ఓట్లేసినందుకు ‘క్విడ్ ప్రో కో’ అని ప్రజలనూ అరెస్టు చేస్తారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓట్లేసినందుకు ‘క్విడ్ ప్రో కో’ అని ప్రజలనూ అరెస్టు చేస్తారా?

ఓట్లేసినందుకు ‘క్విడ్ ప్రో కో’ అని ప్రజలనూ అరెస్టు చేస్తారా?

Written By news on Saturday, June 15, 2013 | 6/15/2013

జగన్‌కు ఓట్లేసినందుకు ‘క్విడ్ ప్రో కో’ అని ప్రజలనూ అరెస్టు చేస్తారా? 
409, 120(బి) సెక్షన్ కింద జననేతపై కేసు నమోదు అసంబద్ధం 
‘సాక్షి’ చైతన్యపథంలో వక్తలు, ఉద్యోగులు, విద్యార్థులు 

సాక్షి, కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజాస్వామ్య విరుద్ధంగా కొన్ని వ్యవస్థలు కుట్ర పన్నుతున్నాయని పలువురు మేధావులు, న్యాయవాదులు, విద్యార్థులు అభిప్రాయపడ్డారు. వైఎస్ కుటుంబం మా కుటుంబాలకు చేసిన మేలుకు కృతజ్ఞతగా భారీ మెజార్టీతో జగన్‌ను ఎంపీగా గెలిపిస్తే, అన్యాయంగా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టడం మమ్మల్ని అగౌరవపరిచినట్లే..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చైతన్య పథం’ శుక్రవారం వైఎస్సార్ జిల్లా కడపలోని అపూర్వ ఫంక్షన్ హాలులో జరిగింది. స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ 2009కి ముందు ప్రజాప్రతినిధి గానీ, ప్రభుత్వోద్యోగి గానీ కాని జగన్‌పై 409,120(బి) సెక్షన్ల కింద కేసు ఎందుకు నమోదు చేశారో సీబీఐ సమాధానం చెప్పాలన్నారు. 

మంత్రి పదవుల్లో ఉండి 26 జీవోల విడుదలకు కారణమైన వారికి ఈ సెక్షన్లు ఎందుకు వర్తించవో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆడిటర్ సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినవారు తమను మోసం చేశారని ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టాలన్నారు. అదేమీ లేకుండానే జగన్‌ను అరెస్టు చేయడం కుట్రపూరితమేనంటూ సీబీఐ తీరును దుయ్యబట్టారు. ఇంటాక్ కన్వీనర్ ఇలియాస్‌రెడ్డి మాట్లాడుతూ. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధిపై కేసు నిర్ధారణ కాకుండానే ఏడాదిపైగా జైల్లో పెట్టడం ప్రజ లను అగౌరవ పరిచినట్లే అన్నారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి చిరంజీవి వియ్యంకుడి ఇంట్లో కోట్ల రూపాయలు దొరికితే ఎలాంటి విచారణ చేపట్టలేదేమని ప్రశ్నించారు. మత గురువు మహ్మద్‌అలీ మాట్లాడుతూ పులి లాంటి జగన్ ఎక్కడ ఉన్నా కడపవాసుల అండ, ముస్లింల మద్దతు ఉంటాయన్నారు. విద్యార్థిని హనీషా మాట్లాడుతూ మాకు, జిల్లాకు వైఎస్ కుటుంబం వల్ల చాలా మేలు జరిగిందన్నారు. మరి ఎన్నికల్లో వారికి ఓట్లేస్తే క్విడ్ ప్రో కో అని మమ్మల్నీ జైల్లో పెడతారా?’ అని ప్రశ్నించారు. జగన్‌కు ఎప్పటికీ తమ మద్దతు ఉంటుందని కడప వాసులు ముక్తకంఠంతో నినదించారు.

వారి కోసం ప్రాణాలైనా ఇస్తాం

పెద్దాయన ‘రిమ్స్’ఆస్పత్రి కట్టించినారు. 108 ప్రవేశపెట్టారు. పిల్లోళ్ల చదువుకు ఎంతో మేలు చేసినారు. అట్టాంటాయన బిడ్డను ఉత్తిపుణ్యానికి జైల్లో పెట్టినారు. బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. మేం ఓట్లేసి గెలిపించుకున్న మా నేత లేడు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి. ప్రభుత్వం ఎంత కుట్ర పన్నినా జగన్ వెంటే ఉంటాం. వాళ్ల కోసం ప్రాణాలైనా ఇస్తాం.
- నాగమణెమ్మ, కడప
Share this article :

0 comments: