అభిమానులు ఓటేసినా ‘క్విడ్‌ప్రోకో’ అంటారేమో.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అభిమానులు ఓటేసినా ‘క్విడ్‌ప్రోకో’ అంటారేమో..

అభిమానులు ఓటేసినా ‘క్విడ్‌ప్రోకో’ అంటారేమో..

Written By news on Wednesday, June 26, 2013 | 6/26/2013

సీబీఐని అడ్డుపెట్టుకొని అణగదొక్కడం దారుణమన్న మేధావులు 
అభిమానులు ఓటేసినా ‘క్విడ్‌ప్రోకో’ అంటారేమోనని ఎద్దేవా
కాబోయే సీఎం జగనేనని భరోసా

డోన్, న్యూస్‌లైన్: ప్రజలకు అండగా నిలుస్తున్న బిడ్డను ఆయన తల్లినుంచి ఏడాదికి పైగా దూరం చేసి, ఆ తల్లి కంట నీరొలికేలా చేస్తున్న దుష్టశక్తులకు ఆమె వేదనే ఉరిపాశం కానుందని డోన్ పట్టణవాసులు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు, విపక్షనేత అనుసరిస్తున్న ధోరణిపై మండిపడ్డారు. కొడుకు కోసం పరితపిస్తూ ధైర్యం కోల్పోకుండా పోరాడుతున్న ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు మద్దతు తెలిపారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని షాదీఖానాలో కిశోర్ వ్యాఖ్యాతగా మంగళవారం నిర్వహించిన సాక్షి చైతన్యపథంలో జగన్ అక్రమ నిర్బంధంపై వక్తలు విరుచుకుపడ్డారు. న్యాయవాది కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు తర్వాత చట్టం, న్యాయం విషయంలో చిత్రవిచిత్ర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఆఫ్రికాలో జాతి వివక్షపై పోరాడిన నెల్సన్ మండేలాను కూడా జైల్లో పెట్టి అణచివేయాలని చూశారని.. కాలక్రమంలో ఆయన ప్రజల ఆశీర్వాదంతో ఆ దేశ అధ్యక్షుడై చరిత్ర సృష్టించిన విషయాన్ని కుట్రదారులు గుర్తించాలని చెప్పారు. ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్, టీడీపీలకు గుణపాఠం చెప్పే రోజులు ఎంతో దూరం లేవన్నారు.

సుప్రీంకోర్టే ఎండగట్టింది..: రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు సుబ్బారావు మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసు విషయంలో సీబీఐ తీరు పంజరంలో చిలుకనే తలపిస్తోందన్నారు. 1954 లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురంలో తరిమెల నాగిరెడ్డి జైల్లో ఉండి పోటీ చేశారని, ఆయనకు ప్రత్యర్థిగా ఎన్నికల్లో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం సంజీవరెడ్డికి డిపాజిట్లు గల్లంతైన విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. అది పునరావృతం కానుందన్నారు. పొదుపులక్ష్మి సమాఖ్య మండల కన్వీనర్ రాధ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న సమయంలో తనిఖీచేసి అగౌరవ పరిచారని గుర్తుచేశారు. ఆ తల్లి వేదనే ప్రభుత్వ మెడకు ఉరితాడు కానుందని పేర్కొన్నారు. ప్రతి మహిళ జగన్‌మోహన్‌రెడ్డిలో తన తమ్ముడిని, సోదరుడిని, కుమారుడిని చూసుకుంటోందని, ఆయన ముఖ్యమంత్రి అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలిపారు. బీసీ సంఘం నేత నర్సింహులు మాట్లాడుతూ 2009 సంవత్సరానికి ముందు ప్రజాప్రతినిధి, ప్రభుత్వ ఉద్యోగి కాని జగన్‌మోహన్‌రెడ్డిపై 409, 120 (బి) సెక్షన్ల కింద కేసు ఎందుకు నమోదు చేశారో సీబీఐ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవుల్లో ఉండి 26 జీవోల విడుదలకు కారణమైన వారికి ఈ సెక్షన్లు ఎందుకు వర్తించవో కూడా చెప్పాలన్నారు. వ్యాపారవేత్త నూరుల్లాఖాన్ మాట్లాడుతూ వైఎస్ కుటుంబం వల్ల లక్షలాది కుటుంబాలకు మేలు జరిగిందని, ఆ కృతజ్ఞతతో ఆయన కుటుంబ సభ్యులకు ఎన్నికల్లో ఓటేసినా క్విడ్‌ప్రోకో కింద కేసులు నమోదు చేసే అవివేక స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. పాస్టర్ నిత్యానంద మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సును కోరే ఏసు ప్రభువును ఏ నేరం చేయకున్నా శిలువ వేసి శిక్షించారని, అందుకు ప్రతిఫలంగా ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. ప్రజల మనిషిని ఇబ్బందులకు గురిచేస్తే ఆ పాపానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

వైఎస్ ఉంటే నా బిడ్డ బతికేది
ముక్కుపచ్చలారని బిడ్డ సామీ.. ఏ పాపం ఎరుగకనే సచ్చిపోయింది. గుండెలో ఆయాసంగా ఉందని మూడేళ్ల పాపను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపిస్తే ముక్కు పిండి రూ.లక్ష వరకు వసూలు చేసి చేతులెత్తేశారు. దిక్కుతోచక ప్రభుత్వాసుపత్రికి పోతే మీ పాప పేరు రేషన్‌కార్డులో లేదు.. ఆరోగ్యశ్రీకి అర్హత లేదంటూ గెంటేశారు. మా కంటి పాప మాకు దూరమైంది. అదే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బతికుంటే నా బిడ్డ బతికేది. ఆయన హయాంలోనే మాలాంటి పేదోళ్లు సల్లగున్నారు. 
- మద్దమ్మ, కొండపేట, డోన్ 
Share this article :

0 comments: