'వైఎస్ నాకు గుర్తింపునిచ్చి.. మంత్రిని చేశారు' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'వైఎస్ నాకు గుర్తింపునిచ్చి.. మంత్రిని చేశారు'

'వైఎస్ నాకు గుర్తింపునిచ్చి.. మంత్రిని చేశారు'

Written By news on Wednesday, June 12, 2013 | 6/12/2013

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో శ్రీశైలం సొరంగం నిర్మాణం పనులకు పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేశారని మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా కనగల్ మండలం తుర్కపల్లిలో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను మంగళవారం ఆయన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలసి ప్రారంభిం చారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ విడుదల చేసిన నిధులతో ఇప్పటికి సగం పనులు జరిగాయన్నారు. 

ఆయనే ఉంటే సొరంగం పనులు పూర్తవడమే గాక, జిల్లా సస్యశ్యామలమయ్యేదన్నారు. పలు ప్రారంభ కార్యక్రమా ల్లో, అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశాల్లో కోమటిరెడ్డి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావించినప్పుడల్లా ప్రజలు, కార్యకర్తలు ఈలలు, చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేసి, వైఎస్ అమర్ రహే అంటూ నినదించారు. ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ, వచ్చే రెండు నెలల్లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని తనకు సంకేతాలు ఉన్నాయన్నారు. అనంతరం స్థానికంగా నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి ప్రసంగిస్తూ, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు గురువులాంటి వారని శ్లాఘించారు. పార్టీలో ఎందరు పెద్దలున్నా కాదని, తనకు మంత్రి పదవితోపాటు ఎంతో గుర్తింపు నిచ్చారని కొనియాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే సీట్లు దక్కుతాయన్నారు. పంచాయతీ ఎన్నికలు ఆషామాషీవి కాదని, ప్రభుత్వ నిర్మాణానికి అవి మొదటిమెట్టని కోమటిరెడ్డి పేర్కొన్నారు. 
Share this article :

0 comments: