స్పష్టం చేశారు. సాక్షి చైతన్య పథం సదస్సుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి వైఎస్ కుటుంబంపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. సీబీఐ తీరును ఎండగట్టారు. ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇంతమంది ఏకం కావాలా అని ప్రశ్నించారు.

సాక్షి, కడప: పార్లమెంట్ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వకుండా నెలలతరబడి నిర్బంధించడం సరైందికాదని.. ఇది జిల్లాకే అవమానమని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి పైగా బెయిల్ రాకుండా జగన్‌ను అక్రమంగా నిర్బంధించిన నేపథ్యంలో శుక్రవారం నగరంలోని అపూర్వ కళ్యాణ మంటపంలో ‘సాక్షి చైతన్య పథం’ నిర్వహించారు. సాక్షి టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ చర్చావేదికలో ఉపాధ్యాయ ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారె డ్డి, ఇంటాక్ కన్వీనర్ ఇలియాస్‌రెడ్డి, ఆడిటర్ సయ్యద్‌అహ్మద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్‌కుమార్‌రెడ్డి, ముస్లిం మత గురువు ముక్తీ మహ్మద్ అలీ బగ్దాదీ, ఎంబీఏ విద్యార్థి జ్యోతి వక్తలుగా హాజరై తాము గెలిపించుకున్న ప్రజాప్రతినిధి ప్రజల నుంచి దూరం కావడం బాధాకరమన్నారు. 

జగన్ అక్రమ నిర్బంధంతో ఆయన తల్లి, చెల్లి, భార్య, బిడ్డలు..వారితో పాటు జిల్లా వాసులంతా బాధపడుతున్నారని రియాజుద్దీన్ అనే వ్యక్తి ఉద్వేగంతో అన్నారు. ఈ మాటలకు బార్‌అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్‌కుమార్‌రెడ్డి స్పందించి‘26 జీవోలు తప్పని, అందుకే జైగన్‌ను జైళ్లో పెట్టామని సీబీఐ అంటోంది.. 2009కి ముందు జగన్ ప్రజాప్రతినిధి కాదు..ఆ 26 జీవోలు ఇవ్వలేదు.. అలాంటప్పుడు ఆయన చేసిన తప్పేంటి? ఇదేంటని ప్రశ్నిస్తే ‘క్విడ్‌ప్రోకో’ అని అంటగడతారు.. ఇదేనాప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. 

ఇంతలో అబ్దుల్‌కలాం అనే వ్యక్తి కలుగజేసుకుని ‘ మేడమ్.. అప్పట్లో వైఎస్ మా సీఎం.. ఇప్పుడు జగన్ మా ఎంపీ.. వారంతా మాకు చాలా మేలు చేశారు.. మా జగన్‌రెడ్డికి ఓట్లేస్తే ‘క్విడ్‌ప్రోకో’ అని అరెస్టు చేస్తారేమో’ అని అనడంతో చర్చావేదికలో చప్పట్ల వర్షం కురిసింది. ఇంతలో ఇంటాక్ కన్వీనర్ ఇలియాస్‌రెడ్డి కలుగజేసుకుని ‘ పెట్టుబడులు పెట్టినవారు మాకు మోసం జరిగిందని చెప్పలేదు.. నష్టం వచ్చిందనీ బదులివ్వలేదు.. మరి క్విడ్‌ప్రోకో అని ఎలా అరెస్టు చేస్తారు..పోనీ దర్యాప్తు అయినా సక్రమంగా చేసి చార్జిషీటు ఫైలు చేశారా? అంటే అదీ లేదు.. ఏడాది దాటినా నాన్చుడుధోరణితో వ్యవరిస్తున్నారన్నారు. ఇంతలో రాజేశ్‌కుమారెడ్డి మళ్లీ మైకందుకుని సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలన్నారు. ఆడిటర్ సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ మన బిడ్డ జైళ్లో ఉంటే ఎంత బాధఉంటుందో...జిల్లా వాసులంతా అలానే బాధపడుతున్నారని, జనాల కోసం ఓ బిడ్డ జైళ్లో...మరో బిడ్డ రోడ్డుపై ఉండటం.. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో!’ అని విచారం వ్యక్తం చేశారు. 

ఇంతలో ఎంబీఏ విద్యార్థిని జ్యోతి జోక్యం చేసుకుని జగన్ సీఎం కాకుండా అడ్డుకునేందుకే జైళ్లో పెట్టారన్నారు. దీనిపై మతగురువు బగ్దాదీ మాట్లాడుతూ‘ వైఎస్ రాష్ట్రంలోని అందరికీ మేలు చేశారు.. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు.. ఆయన్ను మరిచేది లేదు.. జగన్ చేయి విడిచేదీ లేదు’ అన్నారు. ఇంతలో రాజేందర్‌రెడ్డి అనే వ్యక్తి మైకు తీసుకుని ‘బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని అంటున్నారు.. సాధారణ ఎంపీగా ఉన్న వ్యక్తి ప్రభావితం చేస్తారా? కీలక పదవుల్లో ఉన్న హోంమంత్రి, ఇతర మంత్రులు ప్రభావితం చేస్తారా?అని ప్రశ్నించారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థదే!’ అన్నారు.

సీబీఐ పంజరంలో జగన్‌ను చిలుకగా మార్చారని మాలె శ్రీనివాసులరెడ్డి అనే వ్యక్తి మండిపడ్డారు. ఖాజావలి అనే ముస్లిం పెద్ద మాట్లాడుతూ. ‘మేడమ్! ఎవరైనా మాకు గ్లాసు పాలు ఇస్తే! వాళ్లకు కడుపునిండా బిర్యానీ పెట్టాలి’ అని మా పెద్దోళ్లు చెప్పారు., అలాంటిది వైఎస్ కుటుంబాన్ని మరుస్తామా? సమస్యే లేదు? అని అన్నారు. ఈ మాట అనగానే మళ్లీ చప్పట్లు మోగాయి. ముమ్మాటికీ జగన్ అరెస్టు కక్షసాధింపు చర్యేనని పోచంరెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. ఇలా మేధావులు, ఉద్యోగులు, ప్రజలు అందరి మధ్య విశ్లేషణాత్మకంగా చర్చ సాగింది. చివరకు జగన్‌కు బెయిల్ రావాలని అందరూ ఆకాంక్షించారు. జగన్ కుటుంబానికి తుది వరకూ అండగా ఉంటామని తేల్చిచెప్పారు.
Share this article :

0 comments: