తిరుపతిలో వైస్ఆర్ సీపీ నిరసన దీక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తిరుపతిలో వైస్ఆర్ సీపీ నిరసన దీక్షలు

తిరుపతిలో వైస్ఆర్ సీపీ నిరసన దీక్షలు

Written By news on Saturday, June 29, 2013 | 6/29/2013

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండు రోజుల క్రితం చేపట్టిన మహాధర్నా కొనసాగుతోంది. వైఎస్ఆర్ సీపీ నేతలు ఈరోజు ఉదయం నుంచి రెండు రోజుల పాటు నిరవధిక దీక్షలకు పూనుకున్నారు.

తిరుపతి ఆర్టీసి బస్టాండ్ సమీపంలో గాంధీ విగ్రహం ఎదుట తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో వందలాది మంది నిరవధిక దీక్షలో పాల్గొన్నారు. తిరుపతిలో మద్యం షాపులకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమానికి మహిళలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటిస్తూ నిరసన దీక్షలకు హాజరయ్యారు.
Share this article :

0 comments: