శంకరరావు, చిరంజీవి, చంద్రబాబులతో నడిపిన వ్యవహారమే అసలైన క్విడ్ ప్రోకో.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » శంకరరావు, చిరంజీవి, చంద్రబాబులతో నడిపిన వ్యవహారమే అసలైన క్విడ్ ప్రోకో..

శంకరరావు, చిరంజీవి, చంద్రబాబులతో నడిపిన వ్యవహారమే అసలైన క్విడ్ ప్రోకో..

Written By news on Tuesday, June 25, 2013 | 6/25/2013

శంకరరావు, చిరంజీవి, చంద్రబాబులతో నడిపిన 
వ్యవహారమే అసలైన క్విడ్ ప్రోకో
వైఎస్ కుటుంబానికి అండగా నిలుస్తామని చైతన్యపథంలో ఆళ్లగడ్డవాసుల భరోసా

ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎవరెన్ని కుట్రలు పన్నినా తిప్పికొడతామని ఆళ్లగడ్డ వాసులు ఘంటాపథంగా చెప్పారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణను జీర్ణించుకోలేని కాంగ్రెస్, టీడీపీలు సాగిస్తున్న కుతంత్రాలను, అందుకు వంతపాడుతున్న సీబీఐ తీరును వారు దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్ మరణానంతరం రాష్ట్రంలో నిర్వహించిన పలు ఉప ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చినా ఆ రెండు పార్టీల వైఖరిలో మార్పు రాలేదనే అభిప్రాయం వ్యక్తంచేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో సోమవారం ‘సాక్షి’ చైతన్య పథం సదస్సు నిర్వహించారు. 

కిశోర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో న్యాయవాది రమాదేవి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ఎలాంటి కేసులో అయినా 90 రోజుల్లో బెయిల్ పొందే అవకాశం ఉందని, అయితే తమ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్, టీడీపీలు అడుగడుగునా జగన్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. చార్జిషీట్ ఫైల్ చేసే విషయంలో కోర్టులు పలు సూచనలు చేసినప్పటికీ సీబీఐ పెడచెవిన పెడుతోందన్నారు. వ్యక్తిగత కక్షతో కేసును తప్పుదోవ పట్టించేందుకే కోర్టులకు తప్పుడు సమాచారం ఇస్తూ బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. దంత వైద్యుడు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ జగన్‌ను వేధిస్తున్న సీబీఐని చంద్రబాబు, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీసీబీఐ)గా అభివర్ణించారు. కేసువేసిన శంకరరావు, తాను స్థాపించిన ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి, ఐఎంజీ వ్యవహారంలో కాంగ్రెస్‌తో రాజీపడిన చంద్రబాబు విషయంలోనే అసలైన క్విడ్ ప్రోకో జరిగిందన్నారు. వారిలో ఇద్దరు మంత్రి పదవులు పొందారన్నారు. చంద్ర బాబు ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కేంద్ర మంత్రి చిదంబరంతో చీకటి ఒప్పందం కుదుర్చుకుని తనపై సీబీఐ విచారణ జరగకుండా జాగ్రత్తపడటం క్విడ్ ప్రోకో కాదా అని ఆయన ప్రశ్నించారు. పారిశ్రామికవేత్త టీఎంసీ వేణుగోపాల్ మాట్లాడుతూ వైఎస్ మరణానంతరం పారిశ్రామికవేత్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. సదస్సులో బీసీ సంఘం నేత రామకృష్ణ, ఉపాధ్యాయుడు అలీఅక్బర్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ వరప్రసాదరావు తదితరులు ప్రసంగించారు.
Share this article :

0 comments: