తెలంగాణ అమరవీరులకు విజయమ్మ నివాళి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణ అమరవీరులకు విజయమ్మ నివాళి

తెలంగాణ అమరవీరులకు విజయమ్మ నివాళి

Written By news on Tuesday, June 25, 2013 | 6/25/2013

జోగిపేట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన సభలో ఆమె ప్రసంగిస్తున్నారు. ప్రసంగానికి ముందు ఆమె తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

అంతకు ముందు ఆమె హైదరాబాద్ నుంచి వస్తూ సింగూరు ప్రాజెక్టు కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు. జోగిపేట చేరుకున్న తరువాత మండల కార్యాలయం ఎదుట వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 


జోగిపేట: దివంగత మహానేత డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. టిడిపి-కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కుమ్మక్కు రాజకీయాలు కలసికట్టుగా 
ఎదుర్కొంటామని చెప్పారు. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని కార్యకర్తలను కోరారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తనతో సహా పార్టీ నేతలు అందరూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. 

వైఎస్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ వెనుకబాటుతనాన్ని వైఎస్ గుర్తించారని చెప్పారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ పెంచినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని చేయలేదన్నారు. నేడు 108 వాహనాలు కనిపించడంలేదని చెప్పారు. రైతుల సమస్యలు పట్టించుకునేవారు లేరన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రావడంలేదని తెలిపారు. 
Share this article :

0 comments: