ఉన్నది ఉన్నట్టుగా రాస్తే ఉలుకెందుకు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉన్నది ఉన్నట్టుగా రాస్తే ఉలుకెందుకు?

ఉన్నది ఉన్నట్టుగా రాస్తే ఉలుకెందుకు?

Written By news on Thursday, June 20, 2013 | 6/20/2013

 మంత్రుల నిర్ణయాలన్నీ కరెక్టేనంటూ మరోసారి అసెంబ్లీలో వత్తాసు
* తన మాటలను ‘సాక్షి’ వక్రీకరించిందంటూ వ్యాఖ్యలు
* మంత్రుల నిర్ణయాలు చట్టబద్ధమేనని కోర్టుకెందుకు చెప్పలేదన్నదే ‘సాక్షి’ ప్రశ్న
* ఇదంతా జగన్‌పై కుట్రేనన్న విమర్శలకు బలం.. బట్టబయలు కావటంతో భరించలేకున్న సీఎం
* నిర్ణయాలు కరెక్టయితే క్విడ్ ప్రో కోకు తావెక్కడిది?
* అవన్నీ ఆ కంపెనీల పెట్టుబడుల్లో భాగం కాదా?.. ఇప్పటికే పలు కంపెనీలకు లాభాలు
* మిగిలిన వాటాదారులకూ లాభాలొచ్చే అవకాశం

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఉన్నది ఉన్నట్టుగా రాస్తే ఉలుకెందుకు?
అన్నది అన్నట్టుగా రాస్తే ఆగ్రహమెందుకు? 


అసెంబ్లీ ‘సాక్షి’గా పత్రికపై అభాండాలు వేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. ‘సాక్షి’ పత్రికలో వచ్చిన వార్తను పూర్తిగా చదివారా? ఆయన అనని మాటలనేమన్నా ప్రచురించామా? లేదే! మంత్రుల నిర్ణయాలు ఎక్కడా రాజ్యాంగానికి, ప్రొసీజర్‌కు, చట్టానికి వ్యతిరేకంగా లేవని మంగళవారం సభలో ముఖ్యమంత్రి చెప్పలేదా? ఆ నిర్ణయాలన్నీ కరెక్టేనని, అవన్నీ ప్రొసీజర్‌ను, పద్ధతులను అనుసరించి తీసుకున్నవేనని బుధవారం కూడా సభలో పునరుద్ఘాటించారుగా? ‘సాక్షి’ పత్రిక ప్రచురించింది దాన్నే కదా! దీన్లో తప్పేముంది? ‘సాక్షి’ అడిగింది ఒక్కటే! 2010 అక్టోబర్లో శంకర్రావు వేసిన పిటిషన్‌ను అనుసరించి, 2011 జనవరి 25న మొత్తం 52 మంది ప్రతివాదులకూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దాన్లో తొలి ప్రతివాది రాష్ట్ర ప్రభుత్వం కాగా.. మొదటి ఐదూ రాష్ట్ర ప్రభుత్వ విభాగాలే. మరి తమ నిర్ణయాలన్నీ కరెక్టేనని, అన్నీ చట్ట ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం తీసుకున్నవేనని ఆనాడే ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు? తమ నిర్ణయాలన్నీ కరెక్టేనని, అన్నీ చట్ట ప్రకారం తీసుకున్నవేనని ఆనాడే చెప్పి ఉంటే కోర్టు తీర్పు మరో రకంగా ఉండే అవకాశం లేదా? అసలు నిర్ణయాలన్నీ కరెక్టే అయితే వాటి వల్ల ఏ కంపెనీకైనా అయాచిత లబ్ధి కలుగుతుందా? అపుడు క్విడ్ ప్రో కో ఎక్కడుంటుంది? 

అన్ని కంపెనీలూ ఇన్వెస్ట్ చేశాయా?
ఇక్కడ గమనించాల్సిందొక్కటే. వైఎస్ హయాంలో కేబినెట్ ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. భూముల కేటాయింపులు, లీజులకు అనుమతులు, లెసైన్స్‌ల మంజూరు వంటి అంశాల్లో కొన్ని వేల నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. ఆ నిర్ణయాల వల్ల సహజంగానే కొన్ని కంపెనీలకు లబ్ధి కలిగి ఉండొచ్చు. మరి ఆ కంపెనీలు గానీ, వ్యక్తులు గానీ అంతా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టారా? లేదే!! పోనీ.. జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారందరికీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏదో ఒక లబ్ధి కలిగిందా? అది కూడా లేదే!! ఆయన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన వారిలో ప్రభుత్వంతో, ప్రభుత్వ నిర్ణయాలతో ఏమాత్రం సంబంధం లేని వారు సైతం ఉన్నారు. మరి క్విడ్ ప్రో కో ఎక్కడుంది? ‘సాక్షి’ అడిగింది కూడా ఇదే. ప్రభుత్వం ఇదే మాటను ఆనాడే కోర్టు ముఖంగా చెప్పి ఉంటే జగన్‌మోహన్‌రెడ్డిపై ఈ కేసు ఉండేదా? అని ప్రశ్నించింది ‘సాక్షి’. జగన్‌పై కేసు పెట్టటానికి, ఆయన్ను రాజకీయంగా వేధించటానికి ప్రభుత్వం కావాలనే ఆనాడు కుట్ర పూరితంగా మౌనం పాటించిందని, ఇపుడు మంత్రుల మెడకు చుట్టుకునేసరికి కొత్త రాగం తీస్తున్నారని స్పష్టంగా తెలుస్తోందిగా! దాన్నే బయటపెట్టింది ‘సాక్షి’. అంతేతప్ప వై.ఎస్.జగన్‌ను ముఖ్యమంత్రి సమర్థించారనో, ఆయన కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులను సీఎం సమర్థించారనో ఎక్కడా రాయలేదు. దురదృష్టమేమిటంటే.. ఇవ్వాళ చెప్పిన మాటలు ఆ రోజు ఎందుకు చెప్పలేదన్న ‘సాక్షి‘ సూటి ప్రశ్నకు ముఖ్యమంత్రి ఇప్పటికీ జవాబు చెప్పలేదు. పెపైచ్చు భుజాలు తడుముకుంటూ.. తాను చేసిన వ్యాఖ్యలను ‘సాక్షి’ వక్రీకరించిందని చెప్పుకొచ్చారు. 

కేసులో ఏం జరిగిందంటే...
* 2010 అక్టోబర్లో ఎమ్మెల్యే పి.శంకర్రావు రాష్ట్ర హైకోర్టుకు లేఖ రాశారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులపై దర్యాప్తు జరిపించాలని దాన్లో కోరారు. 
* లేఖను సుమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు.. అదనపు పత్రాలుంటే సమర్పించాలని అడిగింది. తెలుగుదేశం పార్టీ సాయంతో వాటిని కూడా సమర్పించారు శంకర్రావు. 
* తమను కూడా ఈ కేసులో భాగస్వామిగా చేర్చుకోవాలంటూ ముగ్గురు తెలుగుదేశం పార్టీ నేతలు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. 
* ఈ పిటిషన్లో 52 మంది ప్రతివాదులున్నారు. మొదటి ప్రతివాది రాష్ట్ర ప్రభుత్వం కాగా.. 52వ ప్రతివాది వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి. 
* విచారణకు స్వీకరించిన హైకోర్టు 2011 జనవరి 25న 52 మంది ప్రతివాదులకూ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల అయాచిత లబ్ధి పొందిన వారు అందుకు ప్రతిఫలంగా పెట్టుబడులు పెట్టారనేది కేసుగా పేర్కొని.. దానిపై స్పందించాలని నోటీసుల్లో కోరింది. 
* 52వ ప్రతివాదిగా ఉన్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సంస్థలు, ఇతర కంపెనీలు స్పందించాయి తప్ప.. 1 నుంచి 5వ ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు మాత్రం స్పందించలేదు. తమ నిర్ణయాలు తప్పో, ఒప్పో చెప్పలేదు. వాటివల్ల అయాచిత లబ్ధి కలగటం సాధ్యమో కాదో వివరించలేదు. 
* 2011 ఆగస్టు 10న కోర్టు తీర్పు వెలువరించింది. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్‌ల చేత ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించింది. 

Share this article :

0 comments: