జగన్ సీఎం కావడం తథ్యం: నల్లా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ సీఎం కావడం తథ్యం: నల్లా

జగన్ సీఎం కావడం తథ్యం: నల్లా

Written By news on Wednesday, June 12, 2013 | 6/12/2013

మెదక్: వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌ను అక్రమంగా జైలులో నిర్బంధించడం అక్రమమని, ఎవరెన్ని కుట్రలు పన్నినా జగన్ సీఎం కావడం తథ్యమని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ రావు పేర్కొన్నారు. మంగళవారం కల్హేర్ మండలం మీర్ఖాన్‌పేటలో వైఎస్సార్ సీపీ జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. 

ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బిడెకన్నె హన్మంతుతో కలిసి నల్లా సూర్యప్రకాశ్‌రావు పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సూర్య ప్రకాశ్‌రావు ప్రసంగిస్తూ వైఎస్సార్ సీపీ అధినేత జగన్ సీఎం ఎప్పుడవుతారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
Share this article :

0 comments: