వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంటే న్యాయస్థానాలు కల్పించుకోవాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంటే న్యాయస్థానాలు కల్పించుకోవాలి

వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంటే న్యాయస్థానాలు కల్పించుకోవాలి

Written By news on Tuesday, June 18, 2013 | 6/18/2013

జైలులో కాదు మా గుండెల్లో ఉన్నాడు
వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంటే న్యాయస్థానాలు కల్పించుకోవాలి
సాక్షి చైతన్యపథంలో పలువురి మనోగతం 


జగన్ జైళ్లో కాదు.. మా గుండెల్లో ఉన్నాడు.. ఆస్థానం ఎప్పటికీ చెరిగిపోదు.. ఎవరెన్ని కుట్రలు పన్నినా కడిగిన ముత్యంలా జగన్ బయటకు వస్తాడు.. ప్రొద్దుటూరులో సోమవారం నిర్వహించిన ‘సాక్షి చైతన్యపథం’లో సీబీఐ తీరును ఎండగడుతూ విద్యార్థులు, మహిళలు అన్నమాటలు ఇవి. 

ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ప్రజల్లో వైఎస్ కుటుంబానికి ఉన్న ఆదరణ చూసి టీడీపీ, కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది..అందుకే కుట్రపూరితంగా పార్లమెంటు సభ్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏడాదిగా జైల్లో ఉంచారు.. సీబీఐని కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తోంది.. ప్రజల గుండెల్లో రాజశేఖరుడికి, ఆయన కుటుంబ సభ్యులకు ఎప్పుడూ స్థానం ఉంటుంది.. సాక్షి చైతన్యపథం కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు పట్టణం పద్మశాలీయ కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన సందర్భంలో ప్రజాసంఘాలు, న్యాయవాదులు, వైద్యులు, విద్యార్థులు, మిహ ళలు అన్న మాటలు ఇవి. 

హైకోర్టు, సుప్రీంకోర్టు సీబీఐపై కొరడా ఝులిపించింది.. కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్న సీబీఐని ప్రక్షాళన చేయాలంటూ మండి పడింది.. జగన్‌ను ఏడాదిగా జైలులో పెట్టడం ఏవిధమైన న్యాయమని న్యాయవాది జింకా విజయలక్ష్మి ప్రశ్నించారు. సీఆర్‌పీఎస్ 56 సెక్షన్ ప్రకారం 90 రోజుల్లోపు ఎవరికైనా బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది.. జగన్ బయటికి వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చార్జిషీట్లపేరుతో బెయిల్ రాకుండా జైలులోనే ఉంచుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సుబ్బిరెడ్డి మాట్లాడుతూ ఎంపీ వైఎస్ జగన్ కేసులో రాజకీయ అంశాలే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి లేదన్నారు.

కేంద్ర హోంశాఖ పరిధిలో సీబీఐ నడుస్తోందన్నారు. ఏడాదిగా విచారణ చేస్తున్న సీబీఐ ఇప్పటి వరకు ఏ ఒక్క అంశంలో కూడా జగన్ అవినీతికి పాల్పడ్డారన్న విషయాన్ని నిరూపించలేకపోయిందన్నారు. ప్రొద్దుటూరు ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రాజారామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కొనలేక వ్యక్తులను వేధించడం ఏవిధంగా సబబో కాంగ్రెస్ ప్రభుత్వం, సీబీఐ చెప్పాలన్నారు. వైఎస్ మరణంపై ఉన్న అనుమానాలను ప్రశ్నించినందుకే జగన్‌ను వేధిస్తున్నారన్నారు. కూరగాయల మార్కెట్ అసోసియేషన్ కార్యదర్శి దాదాపీర్ మాట్లాడుతూ ప్రజల కష్టాలు తీర్చే నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని, అందుకే ఆయనను అత్యంత మెజారిటీతో గెలిపించామన్నారు. అలాంటి నాయకుడిని ఏడాదిగా జైలులో ఉంచితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 

జగన్ విడుదల అయ్యేంత వరకు తమ అసోషియేషన్ సభ్యులంతా నల్ల బ్యాడ్జీలు ధరిస్తునే ఉంటారన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలంటే అసహ్యం పుట్టేలా అధికార, ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయన్నారు. ఒక పార్టీకి అధ్యక్షుడు, ఎంపీని సంవత్సరం పాటు ఎలాంటి నిర్ధారణ లేకుండా జైలులో పెట్టడం దారుణమైన విషయమన్నారు. రాజ్యాంగంపై నమ్మకం కోల్పోతున్నామని, సీబీఐ కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడిటర్ మధుసూదన్ మాట్లాడుతూ ఒక్క జగన్ కేసు విషయంలో వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. ప్రజాదరణ కలిగిన నాయకుడిని జైలులో పెట్టడం దారుణమన్నారు. కుట్రపూరితంగానే జగన్ జైలు నుంచి బయటికి రాకుండా చార్జిషీట్లు వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సాక్షి టీవీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ స్వప్న వ్యవహరించారు.
Share this article :

0 comments: