జగనన్న వస్తే..నిరుద్యోగమే ఉండదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనన్న వస్తే..నిరుద్యోగమే ఉండదు

జగనన్న వస్తే..నిరుద్యోగమే ఉండదు

Written By news on Wednesday, June 12, 2013 | 6/12/2013

చంద్రబాబు అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తానంటున్నారు
అధికారం కోసం ఆయన చంద్రుడినీ తెస్తానంటారు.. అందుకే ఆయనకు విశ్వసనీయత లేదు
జగనన్న వస్తే.. నిరుద్యోగమే ఉండదు.. భృతి ప్రశ్నే ఉత్పన్నం కాదు
ఇక రాజీవ్ యువకిరణాలపై కాంగ్రెస్ పార్టీ వారికే నమ్మకం లేదు
లక్షల ఉద్యోగాలిస్తానన్న సీఎం.. వాటిలో ఎన్ని ఇచ్చారు? 
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 176, కిలోమీటర్లు: 2,334

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోసం చాలా చెబుతున్నారు. తన పేరులో చంద్రుడున్నాడు కాబట్టి ఆ చంద్రుడిని కూడా తీసుకువస్తానని చెపుతారాయన. అందువల్లే ఆయన మాటలకు విశ్వసనీయత లేదు. చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే.. నిరుద్యోగ భృతి ఇస్తానని అన్నారు. అదే జగనన్న అధికారంలోకి వస్తే.. అసలు నిరుద్యోగ సమస్యే ఉండదు. అప్పుడు నిరుద్యోగ భృతి ప్రశ్నే ఉత్పన్నం కాదు’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నారు. 

చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఉద్యోగం వచ్చేలా చేయాలని జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్ రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం, అనపర్తి నియోజకవర్గాల్లో సాగింది. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో షర్మిలతో విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు షర్మిల సమాధానమివ్వడమే కాకుండా, వారికి భవిష్యత్‌పై భరోసా కల్పించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.

కక్షతోనే ట్రిపుల్ ఐటీలపై ప్రభుత్వం శీతకన్ను

ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నకు షర్మిల సమాధానమిస్తూ.. ‘‘ఇప్పుడు పాలించే వారికి మనసు లేదు. రాజశేఖర రెడ్డికి పెద్ద మనసు ఉంది కనుక ఫీజు రీయింబర్స్‌మెంట్ అనే పథకంతో ఎంతో మంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. అంతేకాకుండా గ్రామీణ విద్యార్థులకు కూడా పట్టణ విద్యార్థుల్లా సమాన అవకాశాలు కల్పించడం కోసం ట్రిపుల్ ఐటీలు పెట్టారు. రాజశేఖరరెడ్డి గొప్ప దార్శనికుడు. ఇప్పటి పాలకులకు ఆ మనసు లేదు. అందుకనే దానిని నిర్వీర్యం చేస్తున్నారు. వాళ్లకి మా కుటుంబం మీద ఉన్న కక్ష కావచ్చు. ప్రజల మీద ఉన్న కక్ష కావచ్చు, మనసు లేకపోవడం కారణం కావచ్చు. ఏదేమైనా ఈ ట్రిపుల్ ఐటీలను ఫెయిల్యూర్ చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. అదృష్టమేమిటంటే ఇంకో ఆరు నెలల్లోనో, సంవత్సరంలోనో ఎన్నికలు వస్తాయి. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. మళ్లీ ట్రిపుల్ ఐటీలు నిలబడతాయి’’ అని భరోసా ఇచ్చారు. విద్యార్థి సంఘాలపై చంద్రబాబు వ్యాఖ్యలను ఓ విద్యార్థి ప్రస్తావించగా.. ‘‘విద్యార్థి సంఘాలు అసాంఘిక సంఘా లు అని అన్నారట బాబు. ఇలాంటి మాటలు ఆయన ఎన్నో అన్నాడులే. విద్యార్థి సంఘాలు తప్పకుండా ఉండాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాటికి వ్యతిరేకం కాదు. అలాంటి సంఘాలను, సంఘాల నాయకులను మేం తప్పకుండా ప్రోత్సహిస్తాం’’ అని చెప్పారు.

సీఎంను కాలర్ పట్టుకుని అడగండి

తమిళనాడులో బీఈడీ వాళ్లకి ఎస్‌జీటీ అవకాశాలు కల్పిస్తున్నారని, మన రాష్ట్రంలో ఎందుకు కల్పించడం లేదని పలువురు విద్యార్థులు ప్రశ్నించగా.. ఈ ప్రశ్న విద్యార్థులు నేరుగా సీఎంను కాలర్ పట్టుకుని అడిగితేగానీ ఆయనకు తెలిసి రాదని షర్మిల అన్నారు. ‘‘విద్యార్థులకు చదువులు ఎంత ముఖ్యమో, చదివిన వారికి ఉద్యోగాలు కల్పించడం అంతే ముఖ్యం. మళ్లీ రాబోయే రాజన్న రాజ్యంలో అందరికీ ప్లేస్‌మెంట్స్ వస్తాయి. జగనన్న ఈ విషయంలో కృతనిశ్చయంతో ఉన్నాడు. మీరు ఆందోళన చెందొద్దు’’ అని భరోసా ఇచ్చారు.

లక్షల ఉద్యోగాలెక్కడ?

‘‘ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పదవిలోకి వచ్చిన కొత్తలో లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని మాటిచ్చారు. ఇప్పటిదాకా ఎన్ని కల్పించారు? ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు కూడా తెస్తానని చెప్పారు. దాంట్లో పది శాతం కూడా తేలేదు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటతాయి. కానీ చేతలు గడపలు దాటవు’’ అని షర్మిల విమర్శించారు. ‘‘రాజీవ్ యువకిరణాలు అనే పథకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత.. దాన్ని ప్రారంభించడానికని ఈయన ప్రధానమంత్రిని పిలిచారు. ప్రధాని కార్యాలయం ఈ పథకం గురించి వాకబు చేసిన తర్వాత ఇది ఆచరణ సాధ్యంగా కనిపించడంలేదని తెలిసి.. ప్రారంభోత్సవానికి ప్రధాని తాను రానని చెప్పారు. రాజీవ్ యువకిరణాలు అనే పథకంపై వాళ్ల పార్టీవారికే నమ్మకం లేకపోతే దానికి ఏం విశ్వసనీయత ఉంది?’’ అని ఆమె ప్రశ్నించారు. ‘‘ఈబీసీ విద్యార్థులకు వైఎస్ ఉండగా ఇచ్చిన మెయింటెనెన్స్ చార్జీలను కిరణ్ సర్కార్ ఎత్తేసింది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత వారికి మెయింటనెన్స్ చార్జీలు ఇస్తామని భరోసా ఇస్తున్నా’’ అని షర్మిల హామీ ఇచ్చారు.


కుక్కలు మొరుగుతాయి..

‘మీరు ప్రజల కోసం పాదయాత్ర చేస్తుంటే ఒక వర్గం మీడియా మీకు వ్యతిరేకంగా రాస్తున్న తీరు చూస్తుంటే మాకు చాలా బాధేస్తోంది’ అని ఓ విద్యార్థి చెప్పగా షర్మిల స్పందిస్తూ.. ‘‘నీ అభిమానానికి చాలా కృతజ్ఞతలమ్మా. కుక్కలు మొరుగుతాయి.. వాటిని పట్టించుకోకూడదు’’ అని అన్నారు. కుటుంబాన్ని వదిలి పెట్టి రోజూ ఇన్నేసి కిలోమీటర్లు నడవడం మీకు కష్టంగా లేదా అని ఓ విద్యార్థి ప్రశ్నించగా..‘‘నాకు పాదయాత్ర చేయడం ఏమాత్రం బాధగా లేదమ్మా. జగనన్నను జైల్లో అక్రమంగా నిర్బంధించారు. అన్న పడుతున్న కష్టంతో పోల్చుకుంటే నేను పడుతున్న కష్టం లెక్కేమీకాదు’’ అని అన్నారు.

14.5 కిలోమీటర్ల మేర నడక

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 176వ రోజు మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మెయిన్‌రోడ్డులోని సూర్యా కాంప్లెక్స్ నుంచి ఉదయం 9.15 గంటలకు ప్రారంభమైంది. అక్కడి నుంచి రామచంద్రపురం పట్టణ పురవీధులు మీదుగా బైపాస్‌కు చేరుకొని చోడవరం, అగ్రహారం, నరసాపురపుపేట, మెల్లూరు క్రాస్ రోడ్, వేండ్ర క్రాస్ రోడ్, చింతలపల్లిలాకు, గండ్రేడులంకల మీదుగా పాదయాత్ర గొల్లలమామిడాడకు చేరుకుంది. ఇక్కడ విద్యార్థులతో ముఖాముఖి అనంతరం షర్మిల రాత్రి 8 గంటలకు బసకు చేరుకున్నారు. మంగళవారం ఆమె 14.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు 2,334 కిలో మీటర్ల యాత్ర పూర్తయ్యింది. 

పాదయాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, తాజీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ మహిళా నాయకులు వాసిరెడ్డి పద్మ, కొల్లి నిర్మలాకుమారి, స్థానిక నాయకులు బొడ్డు వెంకటరమణచౌదరి, చలమలశెట్టి సునీల్, సత్తి సూర్యనారాయణ రెడ్డి, బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, విప్పర్తి వేణుగోపాల్, చింతా కృష్ణమూర్తి, కర్రి పాపారాయుడు, జక్కంపూడి రాజా, పి.కె.రావు, జ్యోతుల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: