ప్రజలకు మేలు చేస్తే కష్టాలా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలకు మేలు చేస్తే కష్టాలా?

ప్రజలకు మేలు చేస్తే కష్టాలా?

Written By news on Tuesday, June 11, 2013 | 6/11/2013


‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ అడుగులకు టీడీపీ మడుగులొత్తుతోంది. మాట వినని వారిని ఏం చేయడానికైనా వెనకాడటం లేదు. జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఉన్న ప్రజాదరణ చూసి జీర్ణించుకోలేని కాంగ్రెస్, టీడీపీలు... ఎలాగైనా దెబ్బతీయాలని కుట్రలు పన్నాయి. నేరుగా ఎదుర్కొంటే ప్రజలు గుణపాఠం చెబుతారని భావించి జిత్తులమారి నక్కలుగా వెన్నుపోటుకు దిగాయి. అందుకు సీబీఐని పావుగా వాడుకున్నాయి. జగన్‌పై అక్రమ కేసులు బనాయించి.. ఏడాదిగా జైలుపాలు చేశాయి. ఈ కుట్రలు, కుతంత్రాలకు సమాధి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయం’టూ జనం గళమెత్తారు. కదిరి పట్టణంలో వ్యాఖ్యాత ఎం.నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘సాక్షి చైతన్య పథం’లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. వైఎస్ కుటుంబంపై జరుగుతున్న కుట్రలు, అన్యాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సీబీఐ తీరును కడిగి పారేశారు. జగన్‌ను నిర్బంధించడం ముమ్మాటికీ కక్ష సాధింపేనని అభిప్రాయపడ్డారు. 

ప్రజలకు మేలు చేస్తే కష్టాలా? 

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 104, 108, ఆరోగ్యశ్రీ పథకాలతో పేదలకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి తెచ్చారు. పావలావడ్డీతో మహిళలకు రుణాలిచ్చారు. రైతుల రుణాలు మాఫీ చేశారు. వైఎస్ మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ పేదల పక్షాన నిలిచారు. ప్రజల్లో ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ కుట్రపన్ని జైల్లో పెట్టించాయి. ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారు. ఆయనను వెంటనే విడుదల చే యాలి. 
- ముషీదా, గృహిణి

కుట్రతో నిర్బంధించారు 

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కుట్రలు చేస్తున్నారు. జగన్‌పై వచ్చిన ఆరోపణల్లో ఇంతవరకు ఏ ఒక్క దానికీ ఆధారం లభించకపోయినా ఏడాదికి పైగా జైల్లో నిర్బంధించారు. ఇలాంటి చర్యలు చట్టానికి వ్యతిరేకం. ఇలాం టి వా టి వల్ల చట్టంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. జగన్ న్యాయబద్ధంగా అన్ని పన్నులూ చెల్లించారు. అదే రామోజీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. 
- గజ్జెల రవీంద్రారెడ్డి, రైతు 

బాబుకో న్యాయం, జగన్‌కో న్యాయమా? 

చంద్రబాబు రూ.వేల కోట్లు సంపాదించారని, ఆయనపై విచారణ జరపాలని ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అదే జగన్‌పై రాజకీయ దురుద్దేశంతో ఒకరిద్దరు ఫిర్యాదు చేయగానే ఆగమేఘాలపై విచారణ చేపట్టారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ చదువు కోసం ‘సత్యం’ రామలింగరాజు విదేశాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అది క్విడ్‌ప్రో కో కాదా? లాభాలు ఆశించి జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే క్విడ్‌ప్రోకో అంటూ విష ప్రచారం చేయడం న్యాయమా? పేద విద్యార్థులు ధనికుల పిల్లలతో సమానంగా చదువుతున్నారంటే ఆ మహానేత చలవే. అలాంటి పథకాన్ని నీరుగార్చే విధంగా కిరణ్ సర్కారు అనేక షరతులు విధిస్తోంది. 
- కవితారెడ్డి, డిగ్రీ విద్యార్థిని 

విచారణ ఇంకెన్నాళ్లు ? 

జగన్‌ను అరెస్ట్ చేసి ఏడాదైంది. విచారణ పేరుతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇంకెన్నాళ్లు విచారణ కొనసాగిస్తారు? ఒక వ్యక్తిని నేరారోపణల కింద అరెస్ట్ చేసినప్పుడు ఒకే చార్జ్‌షీట్ వేయాలి. ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని చార్జిషీట్లు వేస్తారా? ఇదెక్కడి న్యాయం? జగన్‌కు బెయిల్ ఇవ్వరా? రాష్ట్రంలో బ్రిటీష్ పాలనను తిరిగి తీసుకొస్తున్నారు. 
- నాగేంద్రరెడ్డి, అడ్వొకేట్ 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తూట్లు 

నిరుపేదలకు ఉన్నత విద్య అందించాలని తపించిన నేత వైఎస్సే. ఆయన చలవతో నేడు రాష్ట్రంలో వేలమంది నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి తూట్లు పొడిచింది. వేల మంది విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసింది. మహానేత ఆశయ సాధనకు కృషి చేస్తున్న జగన్‌ను జైల్లో పెట్టి ప్రజల ఉసురుపోసుకుంటున్న ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. జగన్ సీఎం అయితేనే విద్యార్థులకు ఉన్నత విద్య అందుతుంది. 
- కీర్తి మానస, బీటెక్ విద్యార్థిని 

కడుపు తరుక్కుపోతోంది 

దేశంలో ఏ ముఖ్యమంత్రి భార్యకూ ఇలాంటి అవస్థలు రాలేదు. కొండంత అండగా ఉన్న భర్తను పోగొట్టుకున్న వైఎస్ విజయమ్మ పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ప్రజల మధ్య ఉన్న జగన్‌ను అక్రమంగా, అన్యాయంగా కుట్ర పన్ని జైల్లో పెట్టారు. వైఎస్ విజయమ్మకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. యూపీ, తమిళనాడు, ఇతర రాష్ట్రాలలో సీబీఐ ఒక విధంగా.. జగన్ విషయంలో మరొక విధంగా ప్రవర్తిస్తోంది. జగన్‌ను ప్రజల నుంచి దూరం చేయలేరు. త్వరలోనే బయటకొస్తారు. 
- చంద్రకళ, గృహిణి

న్యాయ పోరాటాలు కొనసాగిస్తాం 

నాయకులు వస్తున్నారు.. పోతున్నారు. కానీ దళితుల గోడు పట్టించుకున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్సార్. అలాంటి మహానేత అడుగుజాడల్లో నడుస్తున్న జగన్‌ను జైల్లో పెట్టడం ఎంత వరకు సమంజసం? ప్రజల విశ్వసనీయతను సాధించడంలో జగన్ విజయం సాధించారు. దీన్ని ఓర్వలేని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు సీబీఐని పావుగా వాడుకుని అక్రమ కేసులు బనాయించాయి. ఈ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. జగన్‌ను జైలు నుంచి విడిపించుకునేందుకు న్యాయ పోరాటాలు కొనసాగిస్తాం. 
- రామచంద్ర, మాల మహానాడు జిల్లా కార్యదర్శి 

కుట్రను ప్రజలు గమనిస్తున్నారు

చేనేత కార్మికుల సంక్షేమానికి మహానేత రూ.321 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణానంతరం ప్రస్తుతప్రభుత్వం ఆ నిధులను ఇప్పటికీ ఖర్చు చేయలేదు. అప్పులు తీర్చలేక కార్మికులు మృత్యుఒడికి చేరుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి జాలి కలగడం లేదు. జగన్ జైలు నుంచి బయటకు రాకూడదని కాంగ్రెస్, టీడీపీ పన్నుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. జగన్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టి వాటికి బుద్ధి చెబుతారు. 
- ఇంద్రావతమ్మ, చేనేత సంఘం రాష్ట్ర కార్యదర్శి 

అరెస్ట్ దారుణం 

వైఎస్ రాజశేఖరరెడ్డికి గానీ, ఆయన కుమారుడికి గానీ దళితులంటే ఎనలేని ప్రేమ. 40 ఏళ్ల క్రితమే దళితులకు వైఎస్ చాలా దగ్గరయ్యారు. అనంతపురం జిల్లా అంటే ఆయనకు చాలా ప్రేమ. అలాంటి వ్యక్తి మరణించారని బాధపడుతుంటే... పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి, జగన్‌ను అరెస్ట్ చేయడం దారుణ ం. చంద్రబాబు కేసు విషయంలో సమయం లేదంటూ సీబీఐ జేడీ లక్ష్మినారాయణ తప్పించుకున్నారు. జగన్ కేసు అనగానే సెలవు దినాల్లో కూడా పనిచేశారు. 
- కొమ్మొద్ది అప్పల్ల, కదిరి

మాకిచ్చిన మాట కోసమే జైలుకెళ్లాడు 

కేవలం మాకు ఇచ్చిన మాటకోసమే వైఎస్ జగన్ జైలుకెళ్లాడు. ప్రజలు ఆయనకు దగ్గరైతే కాంగ్రెస్, టీడీపీ, ఎల్లో మీడియా ఎందుకంత కక్ష పెంచుకుంటున్నాయో అర్థం కావడం లేదు. జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికి ఇంతమంది ఒక్కటి కావాలా? ప్రజలకిచ్చిన మాటకోసం అర్ధరాత్రి వరకు జనంలో తిరగడమే ఆయన చేసిన తప్పా? జగన్ జైలుకు వెళ్లినా ఏమీ కాదు. కడిగిన ముత్యంలా బయటకొస్తారు. ఇలాంటి కుట్ర రాజకీయాలు చేసి ప్రజల నుంచి జగన్‌ను దూరం చేయలేరు. 
- రజియాసుల్తానా, గృహిణి 

కాంగ్రెస్ జేబు సంస్థ సీబీఐ 

కాంగ్రెస్ జేబు సంస్థగా సీబీఐ మారిపోయింది. ఇతర పార్టీల నేతలను భయపెట్టేందుకు సీబీఐని కాంగ్రెస్ వాడుకొంటోంది. సీబీఐ ద్వారా జగన్‌ను వేధింపులకు గురిచేయడం సబబు కాదు. ఆయన ఏ తప్పూ చేయలేదు కాబట్టి నిర్భయంగా న్యాయంపై నమ్మకంతో వేచి చూస్తున్నారు. ఆయనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. త్వరలోనే జైలు నుంచి బయటకొస్తారు.
- దినేష్‌కుమార్‌రెడ్డి, విద్యార్థి 

ఎల్లో మీడియా విష ప్రచారం ఆపాలి 

జగన్ విషయంలో ఎల్లో మీడియా విషప్రచారం చేస్తోంది. అదే కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కైనా పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని ప్రజలంతా గ్రహించారు. కేవలం ‘సాక్షి’ పత్రిక ద్వారానే వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయి. అలాంటి పత్రికను ఎలాగైనా మూయించాలని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు రాజకీయ మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా మాట కోసం నిలబడే వైఎస్ కుటుంబంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు.
- శ్రీనివాసరెడ్డి 

మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ వైఎస్ ఘనతే 

మైనార్టీల కష్టాలను గుర్తించిన ఏకైక నేత వైఎస్సార్. 4 శాతం రిజర్వేషన్ కల్పించి ముస్లింల అభ్యున్నతికి కృషి చేశారు. అలాంటి కుటుంబంపై కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయి. మహానేత ఆశయ సాధనకు పాటుపడుతున్న జగన్‌ను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. అలాంటి వ్యక్తులను అల్లా సహించరు. జగన్ కడిగిన ముత్యంలా బయటకొస్తారు.
- మౌలానా ఇస్మాయిల్

మానవ హక్కుల ఉల్లంఘనే 

జగన్ అరెస్టు ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనే. జగన్ విషయంలో ప్రభుత్వం, సీబీఐ వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తే ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోంది. కుట్రలకు నిలయాలుగా మారిన టీడీపీ, కాంగ్రెస్ జనాగ్రహంలో కొట్టుకుపోవడం ఖాయం. 
- శివారెడ్డి, రిటైర్డ్ ఎంఈఓ 

ఇన్ని ఇబ్బందులు పెడతారా?

మాది మధ్య తరగతి కుటుంబం. మా మామ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్యం చేయించడానికి ఇబ్బందులు పడ్డాం. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయించాం. ఇప్పుడు నా కూతురు ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఇంజనీరింగ్ చదువుకుంటోంది. రాజశేఖరరెడ్డి పుణ్యమా అని చాలా మంది బాగుపడ్డారు. అలాంటి కుటుంబాన్ని ఇబ్బందులు పెడతారా? 
- శ్రీదేవి, గృహిణి

అవి ఎల్లో మీడియాకు కన్పించవా? 

ఉప ఎన్నికలప్పుడు కేంద్రమంత్రి చిరంజీవి బంధువుల ఇంట్లో అక్రమంగా ఉన్న రూ.34 కోట్లు దొరికింది. చంద్రబాబు కుమారుడు లోకేష్‌ను విదేశాల్లో చదివించేందుకు సత్యం రామలింగరాజు పెద్దఎత్తున డబ్బు సమకూర్చాడు. ఇవన్నీ ఎల్లో మీడియాకు తెలియవా? వీటి గురించి ఎందుకు హైలెట్ చేయవు. జగన్ దీక్షలకు, ఓదార్పు యాత్రకు వేలాది మంది జనం వచ్చినా ఆ విషయం రాయలేదు. షర్మిల పాదయాత్ర విశేషాలను సరిగా రాయడం లేదు. వైఎస్ భారతి తన తండ్రికి అడ్డువచ్చిన పోలీసు భుజాన్ని తట్టిన విషయాన్ని పట్టుకుని ఎల్లోమీడియా ఓవరాక్షన్ చేసింది. పోలీసులపై భారతి చేయి చేసుకున్నట్లు ప్రచారం చేసి... ఏ మాత్రమూ సిగ్గులేకుండా ప్రవర్తిస్తోంది. ఆయా ఛానళ్ల యజమానులు తమ లోగోలపై టీడీపీ స్టిక్కర్లు అంటించుకుంటే సరిపోతుంది. 
- శంకర్‌రెడ్డి, కదిరి 
Share this article :

0 comments: