నియోజకవర్గానికి ఒకటే మద్యం షాపు:వైఎస్ఆర్ సిపి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నియోజకవర్గానికి ఒకటే మద్యం షాపు:వైఎస్ఆర్ సిపి

నియోజకవర్గానికి ఒకటే మద్యం షాపు:వైఎస్ఆర్ సిపి

Written By news on Wednesday, June 5, 2013 | 6/05/2013

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నియోజకవర్గంలో ఒకటే మద్యం షాపు ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పినట్లు శాసనసభలో ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ మద్యం షాపులపై చంద్రబాబు వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలను వెయ్యికి తగ్గిస్తామని చెప్పారన్నారు. తాను అధికారంలోకి రాగానే చంద్రబాబు బెల్ట్‌షాపులు రద్దుచేస్తానంటున్నారని, అసలు ప్రపంచానికి బెల్ట్ షాపులను పరిచయం చేసింది ఆయన కాదా? అని ప్రశ్నించారు. బెల్ట్‌షాపుల రద్దుపై సంతకం పెట్టేందుకు అవేమైనా అధికారికంగా ఏర్పాటు చేసినవా? అని అడిగారు. మద్యపాన నిషేధ ఉద్యమకారుల్ని మోసం చేసింది గుర్తులేదా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో 40 వేల బెల్టుషాపులు ఉన్నట్లు ఆ పార్టీ అధికార గెజిట్ లాంటి ఈనాడులోనే ఓ కథనం వచ్చినట్లు తెలిపారు.

బెల్ట్ షాపుల విషయంలో ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. రాష్ట్రంలో లక్షల్లో మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయని తెలిపారు. ప్రతి 70 కుటుంబాలకు ఒక బెల్ట్ షాపు ఉందన్నారు. ప్రతి 70 కుటుంబాలకు ఒక పాఠశాలలేదని చెప్పారు. మద్య నియంత్రణపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్లీనరీలోనే చెప్పినట్లు తెలిపారు. దేశం మొత్తంమీద అత్యుత్తమమైన మద్యం విధానాన్ని అమలు చేస్తామని రెండేళ్ల క్రితమే జగన్ చెప్పారని గుర్తు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపానంపై జగన్ ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు.

వైఎస్ జగన్ ములాఖత్‌లపై టీడీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారన్నారు. నిబంధనల కనుగుణంగానే ములాఖత్‌లు ఉన్నాయని జైళ్లశాఖ అధికారులు చెప్పినా టీడీపీ నేతల చెవికి ఎక్కడం లేదన్నారు. చంద్రబాబుకు కానీ, యనమలకు కానీ జగన్ ములాఖత్‌లపై అనుమానం ఉంటే అదే జైలుకెళ్లి జగన్‌కు కాపలాగా కూర్చొండని సలహా ఇచ్చారు.
Share this article :

0 comments: