వైఎస్ జగన్‌కు మేం అండగా ఉంటాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్‌కు మేం అండగా ఉంటాం

వైఎస్ జగన్‌కు మేం అండగా ఉంటాం

Written By news on Saturday, June 15, 2013 | 6/15/2013


వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఏడాదికాలంగా జైల్లో పెట్టడం అక్రమమని.. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని జిల్లా ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. వైఎస్ జగన్‌ను అణచివేసేందుకే కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు కుట్రపన్ని సీబీఐని వాడుకుంటున్నాయని ధ్వజమెత్తారు. దీంతో సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని మరోసారి రుజువైందని విమర్శించారు. ఓట్లేసి గెలిపించుకున్న తమ నాయకుడిని అక్రమంగా నిర్బంధించారు.. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా జగన్‌కు తమ అండ ఉంటుందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ సీఎం అయి వైఎస్‌ఆర్ సువర్ణపాలన మళ్లీ తెస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. కడప నగరంలోని అపూర్వ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన ‘సాక్షి చైతన్యపథంలో’ పలువురు పై విధంగా స్పందించారు. 
- న్యూస్‌లైన్, కడప కార్పొరేషన్


ఎన్నికల కోసం కాచుకొని ఉన్నాం
ముస్లిం మైనార్టీలకు ఏ ప్రభుత్వాలు న్యాయం చేయలేదు. రాజశేఖర్‌రెడ్డి వచ్చాకే 4శాతం రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేశారు. ఆయన మరణానంతరం వైఎస్ జగన్ తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మృతిచెందిన కుటుంబాలను ఓదార్చడానికి వెళితే అడ్డుకొని కేసులు పెట్టి జైలుపాలు చేశారు. నేడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయంటే అది వైఎస్ చలువే. ఎన్నికలు ఎప్పుడొస్తాయా, ఈ ప్రభుత్వానికి ఎప్పుడు బుద్ధి చెబుతామా అని కాచుకొని ఉన్నాం.
- ఖాజావలీ 


మా గోడు ఎవరికి చెప్పుకోవాలి
మా సమస్యలు పరిష్కరిస్తాడని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాం. కానీ ఈ ప్రభుత్వం ఆయనను ఏడాదికిపైగా జైలులో పెట్టి వేధిస్తోంది. మా గోడు ఎవరికి చెప్పుకోవాలి. ఈ ప్రభుత్వంలో అన్ని రకాల చార్జీలు పెరిగి సామాన్యుని బతుకు దుర్భరమైంది. మా కోసమైనా ఆయనకు బెయిల్ ఇప్పించండి.
- అబ్దుల్ కలాం,స్థానికుడు


ఇదేం న్యాయం
బ్రిటీష్ హయాంలో తెల్లదొరలు వారి పరిపాలనను సవ్యంగా సాగడం కోసం కొన్ని చట్టాలను రూపొందించుకున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా మనదేశంలో అవే చట్టాలు అమలవుతున్నాయి. అందుకే ప్రభుత్వంలో ఉన్నవారు తమ పరిపాలన సవ్యంగా సాగడం కోసం తమను ఎదిరించిన వారిని జైళ్లలో పెడుతున్నారు. భారత శిక్షాస్కృతిని మార్చాల్సిన అవసరముంది. ఏ పదవిలో లేని జగన్‌మోహన్‌రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేస్తారట. బయట ఉన్న మంత్రులకు ప్రభుత్వమే న్యాయ సహాయం చేస్తుందట. ఇదేం న్యాయం?
- రాజేంద్రనాథ్ రెడ్డి, స్థానికుడు


వైఎస్ జగన్ వ్యక్తి కాదు.. వెలుగు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక వ్యక్తి కాదు. ఆయన ప్రజలకు ఒక వెలుగులాంటివారు. చట్ట ప్రకారం ఎవరికైనా 90రోజుల్లో బెయిలివ్వాలి. కానీ ఏడాదికాలంగా జగన్‌కు బెయిల్ ఇవ్వకపోవడం అన్యాయం. ఈ ప్రభుత్వం, అందులోని పెద్దలు రాబోయే తరాలకు ఏవిధమైన మార్గనిర్దేశం చేయదలచుకున్నారో అర్థం కావడంలేదు. వైఎస్ జగన్‌ను ఒక్క అడుగు అణచాలని చూస్తే జిల్లా ప్రజలు ఆయనను వంద అడుగులు పైకి తీసుకొస్తారు.
- గౌరి, స్థానిక మహిళ 


ఈ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది
దేశంలో ప్రజాస్వామ్యం ఉందా, లేదా అని అనుమానం కలిగే విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. సీబీఐ పంజరంలో చిలుక అని సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. ఈ నియంతృత్వ ప్రభుత్వం త్వరలో కూకటివేళ్లతో సహా కూలిపోవడం ఖాయం.
- ఎం.శ్రీనివాసులురెడ్డి 


ప్రజలు బాధపడుతున్నారండీ
మన బిడ్డ జైళ్లో ఉంటే ఎంత బాధ ఉంటుం దో... ప్రస్తుతం జిల్లా వా సులంతా అలానే బాధ పడుతున్నారు. జనాల కో సం ఓ బిడ్డ జైళ్లో... మరో బిడ్డ రోడ్డుపై ఉంది. ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో!
- సయ్యద్ అహ్మద్, ఆడిటర్ 


జగన్ చేసిన తప్పేంటి..
ఆ 26 జీవోలు తప్పని, అందుకే జైగన్‌ను జైళ్లో పెట్టామని సీబీఐ అంటోంది. 2009కి ముందు జగన్ ప్రజాప్రతినిధి కాదు...ఆ 26 జీవోలు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఆయన చేసిన తప్పేంటి?
- రాజేశ్‌కుమార్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు


ముమ్మాటికీ కక్ష సాధింపే
జగన్‌ను అరెస్టు చేయడం ముమ్మాటికి కక్షసాధింపు చర్యే. జగన్‌ను జైల్లో పెట్టడం అన్యాయం. ప్రభుత్వంతో పాటు సీబీఐ తీరుపై కూడా ప్రజల్లో అపనమ్మకం ఏర్పడింది.
- పోచంరెడ్డి సుబ్బారె డ్డి,
ఉపాధ్యాయ ఉద్యమనేత, మాజీ ఎమ్మెల్సీ



ఏడాదిగా నాన్చుతున్నారు..
కంపెనీల్లో పెట్టు బడులు పెట్టినవారు మాకు మోసం జరిగిందని చెప్పలేదు. పోనీ నష్టం వచ్చిందని బదులివ్వలేదు. మరి క్విడ్‌ప్రోకో అని జగన్‌ను ఎలా అరెస్టు చేస్తారు. పైగా ఏడాదిగా దర్యాప్తు అయినా సక్రమంగా చేయడం లేదు. ఏడాదిగా నాన్చుతూనే ఉన్నారు.
- ఇలియాస్ రెడ్డి, ఇంటాక్ కన్వీనర్


ముస్లింలకు ఆయన వల్లే రిజర్వేషన్లు
మహానేత వైఎస్‌ఆర్ వల్లే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు వచ్చాయి. ఆయన్ను మరిచేది లేదు. జగన్ చేయి విడిచేదీ లేదు. జగన్‌ను అక్ర మంగా అరెస్టు చేశారు. సింహం బోనులో ఉన్నా సింహమే.
- ముఫ్తీ మహమ్మద్ అలీ బగ్దాదీ, మతగురువు


జైలులో ఉన్నా.. ముఖ్యమంత్రి కావడం ఖాయం
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజలను తన బిడ్డల్లా చూసుకున్నారు. కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలను అమలుచేసి లబ్ధి చేకూర్చారు. నేడు ఆయన కుటుంబం రోడ్డుపాలైంది. ఇది అన్యాయమని ప్రతి ఒక్కరి మనసుకు తెలుసు. జగన్ జైలులో ఉన్నా ముఖ్యమంత్రి కావడం ఖాయం.
- రకీబ్‌జాన్, గృహిణి 


జిల్లా ప్రజలను అవమానిస్తున్నారు
కడప ప్రజలు అత్యధిక మెజార్టీతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించారు. కానీ ఈ ప్రభుత్వం వారి అభిప్రాయాన్ని, ఆకాంక్షలను తుంగలో తొక్కి వైఎస్ జగన్‌ను ఏడాదిపాటు జైలులో పెట్టింది. తద్వారా జిల్లా ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నారు. ఇప్పటికైనా ఆయనను జైలు నుంచి విడిపించాలి.
- సాదిక్‌బాష, న్యాయవాది


జరిగేదాన్ని ఆపడం ఎవరి తరం కాదు
కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కుమ్మక్కై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైలులో పెట్టాయి. ఆయన బయటికొస్తే సీఎం అవుతారని ఇరుపార్టీలవారు బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలు నుంచి వచ్చినా,రాకపోయినా ఆయనను సీఎం కాకుండా ఆపడం ఎవరి తరం కాదు.
- జ్యోతి, ఎంబీఎ, విద్యార్థిని


ఈ పరిణామాలను చూసి బాధేస్తుంది
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కేసులో ఇరికించడానికి లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఆ తర్వాత 43వేల కోట్లేనని చెప్పారు. ఇప్పుడు 70శాతం దర్యాప్తు పూర్తయిందని, రూ. 1063 కోట్లు అవినీతి జరిగిందని చెబుతున్నారు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదు. న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తూ వైఎస్ జగన్‌ను అక్రమంగా జైలులో ఉంచి ఆయన తల్లి, భార్యాబిడ్డలకేకాక రాష్ట్ర ప్రజలకు దూరం చేశారు.
- రియాజుద్దీన్, స్థానికుడు


ప్రజాదరణను ఓర్వలేకే జగనన్నను అరెస్టు చేశారు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నంత వరకు ఎలాంటి కేసులు గాని, ఆరోపణలు గాని లేవు. ఆయన కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిపార్టీ స్థాపించగానే ఆయనపై కేసులు వేసి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్‌జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ ఓర్వలేకే ఇదంతా చేస్తున్నారు.

- హనీషా, విద్యార్థిని
Share this article :

0 comments: