చంద్రబాబు వ్యాపారాలు చేయొచ్చు.. జగన్ చేయకూడదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు వ్యాపారాలు చేయొచ్చు.. జగన్ చేయకూడదా?

చంద్రబాబు వ్యాపారాలు చేయొచ్చు.. జగన్ చేయకూడదా?

Written By news on Friday, June 14, 2013 | 6/14/2013

జననేతకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? 
‘సాక్షి’ చైతన్య పథంలో వక్తలు 

హిందూపురం, న్యూస్‌లైన్ : ‘రెండెకరాల ఆసామి అయిన చంద్రబాబు నేడు కోట్లాది రూపాయలు సంపాదించారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తే.. వ్యాపారాలు చేసి సంపాదించానని చెబుతున్నారు. అదే జన్మతః కోటీశ్వరుడైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాపారాలు చేసి డబ్బు సంపాదిస్తే మాత్రం అవినీతి అంటున్నారు. ఇదెక్కడి న్యాయం?.. కాంగ్రెస్ అధిష్టానం కేవ లం కక్ష సాధింపుతోనే జగన్‌ను జైల్లో పెట్టించింది. సీబీఐని తన చెప్పుచేతల్లో పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తోంది. ఇన్ని కుయుక్తులు గతంలో ఎన్నడూ చూడలేద’ని వక్తలు మండిపడ్డారు.గురువారం అనంతపురం జిల్లా హిందూపురంలో ‘సాక్షి చైతన్య పథం’ సదస్సు నిర్వహించారు. న్యాయవాది రిజ్వాన్‌ఖాన్ మాట్లాడుతూ, దేశంలో అతి పెద్దనేరాల్లో కూడా ఎఫ్‌ఐఆర్ నమోదైన మూడునెలలకే నిందితులకు బెయిల్ వస్తోందన్నారు. జగన్ విషయంలో ఇది వర్తించకుండా సీబీఐ నాటకాలు ఆడుతోందన్నారు.

మహానేత మరణంతో విషాదంలో ఉన్న కుటుంబానికి జగన్‌ను కూడా దూరం చేసి కాంగ్రెస్ అధిష్టానం, సీఎం కిరణ్, చంద్రబాబు, ఎల్లో మీడియా నిర్వాహకులు రాక్షసానందం పొందుతున్నారని దుయ్యబట్టారు. వ్యక్తిగత, భావ స్వేచ్ఛలను హరి స్తున్న వీరంతా రేపొద్దున ప్రాణహాని తలపెట్టరని నమ్మకమేమిటని ప్రశ్నించారు. మరోన్యాయవాది గంగాధరప్ప మాట్లాడుతూ, చంద్రబాబు, ఆయన బినామీలపై విచారణ చేయాలని వైఎస్ విజయమ్మ కోర్టుకు లేఖ రాస్తే కనీసం స్పందించని సీబీఐ.. జగన్ విషయంలో మాత్రం 24 గంటలూ పనిచేస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, కేంద్ర మంత్రి చిరంజీవి కుమార్తె ఇంట్లో దొరికిన రూ.35 కోట్ల బ్లాక్‌మనీ విషయాన్ని ఎందుకు తొక్కిపెట్టారో కాంగ్రెస్, సీబీఐ ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. అభియోగాలు మాత్రమే ఎదుర్కొంటున్న జగన్‌ను ఏడాదికి పైగా రిమాండ్‌లో ఉంచడం తీవ్రమైన అంశమని ప్రైవేట్ ఉపాధ్యాయుడు నారాయణస్వామి అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అశ్వర్థరెడ్డి రైతు రామకృష్ణ తదితరులు ప్రసంగించారు. 
Share this article :

0 comments: