జీవోలు సక్రమమైతే జగన్‌పై కేసులు ఎందుకు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జీవోలు సక్రమమైతే జగన్‌పై కేసులు ఎందుకు?

జీవోలు సక్రమమైతే జగన్‌పై కేసులు ఎందుకు?

Written By news on Friday, June 21, 2013 | 6/21/2013

జీవోలు సక్రమమైతే జగన్‌పై కేసులు ఎందుకు? 
మోపిదేవికో న్యాయం.. ఇతర మంత్రులకో న్యాయమా? 
సాక్షి చైతన్యపథంలో వక్తలు 

రాయచోటి, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న తీరుతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం ఉదయం వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటిలో సాక్షి చైతన్యపథం సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్యుడు బయారెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్ హయాంలో జారీచేసిన జీవోలు సక్రమమే అని ప్రభుత్వమే ప్రకటిస్తున్నప్పుడు జగన్‌ను జైలులో పెట్టడమెందుకని ప్రశ్నించారు. న్యాయవాది పవన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కేసు తీవ్రతను బట్టి 6 లేదా 9 నెలల లోపు బెయిల్ యివ్వాల్సి ఉన్నప్పటికీ జగన్ కేసు విషయంలో ఆ విధంగా జరగడం లేదన్నారు. జీవోల విడుదల కేసులో మంత్రి మోపిదేవి వెంకటరమణను జైలుకు పంపినా, అదే కేసులో సబిత, ధర్మానతో పాటు మరికొందరు మంత్రులను అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. బీసీ ఐక్యకులాల వేదిక జిల్లా కార్యదర్శి యానాదయ్య మాట్లాడుతూ పాలకులు అడ్డదారులు తొక్కుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత సీబీఐ అస్త్రంతో వెంటాడి మరీ వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. 

ఇటీవల వెలుగుచూసిన పలు కుంభకోణాల్లో ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రుల పాత్ర ఉన్నట్లు బయటపడినా నైతికత లేకుండా అప్రజాస్వామికంగా వారు పదవుల్లో కొనసాగడం ఏమాత్రం సబబని ప్రశ్నించారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి పలు అక్రమాలు, కుంభకోణాలకు ఆజ్యం పోసిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. వాన్‌పిక్ తదితర సెజ్‌లకు భూ కేటాయింపు బాబు హయాంలోనే మొదలైందన్నారు. మైనార్టీ నేత బషీర్ అహమ్మద్ మాట్లాడుతూ జీవోలు సక్రమమైనవే అయినప్పుడు సీఎం కిరణ్ ఇంతకాలం మౌనంగా ఉండటం వెనుక పరమార్థమేమిటని ప్రశ్నించారు. డ్వాక్రా మహిళ శంకరమ్మ మాట్లాడుతూ జగన్ ఏం తప్పు చేశాడని జైలులో పెట్టారని ప్రశ్నించారు. కేసును ఎటూ తేల్చకుండా జగన్‌ను నెలల తరబడి జైలులో పెట్టడం ఎంతవరకు సమంజసమంటూ ఆమె మండిపడ్డారు. ఈ సదస్సుకు స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 
Share this article :

0 comments: