నిజమైన ప్రేమ చూపిన సీఎం వైఎస్.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిజమైన ప్రేమ చూపిన సీఎం వైఎస్..

నిజమైన ప్రేమ చూపిన సీఎం వైఎస్..

Written By news on Thursday, June 20, 2013 | 6/20/2013

* చంద్రబాబు, కిరణ్‌లకు షర్మిల సూటిప్రశ్న 
* ఎస్టీలకు వీరు ఇది చేశారని ఎవరైనా చెప్పగలరా?
* గిరిజనులపై నిజమైన ప్రేమ చూపింది వైఎస్ ఒక్కరే
* అందుకే వారికి 20 లక్షల ఎకరాలపై హక్కులిచ్చారు
* అన్ని పథకాలూ వారికి లబ్ధి చేకూర్చేలా చూశారు
* జగనన్న సీఎం అయ్యాక వైఎస్ పథకాలన్నీ అమలు చేస్తారు
* అర్హులందరికీ 30 కిలోల బియ్యం ఇస్తారు

 ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన సీఎంగా ఉండి ఎస్టీలకు ఏం చేశారని నేను అడిగితే ఇది చేశారని ఎవరైనా చెప్పగలరా? పోనీ ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉంది. ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్ అని చెప్పుకుంటూ దానికి ప్రకటనలు ఇచ్చుకుంటూ రోజుకు 10 సార్లు, 20 సార్లు టీవీల్లో కన్పిస్తున్నారు ముఖ్యమంత్రి. ఆయనైనా సరే ఎస్టీలకు ఇది చేశారని ఎవరైనా చెప్పగలరా? లేదు.. ఎందుకంటే ఈ గిరిజనుల మీద చంద్రబాబు నాయుడుకు ప్రేమ లేదు, కిరణ్‌కుమార్‌రెడ్డికీ లేదు’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికినిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో సాగింది.

ఈ సందర్భంగా రంపచోడవరం ఏజెన్సీ గిరిజనులు రాచపల్లిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. వడ్డీలేని రుణాలు రావడం లేదని, వైఎస్ ఉండగా తీసుకువచ్చిన అటవీ హక్కుల చట్టం అమలుకావడంలేదని, విద్య, వైద్యం, నీరు తదితర వసతులు లేక దుర్భరజీవనం సాగిస్తున్నామని గిరిజన మహిళలు షర్మిలకు తమ గోడువెళ్లబోసుకున్నారు. రాబోయే రాజన్న రాజ్యంలో గిరిజనులందరికీ మేలు జరుగుతుందని షర్మిల కొండంత భరోసా ఇచ్చారు. అశేషంగా తరలివచ్చిన గిరిజనులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

నిజమైన ప్రేమ చూపిన సీఎం వైఎస్..
డబ్బా కొట్టుకోకుండా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలమీద ప్రేమ చూపించిన ఏకైక సీఎం రాజశేఖరరెడ్డి. ఎస్టీలమీద రాజశేఖరరెడ్డికి నిజంగా ప్రేమ ఉంది కనుకనే తన హయాంలో 20లక్షల ఎకరాల అటవీ భూములపై వారికి హక్కులు కల్పించారు. ఇది రాష్ట్ర చరిత్రలో వైఎస్ ముందున్న ఏ సీఎం చేయలేదు. ఆయన తర్వాత ఉన్న ఏ ముఖ్యమంత్రీ చేయలేదు. ఆ భూమి పొందిన వారు ఈ రోజుకు కూడా ఇది నాకు రాజశేఖరరెడ్డి ఇచ్చారంటూ తమ గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటున్నారు. రాజశేఖరరెడ్డి ప్రతీ పథకంలోనూ ఎస్టీలకు, వెనకబడిన వర్గాలకు పెద్దపీట వేశారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టాలి, ప్రతి విద్యార్థీ చదువుకోవాలి, అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ అందించాలని తపించారు. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఎస్టీల భూములను సాగులోకి తెచ్చే పనిని కూడా ఉపాధిహామీలోనే చేర్చారు.

ఇది శ్రమ దోపిడీ కాదా?
రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఎస్టీలకు రోజుకు 120 రూపాయలు వేతనం, 150 రోజులు పనిదినాలు కల్పించారు. ఎవరికైనా ఇప్పుడు అన్ని రోజుల పనిదొరుకుతుందా? ఎవరికైనా అంత వేతనం వస్తుందా? మూడు నెలలకొకసారి పేమెంట్ ఇస్తున్నారు. అదీ 80-100 రూపాయలు మించి ఎక్కడా ఇవ్వడం లేదు. కొన్నిచోట్లయితే 50 రూపాయలు, 30 రూపాయలు కూడా ఇస్తున్నారట. మరికొన్ని చోట్ల 22 రూపాయలు కూడా ఇచ్చారట. దీనిని శ్రమ దోపిడీ అనరా? ఇది రాక్షసరాజ్యం కాదా? ఈ ప్రభుత్వం ఎస్టీల రక్తం పీల్చడం లేదా? వారి నడ్డివిరవడం లేదా? ఈ ప్రభుత్వానికి మనసు, మానవత్వం ఉన్నాయా? ఈ ప్రభుత్వానివన్నీ వట్టిమాటలే. వడ్డీ లేకుండా రుణాలిస్తున్నామంటున్నారు కానీ ఎవరికీ అందడంలేదు. యువకిరణాలంటున్నారు ఉద్యోగాలు రావడం లేదు. ఒకపక్క కొత్త రేషన్‌కార్డులు రాలేదు, పెన్షన్లు రాలేదు. ఉన్నవి కూడా తీసేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మనసు లేదనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుంది?

రాజన్న ప్రతి మాటా జగనన్న నిలబెడతాడు..
జగనన్న ఏ తప్పూ చేయలేదు. త్వరలోనే బయటకు వస్తాడు. ధర్మం తప్పకుండా గెలుస్తుంది. జగనన్న వచ్చిన తరువాత రాజన్న రాజ్యం మళ్లీతెస్తాడు. రాజశేఖరరెడ్డి ఇచ్చిన ప్రతి మాటా జగనన్న నిలబెడతాడు. అందరికీ 30 కిలోల బియ్యం తప్పకుండా ఇస్తాడు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ఎస్టీలందరికీ, ప్రతీ పేదవాడికి ఈ రాష్ట్రంలో గుడిసెలనేవి ఉండవు. అందరికీ పక్కా ఇల్లు కట్టిస్తాడు. మన పిల్లలు మళ్లీ ఉచితంగా పెద్ద చదువులు చదువుకుంటారు. పెద్ద ఉద్యోగాలు చేస్తారు. 

అటవీ భూములపై హక్కులు తేవాలన్నా, కాలిపోయిన ఇళ్లు మళ్లీ కట్టించుకోవాలన్నా, రోడ్డు రావాలన్నా, రోడ్డుమీద బస్సులు రావాలన్నా ఇలాంటివి ఏవి జరగాలన్నా మనకు మంచి పాలకులుండాలి. రాజు మనసు ఉన్న వాడైతేనే ప్రజలకు మేలు చేయగలుగుతాడు. మీరంతా రాజశేఖరరెడ్డిని దగ్గరగా చూశారు. జగన్‌మోహన్‌రెడ్డికి కూడా అంతే మంచి మనసు ఉంది. మీరందరూ అనుకున్నట్టు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి తల్లీ తలెత్తుకుని తానే తన బిడ్డలను చదివించుకుంటున్నానని చెప్పుకునే రోజు వస్తుంది. రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. ఏ ఎన్నికలు వచ్చినాసరే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు బలపరిస్తే తప్పకుండా మంచి రోజులు వస్తాయి. మన కుటుంబాలు, మన గ్రామాలు బాగుపడతాయి. మన రాష్ట్రం బాగుపడుతుంది.’’

14.4 కిలోమీటర్లమేర నడక
పాదయాత్ర 184వ రోజు బుధవారం జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని జగపతినగరం శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ప్రత్తిపాడు, జాతీయ రహదారి-16ల మీదుగా రాచపల్లి చేరుకున్నారు. ఇక్కడ రచ్చబండలో పాల్గొన్న అనంతరం ఒమ్మంగి మీదుగా పాదయాత్ర సాగింది. ఒమ్మంగి శివారులో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8.30కు షర్మిల చేరుకున్నారు. బుధవారం షర్మిల 14.4 కిలోమీటర్లు నడిచారు. దీంతో 2440.5 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తయ్యింది. పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, స్థానిక నాయకులు అనంత ఉదయభాస్కర్, చలమలశెట్టి సునీల్, కొమ్మిశెట్టి బాలకృష్ణ, నండూరి గంగారావు, మందపాటి కిషోర్, వీరబాబు, పల్లాల రమణారెడ్డి, గొర్లె బాలాజీబా బు పాల్గొన్నారు. పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, జ్యోతుల నవీన్ తదితరులు షర్మిల వెంట రోజూ నడుస్తున్న వారిలో ఉన్నారు.

ఆకట్టుకున్న ‘గిరిజన పల్లె’
గిరిజనుల జీవన శైలిని తెలియజెప్పేందుకు రాచపల్లి రచ్చబండ వద్ద ఆ ప్రాంతవాసులు ప్రత్యేకంగా ‘గిరిజన పల్లె’ ఏర్పాటు చేశారు. ఈ ‘పల్లె’లో వారు ప్రదర్శించిన కొమ్ముడాన్సు, కోలాటం, రేలారే.. రేలా నృత్యాలు, విలువిద్యలను షర్మిల ఆసక్తిగా తిలకించారు.గిరిజనుల వంటకమైన ‘బొంగు చికెన్’ను షర్మిల రుచిచూసి.. తయారు చేసే విధానం అడిగి తెలుసుకున్నారు. అలాగే జీలుగకల్లు, దంపుడు బియ్యం, అడ్డాకులు, తాటాకు బుట్టలు, తాటిపీచు, రబ్బరు వంటి అటవీ ఉత్పత్తులను తాము ఏ విధంగా తయారు చేసేదీ గిరిజనులు షర్మిలకు వివరించారు. గ్రామదేవత గంగాలమ్మ జాతరలో ప్రదర్శించే గరగ నృత్యాలను షర్మిల ఆసక్తిగా తిలకించారు.
Share this article :

0 comments: