ఇష్టం లేకుంటే 'బ్రాహ్మణీ'కి రాహుల్ లేదా రాజీవ్ పేరు పెట్టండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇష్టం లేకుంటే 'బ్రాహ్మణీ'కి రాహుల్ లేదా రాజీవ్ పేరు పెట్టండి

ఇష్టం లేకుంటే 'బ్రాహ్మణీ'కి రాహుల్ లేదా రాజీవ్ పేరు పెట్టండి

Written By news on Tuesday, June 11, 2013 | 6/11/2013

బ్రాహ్మణీ స్టీల్స్ పనులు తక్షణం ప్రారంభించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి,అమర్ నాథ్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రాహ్మణీ స్టీల్స్ కు ఇప్పటి వరకు ప్రభుత్వం దాదాపు రూ.1300 కోట్లు వెచ్చించిందని తెలిపారు. ఆ పరిశ్రమ ఏర్పాటుతో వెనకబడిన రాయలసీమ అభివృద్ధి చెందుతుందని దివంగత ముఖ్యమంత్రి,మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచించారన్నారు. అంతేకాకుండా దాదాపు లక్ష మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. బ్రాహ్మణీ స్టీల్స్ పేరు కొనసాగించేందుకు ఇష్టం లేకుంటే రాజీవ్ లేదా రాహుల్ పేరుతో ప్రాజెక్ట్ ను తిరిగి ప్రారంభించాలని ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, శ్రీకాంత్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి కాంగ్రెస్ సర్కారుకు సూచించారు. 
Share this article :

0 comments: