ప్రజలకు అండగా వైఎస్ కుటుంబం:విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలకు అండగా వైఎస్ కుటుంబం:విజయమ్మ

ప్రజలకు అండగా వైఎస్ కుటుంబం:విజయమ్మ

Written By news on Monday, June 24, 2013 | 6/24/2013

రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని, కార్యకర్తలకు, ప్రజలకు అండగా వైఎస్ కుటుంబం ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట జరుగుతున్న పార్టీ ప్రాంతీయ సదస్సులో ఆమె ప్రసంగించారు. రాజశేఖర రెడ్డి గారికి దాచుకోవడం, దోచుకోవడం తెలియదని చెప్పారు. లక్ష కోట్ల రూపాయలతో వైఎస్ జలయజ్ఞం పథకం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని కార్యకర్తలను కోరారు. ప్రజల్లో పార్టీకి మంచి ఆదరణ ఉందని చెప్పారు. రిజర్వేషన్లలో అక్రమాలు జరిగితే కోర్టుకు వెళతామని హెచ్చరించారు. 

కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి కూడా ప్రజలకు వివరించాలని చెప్పారు. ఆరోగ్యశ్రీలో వందకుపైగా వ్యాధులను తొలగించారు. 108కి ఫోన్ చేస్తే వాహనం ఎప్పుడు వస్తుందో తెలియదు. గ్రామసభల అనుమతిలేకుండానే పనులు జరుగుతున్నాయని తెలిపారు. కరెంట్ కోతలతో గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలంటే భయంలేదని కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఆయన భయం ఎవరికి కావాలట అన్నారు. కేంద్ర నుంచి పంచాయతీలకు రావలసిన నిధులు ఆగిపోయాయన్నారు. 

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు హయాంలో గ్రామపంచాయితీలకు నిధులు ఎందుకు అన్నారని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికలలో కూడా కుమ్మక్కు కుట్రలు సాగుతున్నాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార దర్పం ప్రదర్శంచే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్, టిడిపిలకు ఎందుకు ఓటేయాలని ఆమె ప్రశ్నించారు. 

ఉత్తరాఖండ్ విపత్తులో చనిపోయివారి ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతం విరాళంగా ఇస్తారని విజయమ్మ ప్రకటించారు. 
Share this article :

0 comments: