నిజాలు దాచి.. వైఎస్‌పై శివాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిజాలు దాచి.. వైఎస్‌పై శివాలు

నిజాలు దాచి.. వైఎస్‌పై శివాలు

Written By news on Friday, June 28, 2013 | 6/28/2013

 పది రోజుల్లో పారిశ్రామిక సిటీ కోసమూ దాంతోనే ఎంఓయూ
- 1997లో పోర్టు కోసం కన్సెషన్ ఒప్పందంపై సంతకాలు
- 2002 వరకూ రూ. 800 పెట్టుబడితో నెట్టుకొచ్చిన నాట్కో
- ఫార్మా కంపెనీగా ఇన్‌ఫ్రా రంగంలో దాని అనుభవం శూన్యమే 
- 2004లో బాబు పదిరోజుల్లో దిగిపోతారనగా రూ. కోటి పెట్టుబడి
- 2005లో నవయుగ సంస్థ చేరాకే పనులకు ఊపు; రెండేళ్లలో పోర్టు పూర్తి
- ఆ నమ్మకంతోనే 2008లో పారిశ్రామిక సిటీకి ఓకే చెప్పిన వైఎస్
- అంతవరకే సీఎం బాధ్యత... తరువాత ప్రక్రియ వివిధ విభాగాలది
- 2009 సెప్టెంబర్‌లో వైఎస్ మరణించాక భూముల రిజిస్ట్రేషన్ మొదలు
- మూడు విడతలుగా 2010 సెప్టెంబర్ నాటికి 4,737 ఎకరాల అప్పగింత
- అవన్నీ విడిచిపెట్టి వైఎస్ టార్గెట్‌గా ‘ఈనాడు’ మతిలేని రాతలు
- ఏ కథనంలోనూ బాబు పాత్రను వీసమెత్తయినా ప్రస్తావించని తీరు
- ఎవరి హయాంలో భూములు రిజిస్ట్రేషన్ అయ్యాయో నోరెత్తని ‘రామోజీ మార్కు’ కథనం

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : వాస్తవాల్ని మరుగునపరిచి అబద్ధాన్ని పదేపదే చెబితే అది నిజమై కూర్చుంటుందన్నది చంద్రబాబు పాలసీ. ఆయన అవిభక్త కవలలాంటి రామోజీరావుదీ అదే విధానం. అందుకే ఆయన విషపుత్రిక ‘ఈనాడు’కు నిజాలక్కర్లేదు. వైఎస్ ఉంటే చాలు. తప్పు జరిగినా జరగకపోయినా... ఆ తప్పు చేసినది ఎవరైనా దానికి సంబంధం లేదు. వైఎస్ కుటుంబంపై విషం కక్కే అవకాశం ఉందా... లేదా! అదొక్కటే దానికి కావాల్సింది. తాజాగా ‘కృష్ణపట్నం’ పేర పేజీలకొద్దీ కక్కుతున్న కాలకూట విషం కూడా ఆ పాలసీ పుట్టలోని పాముదే. 

కృష్ణపట్నంలో పోర్టు నిర్మాణం కోసం 1996లో ఒప్పందం కుదుర్చుకున్నది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఇందుకోసం నాట్కో అధిపతి నన్నపనేని చౌదరితో 1997 జనవరి 4న కన్సెషన్ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. నిజానికి అప్పటికి దీనికి పోర్టులు కాదు కదా... కనీసం ఒక భవనం కట్టిన అనుభవం కూడా లేదు. రూ. 35 కోట్ల టర్నోవర్ ఉన్న ఈ కంపెనీకి ఏకంగా పోర్టునే కట్టబెట్టేశారు చంద్రబాబు. చిత్రమేమిటంటే ఈ కంపెనీ దీనిలో కేవలం రూ. 800 పెట్టుబడి (పెయిడప్ క్యాపిటల్) పెట్టి ఊరుకుంది. 1999లో ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను సమర్పించింది. ప్రభుత్వం ఓకే చేసేసింది. కానీ 2002 వరకూ ఈ రూ. 800 పెట్టుబడితోనే లాక్కొచ్చింది నాట్కో. 2002లో మరో రూ. 5 లక్షలు మాత్రం పెట్టుబడి (పెయిడప్ క్యాపిటల్) పెట్టింది. ఇక 2004లో చంద్రబాబు ప్రభుత్వం మరో 10 రోజుల్లో దిగిపోతుందనగా... ఏప్రిల్ 29న మరో రూ. 1.6 కోట్లు పెట్టింది. అదీ సంగతి. 2005లో దానికి భాగస్వామిగా నవయుగ సంస్థ రావటంతో మరో రూ. 20 కోట్లు పెట్టుబడి పెట్టడం... పనులు ఊపందుకోవటం... రెండేళ్లలోనే పోర్టు నిర్మాణం పూర్తికావటం జరిగాయి. 

పోర్టు పూర్తయ్యాకే పారిశ్రామిక సిటీ: ఇదీ కథ. చంద్రబాబు ఎలాంటి కంపెనీతో ఒప్పందం చేసుకున్నారో, ఏ పెట్టుబడీ లేకున్నా భూములెలా అప్పగించారో, కన్సెషన్ ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారో ‘ఈనాడు’కు అవసరం లేదు. ఎందుకంటే అది బాబు కనక. ఇదే చంద్రబాబు పోర్టు ఆధారిత పారిశ్రామిక సిటీ కోసం కూడా 1996లోనే... అదే నాట్కోతో ఒక ఒప్పందం చేసుకున్నారు. 

దాని ప్రకారం ఆ సంస్థ ఆరు నెలల్లోగా పారిశ్రామిక సిటీ కోసం ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తయారు చెయ్యాలి. కానీ ఒప్పందం కుదుర్చుకున్న పోర్టునే ఆరేళ్ల పాటు అటకెక్కించిన నాట్కో ఈ పారిశ్రామిక సిటీ దిశగా ఏమీ చెయ్యలేదు. 2004లో చంద్రబాబు దిగిపోయే ముందు... తమకు భూములిచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. అంతలోనే ప్రభుత్వం మారిపోయింది. 2007లో పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయటంతో... 2008లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణపట్నం సంస్థ పారిశ్రామిక నగరానికి సంబంధించి నివేదికను రూపొందించి చూపించింది. ఆ సమావేశంలో కలెక్టరు, సంబంధిత అధికారులు ఉన్నారన్నది మినిట్స్‌ను చూస్తే అర్థంకాక మానదు. 

సామర్థ్యం ఉంది కనక సరేనన్నారు: చంద్రబాబులా వైఎస్సార్ ఏ అనుభవమూ లేని చోటామోటా కంపెనీకి ఓకే చెప్పలేదు. అప్పటికే పోర్టు పూర్తి చేయటం... ప్రాజెక్టు నివేదిక సంతృప్తికరంగా ఉండటంతో రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పారిశ్రామిక సిటీకి సరేనన్నారు. ఆ తరువాత సెజ్ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి రావటం... అక్కడి నుంచి కేంద్రానికి వెళ్లటం అన్నీ జరిగాయి. ఈ సెజ్‌కు కేంద్రం పూర్తిస్థాయి అనుమతినిచ్చింది కూడా వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించాకే. అది కూడా 2010లో. ఏ కంపెనీకైనా భూములిచ్చేది ఏపీఐఐసీనే. అది ఎలాంటి జీవోలూ ఇవ్వదు. అలాట్‌మెంట్ లెటర్లు మాత్రమే ఇస్తుంది.

ఇక ఏపీఐఐసీ చేతికి ఆ భూముల్ని స్థానిక రెవెన్యూ యం త్రాంగం ఇస్తుంది తప్ప ముఖ్యమంత్రి కాదు. ప్రాజెక్టును ఓకే చేయటమే ముఖ్యమంత్రి బాధ్యత. తదనుగుణంగా ఎంఓయూ చేసుకోవాలన్నా... ఒకవేళ చాలా సందర్భాల్లో ఎంఓయూ అవసరం లేదు కనక భూము ల్ని జీవోల ఆధారంగా స్వాధీనం చేసుకోవాలన్నా... అదంతా దిగువస్థాయి యంత్రాంగమే చేస్తుంది... చేయాలి కూడా. అది సీఎం బాధ్యత కాదు. ఇక్కడా అ దే జరిగింది. ప్రాజెక్టు నివేదిక ప్రజెంటేషన్ చూశాక... అప్పటికే ఆ సంస్థ పోర్టును పూర్తిచేసింది కనక... రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సీఎం సరేనన్నారు. ఇంతలోనే 2009 సెప్టెంబర్ 2న ఆయన మరణించారు. 

వైఎస్ మరణించాకే భూముల అప్పగింత: వైఎస్సార్ కుటుంబంపై రామోజీ పగ ఏ స్థాయిదంటే... నిజానిజాలతో పనిలేదు. ఆధారాలు అసలే వద్దు. వైఎస్ ఏం చేసినా తప్పే. చేయకున్నా తప్పే. ఎందుకంటే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారిలో అరబిందో, హెటెరో, రాంకీ, వాన్‌పిక్ వంటి సంస్థలు ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులు చేపట్టాయి. వాటికి సంబంధించి వైఎస్సార్ హయాంలో జరిగిన ప్రతి కేటాయింపునకూ అవసరమైన ఎంఓయూలు, జీవోలు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా వాళ్లు ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టారు కనక అదంతా ‘క్విడ్ ప్రోకో’ అని తాను రాసి... తన పార్టీ చేత పిటిషన్ వేయించి... వైఎస్సార్ కుటుంబమే లక్ష్యంగా చెలరేగుతున్నారు రామోజీ. 

కృష్ణపట్నం విషయానికొచ్చేసరికి వైఎస్ ఇవ్వని భూములకు జీవో లేదని, ఎంఓయూ లేదని నానాయాగీ చేస్తున్నారు. దీన్నేమనుకోవాలి? ఇక్కడ రామోజీ కడుపుమంట స్పష్టంగా కనిపించటం లేదా? ఎందుకంటే వైఎస్సార్ హయాంలో ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పటం మాత్రమే జరిగింది. ఆ తరువాత 2009 సెప్టెంబర్ 28న... 2010 సెప్టెంబర్ 15న విడతలుగా కృష్ణపట్నం సంస్థకు ఏపీఐఐసీ భూముల విక్రయ అగ్రిమెంట్ కుదుర్చుకుని రిజిస్టర్ చేసింది. అంటే మొత్తం 4,737 ఎకరాలనూ వైఎస్సార్ మరణించాకే రిజిస్టరు చేసింది. ఒకవేళ వైఎస్సార్ ఓకే చేశారు తప్ప దానికి సంబంధించిన ప్రాసెస్ జరగలేదని, పూర్తి కాలేదని భావిస్తే వైఎస్ తరవాత వచ్చిన ముఖ్యమంత్రయినా ఆ భూముల్ని రిజిస్టర్ చేయటం నిలిపేయొచ్చు. ఏపీఐఐసీ కూడా అగ్రిమెంట్ కుదుర్చుకోకుండా ఉండి ఉండొచ్చు. 

ఆ భూముల్ని అప్పగించటం కూడా నిలిపేసి ఉండొచ్చు. ఇవేవీ చేయకుండా వైఎస్సార్ మరణానంతరం 4,737 ఎకరాలనూ రిజిస్టర్ చేశారు. అలా చేసిన ఏపీఐఐసీ గానీ, వైఎస్సార్ తరువాతి ముఖ్యమంత్రి గానీ రామోజీకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్లెవరూ ఆయన టార్గెట్ కాదు కనక. సత్తా లేని నాట్కో చౌదరికి భారీ పోర్టు, 10 రోజులు తిరక్కుండానే పారిశ్రామిక సిటీ ఇచ్చేసిన చంద్రబాబు కూడా రామోజీ దృష్టిలో మహానుభావుడే. ఆయన కూడా రాష్ట్రాభివృద్ధి కోసమే ఆ నిర్ణయం తీసుకున్నారట!! ఎందుకంటే అప్పట్లో ‘ఈనాడు’లో వచ్చిన కథనాలే దీనికి సాక్షి. వాళ్లందరినీ వదిలి... వైఎస్‌కే మొత్తం అంటగడుతూ శివాలెత్తటం ఏ మార్కు జర్నలిజం? ఇవేం విలువలు రామోజీ? ఏం! బాబు పాత్రను బయటపెడితే మీ సొమ్మేం పోతుంది?
Share this article :

0 comments: