‘సుప్రీం’ ఆదేశం బేఖాతరా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘సుప్రీం’ ఆదేశం బేఖాతరా?

‘సుప్రీం’ ఆదేశం బేఖాతరా?

Written By news on Friday, June 7, 2013 | 6/07/2013

సీబీఐ అస్త్రంగా సర్కారు ఫీట్లు
‘సాక్షి’ చైతన్యపథం సదస్సులో వక్తలు

‘కాంగ్రెస్ కనుసన్నల్లో మెలుగుతూ చట్టాలను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న సీబీఐపై ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లుతోంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలనూ తాము పాటించే అవకాశాలు లేవన్నట్టు సీబీఐ న్యాయవాదులు సంకేతాలిస్తున్నారు. జగన్‌మోహన్ రెడ్డి కేసు దర్యాప్తును మరింత కాలం సాగదీసేందుకు సీబీఐ ప్రణాళికలు రచిస్తోంది’ అంటూ పలువురు మేధావులు, న్యాయవాదులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, ప్రజలు చిత్తూరులో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చైతన్యపథం సదస్సులో మండిపడ్డారు. 


సాక్షి, చిత్తూరు: తన మాట వినని వారిపై, రాజకీయ పా ర్టీలపై కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న కుట్రలు ఇక సాగవని పలువురు వక్తలు స్పష్టం చేశారు. తనకు నచ్చని రాజకీయపార్టీలను, నాయకులను అణదొక్కాలనే కాంగ్రెస్ పార్టీ వైఖరిని చూ స్తూ జనం ఊరుకోరని వారు హెచ్చరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు అస్త్రంతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఉద్వాసన చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. గురువారం చిత్తూరు లో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన చైతన్యపథం సదస్సుకు చిత్తూరు నగరంలో పాటు పరిసర ప్రాంతాలు, జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి మేధావులు, ప్రజలు హాజరయ్యారు. సదస్సుకు వ్యాఖ్యాతగా నరసింహారావు వ్యవహరించారు.

పలువురు మాట్లాడుతూ జగన్ మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేయడంతోనే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగినందునే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ అక్రమ కేసులు బనాయించడంతో పాటు దర్యాప్తును సాగదీ స్తోందని వారు అభిప్రాయపడ్డారు.

సీబీఐ సాగిస్తున్న దర్యాప్తు తీరును వారు ఎండగట్టారు. దేశంలో ఎన్నడూ లేదని విధంగా జగన్‌పై సీబీఐ దర్యాప్తు చేస్తోందని సదస్సుకు హాజరైన వివిధ రంగాలకు చెందిన మేధావులు అభిప్రాయపడ్డారు. గతంలో ఏ కేసులోనూ లేని విధంగా జగన్‌పై సాగుతున్న దర్యాప్తులో పరి మితికి మించి చార్జీషీట్లు దాఖలవుతున్నాయన్నారు. ఈ తరహా దర్యాప్తును తామెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దురుద్దేశపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నందునే ఏడాదికి పైగా విచారణ ఖైదీగానే జగన్ జైలు నిర్బంధంలో ఉన్నారని అన్నారు. తన మాట వినని, తన విధానాలను వ్యతిరేకించే వారిపై కాంగ్రెస్ పార్టీ సీబీఐని ఉసిగొల్పుతోందని జగన్ కేసును పరిశీలించిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతోందన్నారు. అనుకూలంగా ఉన్నవారిపై ఒక రకంగా, వ్యతిరేకించే వారిపై మరోవిధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందనడాని కి ఇటీవల పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తరహా రాజకీయాలకు కాలం చెల్లించదంటూ, భవిష్యత్తులో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. 

జగన్ ప్రభంజనం చూసి ఓర్వలేకే..

జగన్‌మోహన్ రెడ్డికి ప్రజల్లో వెల్లువలా వస్తున్న ఆదరణ చూసి టీడీపీ అధికార పార్టీతో కు మ్మక్కై జగన్‌ను జైలు గోడలకే పరిమితం చే యాలని ఉమ్మడి కుట్రలకు తెరలేపిందన్నారు. జగన్‌పై నమోదైన కేసుకు సంబంధించి సీబీఐ సాగిస్తున్న దర్యాప్తు కక్ష పూరితమైనదేనన్న భావన సర్వత్రా వినిపిస్తోందన్నారు. సదస్సు లో చిత్తూరుకు చెందిన న్యాయవాదులు మోహన రామిరెడ్డి, చక్రవర్తి రెడ్డి, ప్రసాదరెడ్డి, దళిత సంఘం నేత పీటీఎం శివ ప్రసాద్, ఉ ద్యోగ జేఏసీ నేత రెడ్డిశేఖర్‌రెడ్డి, విద్యార్థి సంఘం నేతలు భాను ప్రకాష్, సుమన్ రాజు, రిటైర్డ్ వైద్యులు మోహన్‌రాజు, జన వికాస సంస్థ జిల్లా అధ్యక్షురాలు ప్రమీల, ఆర్టీసీ కార్మిక సంఘం నేత ప్రసాద్, పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. 
Share this article :

0 comments: