నెహ్రూ,ఇందిరల వారసత్వానికో న్యాయం, ఇతరులకు మరో న్యాయమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నెహ్రూ,ఇందిరల వారసత్వానికో న్యాయం, ఇతరులకు మరో న్యాయమా?

నెహ్రూ,ఇందిరల వారసత్వానికో న్యాయం, ఇతరులకు మరో న్యాయమా?

Written By news on Thursday, June 6, 2013 | 6/06/2013


ఇందిరాగాంధీ మరణించినప్పుడు లండన్‌లో ఉన్న రాజీవ్‌ను హుటాహుటిన పిలిపించి ప్రధానమంత్రిని చేశారు. అప్పటికి ఆయనకు ఏ రాజకీయ అనుభవమూ లేదు. వైఎస్సార్ మరణించేనాటికి జగనన్న కడప ఎంపీగా ఉన్నారు, రాజకీయ అనుభవం ఉంది. మరి జగన్ ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కాకూడదు? 2004, 2009లలో రెండుసార్లు కాంగ్రెస్‌కు అధికారం సాధించి పెట్టిన వైఎస్సార్ కుమారుడికి ప్రజాభిమానం ఉంది. మరి జగన్ ఏ విధంగా సి.ఎం. పదవికి అర్హులు కారు?! పార్టీ ఒక్కటే అయినా వ్యక్తులను బట్టి రాజకీయ పంథా మారటం అవకాశవాదమే. నెహ్రూ, ఇందిరల వారసత్వానికి ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా?

కాంగ్రెస్ పార్టీలోని ఈ విపరీత ధోరణులను, స్వార్థపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్‌కు, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తోడవటం ఈ దుష్పరిణామాలకు పరాకాష్ట. దీనిని బట్టి ఈ రెండు పార్టీలూ... జగన్ అన్నా, జగన్ పార్టీ అన్నా ఎంత భయపడుతున్నాయో అర్థం అవుతోంది. అయితే ఈ భయం... విలువలకు తిలోదకాలిచ్చి కుట్రలు, కుతంత్రాలు పన్నే స్థాయికి చేరటం అనారోగ్యకర రాజకీయ పరిణామాలకు నాంది అని చెప్పాలి. జగన్‌పైన, ఆయన పార్టీపైన ప్రజలకు ఉన్న అభిమానాన్ని తుడిచివేయాలనే క్రమంలో ఆయన తండ్రి వైఎస్సార్‌ని కూడా స్వయంగా కాంగ్రెస్ పార్టీవారే నిందించటం మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికి బాధ కలిగించే విషయమే. రాజకీయ అనుభవం లేనివారు, ప్రజల కోసం పనిచేయటం చేతకానివారు చేసే పని ఇది. నాయకుడంటే వైఎస్సార్‌లా ఉండాలనే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. ఇంతటి ప్రజాభిమానం ఆయన ఒక్కరికే సొంతం. అలాంటి వ్యక్తిపై సొంతపార్టీ నాయకులే బురదచల్లడం విచారకరం.

స్వభావరీత్యా నా కుటుంబ నేపథ్యాన్ని బట్టి నాకు కమ్యూనిస్టు భావాలు ఏర్పడ్డాయి. వైఎస్సార్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు నేను ఆంధ్రా యూనివర్సిటీలో బి.ఎల్ తృతీయ సంవత్సరం చదువుతున్నాను. ఆ ఏడాది వార్షికోత్సవానికి వైఎస్సార్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ ఉత్సవ పరిచయ సందర్భంలో ‘‘మీరు రాజకీయాలకు రావద్దు. బాగా చదివి ఉద్యోగాలు చేసి ప్రశాంతమైన జీవితం గడపండి’’ అని చెప్పారు. ఈ మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. 2004 అసెంబ్లీ ఎన్నికల కోసం తూ.గో.జిల్లా కడియం, రాజమండ్రి నియోజక వర్గాలను వైఎస్సార్ గారు డా॥మేరుగ నాగార్జున నేతృత్వంలో సర్వే చేయించారు. ఆ సర్వేలో నేను కూడా పాల్గొనడం నాకు సంతోషకరమైన సంగతి. 2004లో కాంగ్రెస్‌పార్టీ విజయంతో వైఎస్సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమపథకాలు ప్రవేశపెట్టారు. నేను ఆయన అభిమానిని అయ్యాను.

వైఎస్సార్ మరణానంతరం సంభవించిన పరిణామాల నేపథ్యంలో హైకోర్టు జగనన్న ఆస్తులపై విచారణ జరపమని సీబీఐని ఆదేశిస్తే, అత్యుత్సాహం ప్రదర్శించి విచారణ ప్రారంభించిన ఈ సీబీఐ... చంద్రబాబునాయుడు ఆస్తులపై విచారించవలసిందిగా హైకోర్టు ఆదేశిస్తే, పక్షపాత బుద్ధితో వ్యవహరించింది. జగనన్నను అరెస్ట్ చేసి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆందోళనకు గురిచేసింది. అయితే జగనన్న అరెస్ట్ వలన ప్రజల్లో అభిమానం అధికం అయిందే కాని తరగలేదు. ఇందుకు నిదర్శనం 17 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 15 స్థానాల్లో పార్టీ ఘన విజయం సాధించటం. ఏదేమైనా త్వరలోనే జగనన్న జైలు నుండి బయటకు వస్తాడు. రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం సాధించిపెడతారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేస్తారు.

- దోవ రవీంద్రబాబు, అమృతలూరు, గుంటూరు

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: